AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఇదేందయ్యా ఇదీ.. మామూలు కథ కాదు భయ్యా.. ఈ వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

పిల్లి, కుక్క ఎదురుపడితే చాలు.. యుద్ధమే అనుకుంటాం.. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో మాత్రం ఈ సహజ వైరానికి కాలం చెల్లింది. ఖమ్మంలోని ఓ ఇంట్లో పిల్లి, కుక్క ప్రాణస్నేహితుల్లా కలిసి తిరుగుతూ, ఆడుకుంటూ స్థానికులను కట్టిపడేస్తున్నాయి. జాతి వైరాన్ని మరిచి మూగజీవాలు పెనవేసుకున్న ఈ అపూర్వ బంధం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

Telangana: ఇదేందయ్యా ఇదీ.. మామూలు కథ కాదు భయ్యా.. ఈ వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
Cat And Dog Unlikely Friendship
N Narayana Rao
| Edited By: |

Updated on: Oct 30, 2026 | 5:14 PM

Share

పిల్లీ కుక్కల్లా కొట్టుకుంటున్నారు అనే సామెత మన నిత్యజీవితంలో తరచూ వింటూనే ఉంటాం. ఒకే చోట కనిపిస్తే చాలు.. కారాలు మిరియాలు నూరుతూ వెంటపడి మరీ కొట్టుకునే స్వభావం వాటిది. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఓ ఇంట్లో మాత్రం ఈ సహజ వైరం చెరిగిపోయింది. జాతి వైరాన్ని పక్కనపెట్టి ఆ పిల్లి, కుక్క పంచ ప్రాణాలుగా కలిసిమెలిసి జీవిస్తూ స్థానికులను అబ్బురపరుస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణంలోని బండి సుబ్రహ్మణ్య నగర్‌కు చెందిన మౌలాలి ఇంట్లో ఈ అరుదైన దృశ్యం కనిపిస్తోంది. ఆయన ఇంట్లో పెరుగుతున్న పిల్లి, కుక్క ఎంతో అన్యోన్యంగా కాలం గడుపుతున్నాయి. రోజంతా ఒకదానితో మరొకటి కలిసి ఆడుకోవడం, ఒకేచోట పడుకోవడం, పరస్పరం లాలించుకోవడం వంటి దృశ్యాలు చూసేవారిని కట్టిపడేస్తున్నాయి. వీధిలోకి పిల్లి అడుగుపెడితేనే వెంటపడే కుక్కలున్న ఈ రోజుల్లో, ఒకే ఇంట్లో ఈ రెండు జీవులు అన్నాదమ్ముల్లా కలిసి తిరగడం స్థానికుల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది.

సహజ శత్రుత్వానికి అతీతంగా..

ప్రకృతి సిద్ధంగా పాము-ముంగిస, పిల్లి-ఎలుక, పిల్లి-కుక్కల మధ్య వైరుధ్యం సహజం. అయితే చిన్నప్పటి నుంచి ఒకే వాతావరణంలో కలిసి పెరిగినప్పుడు, ప్రేమను పంచినప్పుడు పరస్పరం అలవాటు పడి సహజీవనం సాగిస్తాయని ఈ ఘటన నిరూపిస్తోంది. మౌలాలి ఇంట్లో ఈ మూగజీవాలు ప్రదర్శిస్తున్న ఈ అనుబంధం చూసి చుట్టుపక్కల వారు, జంతు ప్రేమికులు మురిసిపోతున్నారు.

మనుషులకు మూగజీవాల పాఠం

చిన్న చిన్న కారణాలకే స్వార్థం, ద్వేషాలతో మనుషులు ఘర్షణలకు దిగుతున్న నేటి సమాజంలో.. జాతి వైరాలనే మరిచి స్నేహంగా మెలుగుతున్న ఈ పిల్లి, కుక్కల బంధం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది. పరస్పర సహనం, స్నేహం, ప్రేమ ఉంటే ఎలాంటి వైరుధ్యాలనైనా జయించవచ్చని ఈ మూగజీవాలు చెప్పకనే చెబుతున్నాయని స్థానికులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ అపూర్వ స్నేహానికి సంబంధించిన విషయాలు పరిసర ప్రాంతాల్లో వైరల్‌గా మారాయి.

వీడియో చూడండి..

