Bigg Boss 5 Telugu: షణ్ముఖ్‌కు తనకు మధ్య ఏముందో చెప్పేసిన సిరి..చెప్తూ తెగ సిగ్గుపడిందిగా..

బిగ్ బాస్ సీజన్ 5 రోజు రోజుకు ఆసక్తికరంగా సాగుతోంది. కంటెస్టెంట్స్ మధ్య రకరకాల గొడవలు, ఏడుపులు, కొట్లాటలతో రచ్చ రచ్చగా ఉంది.

Bigg Boss 5 Telugu: షణ్ముఖ్‌కు తనకు మధ్య ఏముందో చెప్పేసిన సిరి..చెప్తూ తెగ సిగ్గుపడిందిగా..
Siri
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 18, 2021 | 6:40 AM

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5 రోజు రోజుకు ఆసక్తికరంగా సాగుతోంది. కంటెస్టెంట్స్ మధ్య రకరకాల గొడవలు, ఏడుపులు, కొట్లాటలతో రచ్చ రచ్చగా ఉంది. ఇక నిన్నటి ఎపిసోడ్ కూడా చాలా రసవత్తరంగా సాగింది. హౌస్ లో ఉన్నవాలందరు  గ్రూపులుగా డివైడ్ అయ్యి గేమ్ ఆడుస్తున్నారని నెటిజన్లు అంటున్నారు. ఇక బిగ్ బాస్ హౌస్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సిరి షణ్ముఖ్ ల గురించి. ఈ ఇద్దరు బయట మంచి ఫ్రెండ్స్ కావడంతో హౌస్ లో కలిసి గేమ్ ఆడుతున్నారు. ఇక ఈ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం చేశాడు రవి. అంతకు ముందు కెప్టెన్ పోటీదారుల టాస్క్‌లో భాగంగా సన్నీకి పవర్ టూల్ లభించడంతో.. రెండు కవర్లు ఇచ్చి వాటిలో ఒకటి ఎంచుకుని పవర్‌ని ఉపయోగించమని చెప్తారు బిగ్ బాస్. అయితే సన్నీ ఎంచుకున్న కవర్ లో హౌస్ లో ఉన్నవాళ్ళదగ్గర నుంచి ముత్యాలు తీసుకుకొని ఇంకొకరికి ఇవ్వాలని ఉంది. దాంతో సిరి దగ్గర నుంచి తీసుకొని మానస్ కు ఇస్తానని చెప్పాడు. ఆతర్వాత షణ్ముఖ్ మాట విని ఆ ముత్యాలు షణ్ముఖ్ యూ ఇచ్చేశాడు. దాంతో సిరి మొహం మాడ్చుకుంది.

ఆతర్వాత సిరి రవి మధ్య డిస్కషన్ నడిచింది. నిన్నటి మొన్నటి ఎపిసోడ్ లో సిరికి షణ్ముఖ్ కు మధ్య చిన్న వార్ నడిచిన విషయం తెలిసిందే. బాత్రూం లోకి వెళ్లి మరి ఏడ్చింది సిరి. దీని పై రవి ఆరా తీశాడు. సిరి మాట్లాడుతూ.. ఇద్దరికీ బాగా ఎమోషనల్ కనెక్షన్ వచ్చేసింది. వాడి తప్పే కాదు నాది కూడా ఉంది అని అన్నది. మరి షణ్ముఖ్ నాదే తప్పు అంటున్నాడు ఏంటి? అని రవి అంటే.. సిరి తెగ సిగ్గుపడిపోయింది. దీంతో రవి.. మీరిద్దరూ ఏంటో నాకు అర్థం కావడం లేదు.దానికి అదేం లేదు.. వాడు బాగా ట్రిప్ అవుతున్నాడు.. అంతే అని సిరి అంది.. కేవలం నీ విషయంలోనే ఎందుకు ట్రిప్ అవుతున్నాడో అది ఆలోచించు అంటూ రవి అన్నాడు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Priyamani: ఎర్రచీరలో ప్రియమణి అదిరేటి అందాలు.. కుర్రాళ్ల మతులు పోవాల్సిందే.! వైరల్ పిక్స్!

Madonna Sebastian: అందాల సోయగం మడోన్నా సెబాస్టియన్ సొగసు చూడతరమా.. వైరల్ అవుతున్న లేటెస్ట్ పిక్స్..

Jai Bhim: సూర్య సినిమా ఆస్కార్‌ అందుకుంటుంది.. జై భీమ్‌పై ఎమ్మెల్యే సీతక్క ట్వీట్‌..