Love Me OTT: అప్పుడే ఓటీటీలోకి ‘బేబీ’ హీరోయిన్ లేటెస్ట్ హారర్ మూవీ.. ‘లవ్ మీ’ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య, ఆశిష్ రెడ్డి జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం లవ్ మీ. 'If You Dare' అన్నది శీర్షిక. అరుణ్ భీమవరపు తెరకెక్కించిన ఈ హారర్ లవ్ స్టోరీలో రవికృష్ణ, సిమ్రాన్ చౌదరి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. టీజర్, పోస్టర్స్, ట్రైలర్ తో ఆసక్తిని రేకెత్తించిన లవ్ మీ సినిమా మే 25 న థియేటర్ లో విడుదలైంది.
బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య, ఆశిష్ రెడ్డి జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం లవ్ మీ. ‘If You Dare’ అన్నది శీర్షిక. అరుణ్ భీమవరపు తెరకెక్కించిన ఈ హారర్ లవ్ స్టోరీలో రవికృష్ణ, సిమ్రాన్ చౌదరి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. టీజర్, పోస్టర్స్, ట్రైలర్ తో ఆసక్తిని రేకెత్తించిన లవ్ మీ సినిమా మే 25 న థియేటర్ లో విడుదలైంది. అయితే అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. సినిమా కాన్సెప్ట్ బాగున్నా ప్రజెంటేషన్, స్క్రీన్ ప్లే పరంగా నెగటివ్ టాక్ వినిపించింది. దీంతో లవ్ మీ సినిమా అనుకున్న అంచనాలను అందుకోలేకపోయింది. ఇప్పటికీ చాలా చోట్ల థియేటర్లలో ఆడుతోన్న లవ్ మీ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి సామాజిక మాధ్యమాల్లో ఒక వార్త వినిపిస్తోంది. ఈ నెలలోనే ఈ హారర్ లవ్ స్టోరీ డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుందని ప్రచారం నడుస్తోంది. లవ్ మీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో జూన్ 15 నుంచి లేదా 22 నుంచే ఈ మూవీని ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది
కాగా లవ్ మీ సినిమాలో రాజీవ్ కనకాల కీలక పాత్ర పోషించాడు. అలాగే మలయాళ బ్యూటీ సంయుక్తా మేనన్ అతిథి పాత్రలో మెరవడం విశేషం. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి, నాగ మల్లిడి ఈ సినిమాను నిర్మించారు. ఆస్కార్ విజేత ఎమ్ ఎమ్ కీరవాణి ఈ సినిమాకు స్వరాలందించడం విశేషం. అలాగే పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు.
ఇక లవ్ మీ సినిమా కథ విషయానికి వస్తే.. ఇందులో హీరో అర్జున్ (ఆశిష్ రెడ్డి )ఓ యూట్యూబర్.. దెయ్యాలు లేవని నిరూపించడానికి.. వీడియోస్ చేస్తూ దాని నుంచి ఆదాయం గడిస్తూ ఉంటాడు. ఒక రోజు తెలంగాణ, కర్ణాటక రాష్ట్ర సరిహద్దులోని ఓ ఊరిలో దివ్యవతి అనే ఓ దెయ్యం ఉందని, ఆమెను చూసిన వారు ప్రాణాలతో తిరిగి రాలేదని అర్జున్ కు తెలుస్తుంది. దీనితో దివ్యవతిని వెతుక్కుంటూ.. హీరో తన సోదరుడు (రవి కృష్ణ)తో కలిసి ఆ గ్రామానికి వెళ్తాడు. మరి అక్కడ దివ్యవతి గురించి అర్జున్ ఏం తెలుసుకున్నాడు? దయ్యాన్ని ప్రేమించాలని అర్జున్ ఎందుకు అనుకున్నాడు? అతడి ప్రేమ కథ ఏమైంది? అర్జున్‌కు ప్రియకు (వైష్ణవి చైతన్య) ఉన్న సంబంధం ఏమిటి? అన్నది తెలుసుకోవాలంటే లవ్ మీ సినిమా చూడాల్సిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.