Pushpa 2: పుష్ప రాజ్ పై ప్రశంసలు కురిపించిన బిగ్ బి.. నేను మీ అభిమానిని అంటూ..
పుష్ప 2: అల్లు అర్జున్ 'పుష్ప 2' 4 రోజుల్లో బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతుంది. అల్లు అర్జున్ 'పుష్ప రాజ్ గా అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించాడు.
అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన ‘పుష్ప: ది రూల్’ ఇప్పుడు ఇండియాను షేక్ చేస్తుంది. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తొలి రోజు నుంచి వసూళ్ల పరంగా దూసుకుపోతున్న ఈ సినిమా ఇప్పుడు రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. ఇప్పటికే ఈ సినిమా రూ. 800కోట్లకు పైగా వసూల్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. దేశంలోనే అత్యంత వేగంగా రూ.500 కోట్ల మార్క్‌ను దాటిన చిత్రంగా ‘పుష్ప’ నిలిచింది. ‘పుష్ప 2’ వసూళ్లు భారీగా రాబడుతుంది. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ గురించి చెప్పాలంటే.. ఈ సినిమా నాలుగో రోజు రూ.800 కోట్ల గ్రాస్ ను అందుకుంది. పెరుగుతున్న వసూళ్ల స్పీడ్‌ని బట్టి చూస్తే ఈ సినిమా 5వ రోజు నాటికి ఈజీగా 1000 కోట్ల రూపాయల వసూళ్లను రాబడుతుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ వర్గాలు.
ఇది కూడా చదవండి : Tollywood : 14ఏళ్లకే ఎంట్రీ ఇచ్చింది.. ఇప్పుడు మూడు నిమిషాల పాటకు రూ. 2కోట్లు అందుకుంటుంది..
పుష్ప-2 ది రూల్.. చిత్రం ఇండియన్ బాక్సాఫీస్‌పై సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఈ సన్సేషన్ కాంబినేషన్‌లో అత్యున్నత నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్ సుకుమార్ రైటింగ్ సంస్థతో కలిసి ఈ ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ సినిమాను నిర్మించింది.ఇదిలా ఉంటే పుష్ప సినిమా పై అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా పుష్ప సినిమాపై ప్రశంసలు కుపించారు.
ఇది కూడా చదవండి :మహేష్ బాబుతో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ళ హాట్ ఫేవరేట్.. చూస్తే ప్రేమలోపడిపోవాల్సిందే
అల్లు అర్జున్ ను ప్రశంసిస్తూ అమితాబ్ బచ్చన్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. “అల్లుఅర్జున్ జీ .. మీరూ నా పట్ల ఏంతో వినయపూర్వకంగా మాట్లాడారు. మీ ప్రతిభకు మేమంతా పెద్ద అభిమానులం .. మీరు మా అందరికీ స్ఫూర్తినిస్తూనే ఉండండి .. మీ కోసం నా ప్రార్థనలు మరియు శుభాకాంక్షలు కొనసాగిన విజయం!” అని రాసుకొచ్చారు అమితాబ్ బచ్చన్. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ చిత్రం సాధించిన, సాధిస్తున్న వసూళ్లతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇండియా నెంబర్‌వన్ హీరోగా అందరూ కొనియాడుతున్నారు. దర్శకుడు సుకుమార్ కూడా భారతదేశం గర్వించదగ్గ దర్శకుడిగా టాప్ పొజిషన్‌లో ఉన్నాడు.
ఇది కూడా చదవండి :కోతి కొమ్మచ్చి ఆడుతున్న ఈ కుర్రాళ్లలో ఓ స్టార్ హీరో ఉన్నాడు.. అమ్మాయిలు వెర్రెక్కిపోతారు అతనంటే..
#AlluArjun ji .. so humbled by your gracious words .. you give me more than I deserve .. we are all such huge fans of your work and talent .. may you continue to inspire us all .. my prayers and wishes for your continued success ! https://t.co/ZFhgfS6keL
— Amitabh Bachchan (@SrBachchan) December 9, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.