Lata Mangeshkar: ఆరోగ్యం మెరుగుపడినా.. ఐసీయూలోనే లతా మంగేష్కర్.. డాక్టర్స్ ఏమంటున్నారంటే..
ప్రముఖ గాయని లతా మంగేష్కర్ గత కొద్ది రోజులుగా కరోనాla బాధపడుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఆమె ముంబైలోని
ప్రముఖ గాయని లతా మంగేష్కర్ గత కొద్ది రోజులుగా కరోనాla బాధపడుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఆమె ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. లతా మంగేష్కర్ ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు వైద్యులు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించిందంటూ నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితిపై గురించి ఆమెను పరీక్షిస్తున్న డాక్టర్ ప్రతీత్ సమ్దానీ స్పందించారు.
ప్రస్తుతం లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని.. అయితే ఆమెను ఇంకా ఐసీయూలోనే ఉంచి పరిశీలిస్తున్నామని తెలిపారు. ఆమె త్వరలోనే కోలుకోవాలని ప్రార్థించాలని కోరారు. అలాగే.. లతా మంగేష్కర్ ఆరోగ్యంపై వస్తున్న వదంతులను నమ్మవద్దని.. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మెరుగుపడిందన్నారు.
There is improvement in her health since yesterday, but she continues to be under observation in ICU. Pray for her speedy recovery: Dr Pratit Samdani, who is treating singer Lata Mangeshkar at Mumbai’s Breach Candy Hospital
(file photo) pic.twitter.com/phTkLfJNcS
— ANI (@ANI) January 23, 2022
ఇక మరోవైపు.. లతా మంగేష్కర్ త్వరగా కోలుకోవాలంటూ సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా కోరుకుంటున్నారు. జనవరి 8న లతా మంగేష్కర్ కోవిడ్ బారిన పడ్డారు. అప్పటినుంచి ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు. దాదాపు 15 రోజులు గడిచినా ఆమె ఇంకా ఐసీయూలోనే చికిత్స తీసుకుంటున్నారు. త్వరలోనే లతా మంగేష్కర్ ఆరోగ్యం మెరుగుపడి ఇంటికి చెరుకుంటారని సన్నిహితులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Heartfelt request for the disturbing speculation to stop.
Update from Dr Pratit Samdani, Breach Candy Hospital.
Lata Didi is showing positive signs of improvement from earlier and is under treatment in the ICU.
We look forward and pray for her speedy healing and homecoming.
— Lata Mangeshkar (@mangeshkarlata) January 22, 2022
Request from Lata Didi’s family to not spread rumours. She is responding well to treatment and god willing will return home soon. Let us avoid speculation & continue to pray for Lata Didi’s speedy recovery and wellbeing. pic.twitter.com/1HQlULjV8j
— Smriti Z Irani (@smritiirani) January 22, 2022
Also Read: Priyamani: సెకండ్ ఇన్నింగ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ‘ప్రియమణి’ ఆకట్టుకుంటున్న ఫొటోస్…
Harish Shankar : ‘అబ్బా చింపేశావ్ అన్నయ్యా.. నిజానికి పిండేశావ్’.. హరీష్ శంకర్ ఆసక్తికర ట్వీట్