AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bellamkonda Sreenivas : బరి నుంచి బెల్లంకొండ శ్రీనివాస్ తప్పుకున్నట్టేనా.. ఆ సినిమా అటకెక్కినట్టేనా..?

అల్లుడు శీను సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు బెల్లంకొండ శ్రీనివాస్. బెల్లం కొండ శ్రీనివాస్ హిట్ కోసం చాలా కష్టపడుతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న శ్రీనివాస్ సరైన హిట్ మాత్రం అందుకోలేక పోతున్నాడు.

Bellamkonda Sreenivas : బరి నుంచి బెల్లంకొండ శ్రీనివాస్ తప్పుకున్నట్టేనా.. ఆ సినిమా అటకెక్కినట్టేనా..?
Bellamkonda
Rajeev Rayala
|

Updated on: Jan 23, 2022 | 5:23 PM

Share

Bellamkonda Sreenivas : అల్లుడు శీను సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు బెల్లంకొండ శ్రీనివాస్. బెల్లం కొండ శ్రీనివాస్ హిట్ కోసం చాలా కష్టపడుతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న శ్రీనివాస్ సరైన హిట్ మాత్రం అందుకోలేక పోతున్నాడు. అయినా ప్రయత్నాన్ని ఆపకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ కుర్ర హీరో. చివరిగా అల్లుడు అదుర్స్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన బెల్లంకొండ ఇప్పుడు బాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకోవడాని ట్రై చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తెలుగులో సూపర్ హిట్ గా నిలిచినా రాజమౌళి-ప్రభాస్  ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కూడా మొదలు పెట్టేశాడు. ఈ సినిమాకు యాక్షన్ డైరెక్టర్ వి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు తెలుగులో ఓ సినిమా చేస్తున్న ఈ బెల్లంకొండ హీరో. బెల్లం కొండ శ్రీనివాస్ హీరోగా స్టువర్ట్ పురం అనే సినిమా తెరకెక్కుతుంది.

ఇప్పటికే ఈ సినిమానుంచి టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. 1970 లలో స్టువర్ట్ పురంలో పేరుమోసిన దొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ గా ఈ సినిమా రాబోతుంది. పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన టైగర్ నాగేశ్వరరావు పేదల చేత దేవుడిగా కొలవబడ్డాడు. ఇదే కథతో ఇప్పుడు ఈ సినిమా రాబోతుందని తెలుస్తుంది. కెఎస్  దర్శకుడిగా ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. ప్రతిష్టాత్మక బ్యానర్ శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇదే కథతో మాస్ మహారాజ రవితేజ కూడా సినిమా చేస్తున్నాడు. టైగర్ నాగేశ్వర రావు అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. రవితేజ – బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాల మధ్య గట్టి పోటీ పరిస్థితి తలెత్తుతుందేమోనని అంతా అనుకున్నారు. కానీ ఈ రేస్ నుంచి బెల్లం కొండా శ్రీనివాస్ తప్పుకున్నాడని తెలుస్తుంది. బరిలో నుంచి ‘స్టూవర్టుపురం దొంగ’ను తప్పించాలనే నిర్ణయానికి మేకర్స్ వచ్చినట్టుగా టాక్ నడుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Director Maruthi: ప్రభాస్‏తో మారుతి రాజా డీలాక్స్ సినిమా.. కాలానికి తెలుసంటున్న డైరెక్టర్..

Sudha: నన్ను ఒంటరిగా వదిలేశారు.. రేపు నా పరిస్థితే వాళ్లకు వస్తుంది.. నటి సుధ ఎమోషనల్ కామెంట్స్..

Lata Mangeshkar: ఆరోగ్యం మెరుగుపడినా.. ఐసీయూలోనే లతా మంగేష్కర్.. డాక్టర్స్ ఏమంటున్నారంటే..