AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: క్యాచ్ ఆఫ్ ది ఇయర్.. బౌండరీ లైన్‌లో ది బెస్ట్ అంటే ఇదేనేమో.. వీడియో చూస్తే గూస్ బంప్సే..!

భారత్, న్యూజిలాండ్ మ్యాచ్‌లో మరో అద్భుతమైన ఫీల్డింగ్ విన్యాసం కనిపించింది. నమన్ ధీర్ భారీ షాట్ ఆడగా.. డారిల్ మిచెల్ మొదట క్యాచ్ అందుకున్నాడు. బౌండరీ దాటే ప్రమాదం కనిపించడంతో బంతిని గాల్లోకి విసిరాడు. అక్కడే నాథన్ స్మిత్ మెరుపు వేగంతో దూసుకొచ్చి డైవ్ చేస్తూ క్యాచ్ పూర్తి చేశాడు.

Video: క్యాచ్ ఆఫ్ ది ఇయర్.. బౌండరీ లైన్‌లో ది బెస్ట్ అంటే ఇదేనేమో.. వీడియో చూస్తే గూస్ బంప్సే..!
Ind Vs Nz 4th T20i Naman Dhir Wicket Video
Venkata Chari
|

Updated on: Oct 30, 2026 | 4:38 PM

Share

న్యూజిలాండ్ ఫీల్డింగ్‌లో మరోసారి అద్భుతం చేసింది. భారత బ్యాటర్ నామన్ ధీర్ (Naman Dhir)ను పెవిలియన్‌కు పంపిన తీరు ఇప్పుడు మ్యాచ్‌లో హైలైట్‌గా మారింది. ఇది కేవలం ఒక ఫీల్డర్ పట్టిన క్యాచ్ కాదు.. ఇద్దరు ఆటగాళ్లు కలిసి పూర్తి చేసిన అద్భుతమైన టీమ్‌వర్క్. 11.2 ఓవర్‌లో జాకబ్ డఫీ (Jacob Duffy) వేసిన బంతిని నామన్ ధీర్ భారీ షాట్‌గా మలిచాడు. బంతి లాంగ్ ఆన్ వైపు గాల్లోకి వెళ్లింది. అక్కడ ఉన్న డారిల్ మిచెల్ (Daryl Mitchell) అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు.

అయితే అసలు ట్విస్ట్ అక్కడే..

క్యాచ్ అందుకున్న సమయంలో మిచెల్ వేగం కారణంగా బౌండరీ లైన్ దాటే పరిస్థితి ఏర్పడింది. దీంతో బంతిని చేతిలో ఉంచుకుని ముందుకు వెళ్లడం ప్రమాదమని గుర్తించిన మిచెల్.. వెంటనే దాన్ని గాల్లోకి విసిరాడు. అదే సమయంలో డీప్ మిడ్ వికెట్ నుంచి నాథన్ స్మిత్ (Nathan Smith) బంతి వైపు దూసుకొచ్చాడు.

మిచెల్ విసిరిన బంతిలో వేగం ఎక్కువగా ఉండటంతో స్మిత్ తన పరుగు ఆపి.. ముందుకు డైవ్ చేస్తూ బంతిని అందుకున్నాడు. నేలపై పడుతూనే క్యాచ్‌ను సురక్షితంగా పూర్తి చేశాడు.

నమన్ ధీర్ మాత్రం ఇది క్యాచ్ కాదని భావిస్తూ క్రీజులోనే ఉన్నాడు. ఫీల్డర్ల మధ్య అద్భుతమైన సమన్వయం చూసిన తర్వాత టీవీ అంపైర్‌కు నిర్ణయాన్ని అప్పగించారు. రీప్లేలో మిచెల్ బౌండరీ లైన్‌ను తాకలేదని స్పష్టమైంది. దీంతో థర్డ్ అంపైర్ క్లీన్ క్యాచ్గా ప్రకటించాడు.

నమన్ ధీర్ 13 బంతుల్లో 28 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడినా.. ఈ అద్భుతమైన క్యాచ్‌తో అతడి పోరాటం ముగిసింది.

కామెంటేటర్లు కూడా ఈ ఫీల్డింగ్‌ను “క్యాచ్ ఆఫ్ ది ఇయర్” అంటూ ప్రశంసించారు. ఒక ఫీల్డర్ క్యాచ్ అందుకుని.. బౌండరీ ప్రమాదాన్ని గుర్తించి మరో ఫీల్డర్‌కు బంతిని విసరడం, ఆ తర్వాత రెండో ఫీల్డర్ డైవ్ చేస్తూ క్యాచ్ పూర్తి చేయడం నిజంగా అరుదైన దృశ్యమే.

క్యాచ్ ఒక్కరిది కాదు.. క్రెడిట్ మాత్రం ఇద్దరిదీ! న్యూజిలాండ్ ఫీల్డింగ్‌కు ఈ వికెట్ మరో అద్భుత ఉదాహరణగా నిలిచింది.

Follow Us
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన.. రైతులకు భరోసా
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన.. రైతులకు భరోసా
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!
బ్రాండెడ్‌ బియ్యం పేరుతో వినియోగదారులకు టోకరా
బ్రాండెడ్‌ బియ్యం పేరుతో వినియోగదారులకు టోకరా
ఆ వ్యాఖ్యలకు కొండా సురేఖ క్షమాపణ.. కేటీఆర్ రియాక్షన్ ఏమంటే?
ఆ వ్యాఖ్యలకు కొండా సురేఖ క్షమాపణ.. కేటీఆర్ రియాక్షన్ ఏమంటే?
అడ్డంగా దొరికిపోయిన చైన్ స్నాచర్లు..ఆ తర్వాత ఊహించని సీన్
అడ్డంగా దొరికిపోయిన చైన్ స్నాచర్లు..ఆ తర్వాత ఊహించని సీన్
నడిరోడ్డుపై బోల్తాపడిన భారీ కంటైనర్.. తృటిలో తప్పిన బైకర్!
నడిరోడ్డుపై బోల్తాపడిన భారీ కంటైనర్.. తృటిలో తప్పిన బైకర్!
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే
గోల్డ్ షాప్‌లో మహిళల చేతివాటం.. రూ.45 లక్షల విలువైన బంగారం మాయం
గోల్డ్ షాప్‌లో మహిళల చేతివాటం.. రూ.45 లక్షల విలువైన బంగారం మాయం
200 ఏళ్ల శివాలయం నుంచి పురాతన నంది మిస్సింగ్...
200 ఏళ్ల శివాలయం నుంచి పురాతన నంది మిస్సింగ్...
అర్నబ్ తుఫాన్ దెబ్బకు ఏపీ అతలాకుతలం.. ఏ పంటకు ఎంత పరిహారమంటే..?
అర్నబ్ తుఫాన్ దెబ్బకు ఏపీ అతలాకుతలం.. ఏ పంటకు ఎంత పరిహారమంటే..?