Shamshabad Accident: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని నర్కూడ గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన టయోటా ఇన్నోవా కారు రోడ్డు పక్కన గోడను ఢీకొని పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి.