హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయ ప్రధాన రహదారిపై టాటా కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే కారు నుంచి బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది. కొద్ది నిమిషాల్లోనే కారు పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.