Follow Us
నవంబర్‌లో వారికి ఉద్యోగం, పెళ్లి, ఆస్తి యోగాలు.. మీ రాశి ఫలితం
నవంబర్‌లో వారికి ఉద్యోగం, పెళ్లి, ఆస్తి యోగాలు.. మీ రాశి ఫలితం
ఇస్రో GSLV-F18 రాకెట్‌ను ఎందుకు ప్రయోగిస్తోంది? ప్రయోజనాలు ఏమిటి?
ఇస్రో GSLV-F18 రాకెట్‌ను ఎందుకు ప్రయోగిస్తోంది? ప్రయోజనాలు ఏమిటి?
ఇదేందయ్యా ఇదీ.. మామూలు కథ కాదు భయ్యా.. ఈ వీడియో చూస్తే ఫిదా..
ఇదేందయ్యా ఇదీ.. మామూలు కథ కాదు భయ్యా.. ఈ వీడియో చూస్తే ఫిదా..
నీటికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా? అసలు నిజం ఇదే!
నీటికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా? అసలు నిజం ఇదే!
ఖాళీ సీసాలు తిరిగిస్తే డబ్బులు.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్‌
ఖాళీ సీసాలు తిరిగిస్తే డబ్బులు.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్‌
క్యాచ్ ఆఫ్ ది ఇయర్.. బౌండరీ లైన్‌లో ది బెస్ట్ అంటే ఇదేనేమో
క్యాచ్ ఆఫ్ ది ఇయర్.. బౌండరీ లైన్‌లో ది బెస్ట్ అంటే ఇదేనేమో
రూ. 5 లక్షలు ఖర్చుపెట్టి నన్ను పరీక్షించారు.
రూ. 5 లక్షలు ఖర్చుపెట్టి నన్ను పరీక్షించారు.
4వ మ్యాచ్‌లో తేలిపోయిన బ్యాటర్లు.. చిత్తుగా ఓడిన భారత్..!
4వ మ్యాచ్‌లో తేలిపోయిన బ్యాటర్లు.. చిత్తుగా ఓడిన భారత్..!
గ్యాస్ స్టవ్‌పై పాలు పొంగాయా? వెంటనే మళ్లీ వెలిగిస్తే ప్రమాదమే..
గ్యాస్ స్టవ్‌పై పాలు పొంగాయా? వెంటనే మళ్లీ వెలిగిస్తే ప్రమాదమే..
ప్రతి విద్యార్థి 2 భాషలు నేర్చుకోవాలి.. ఒకటి మాట్లాడటానికి మరొకటి
ప్రతి విద్యార్థి 2 భాషలు నేర్చుకోవాలి.. ఒకటి మాట్లాడటానికి మరొకటి
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన.. రైతులకు భరోసా
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన.. రైతులకు భరోసా
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!
బ్రాండెడ్‌ బియ్యం పేరుతో వినియోగదారులకు టోకరా
బ్రాండెడ్‌ బియ్యం పేరుతో వినియోగదారులకు టోకరా
ఆ వ్యాఖ్యలకు కొండా సురేఖ క్షమాపణ.. కేటీఆర్ రియాక్షన్ ఏమంటే?
ఆ వ్యాఖ్యలకు కొండా సురేఖ క్షమాపణ.. కేటీఆర్ రియాక్షన్ ఏమంటే?
అడ్డంగా దొరికిపోయిన చైన్ స్నాచర్లు..ఆ తర్వాత ఊహించని సీన్
అడ్డంగా దొరికిపోయిన చైన్ స్నాచర్లు..ఆ తర్వాత ఊహించని సీన్
నడిరోడ్డుపై బోల్తాపడిన భారీ కంటైనర్.. తృటిలో తప్పిన బైకర్!
నడిరోడ్డుపై బోల్తాపడిన భారీ కంటైనర్.. తృటిలో తప్పిన బైకర్!
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే
గోల్డ్ షాప్‌లో మహిళల చేతివాటం.. రూ.45 లక్షల విలువైన బంగారం మాయం
గోల్డ్ షాప్‌లో మహిళల చేతివాటం.. రూ.45 లక్షల విలువైన బంగారం మాయం
200 ఏళ్ల శివాలయం నుంచి పురాతన నంది మిస్సింగ్...
200 ఏళ్ల శివాలయం నుంచి పురాతన నంది మిస్సింగ్...
అర్నబ్ తుఫాన్ దెబ్బకు ఏపీ అతలాకుతలం.. ఏ పంటకు ఎంత పరిహారమంటే..?
అర్నబ్ తుఫాన్ దెబ్బకు ఏపీ అతలాకుతలం.. ఏ పంటకు ఎంత పరిహారమంటే..?