AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aa Ammayi Gurinchi Meeku Cheppali : ప్రిన్సెస్ లాంటి అమ్మాయి చుట్టూ తిరిగే కథ.. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి టీజర్ వచ్చేసింది..

టాలీవుడ్ లో సెన్సిబుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.

Aa Ammayi Gurinchi Meeku Cheppali :  ప్రిన్సెస్ లాంటి అమ్మాయి చుట్టూ తిరిగే కథ.. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి టీజర్ వచ్చేసింది..
Rajeev Rayala
|

Updated on: Jan 22, 2022 | 7:12 PM

Share

Aa Ammayi Gurinchi Meeku Cheppali: టాలీవుడ్ లో సెన్సిబుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. సుదీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో లేటెస్ట్ సెన్సేషన్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. అష్టాచమ్మ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఇంద్రగంటి మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆతర్వాత వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.  ఇప్పటికే సుధీర్ బాబుతో కలిసి సమ్మోహనం, వి సినిమాలను తెరకెక్కించారు ఇంద్రగంటి. వీటి సమ్మోహనం సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆకట్టుకునే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించింది. ఆతర్వాత వచ్చిన వి సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేక పోయింది. వి సినిమాలో నాని , సుధీర్ బాబు కలిసి నటించారు. ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికి సుధీర్ బాబు నటనకు మంచి మార్కులు పడ్డాయి.

ఇక ఇప్పుడు ఇంద్రగంటి తో కలిసి హ్యాట్రిక్ సినిమా చేస్తున్నాడు సుధీర్ బాబు. తాజాగా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ చూస్తుంటే ఈ సినిమా ఓ అందమైన ప్రేమ కథగా తెరకెక్కిందని తెలుస్తుంది. ఈ సినిమాలో సుధీర్ బాబు సినిమా హీరోగా కనిపించనున్నాడు. ఆరు సినిమాలు తీసి హిట్స్ అందుకున్న హీరో.. కొత్తగా ట్రై చేద్దామని ఓ అమ్మాయి చుట్టూ తిరిగే కథను ఏంచ్చుకోవడం.. ఆ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టిని ఫిక్స్ అవవడం .. వృత్తిరీత్యా డాక్టర్ అయిన కృతిని సుధీర్ బాబు ఒప్పించడం ఈ టీజర్ లో చూడొచ్చు.. ఇక ఈ టీజర్ సినిమా పై అంచనాలను క్రియేట్ చేసిందనే చెప్పాలి. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. బెంచ్ మార్క్ స్టూడియోస్ తెరకెక్కిస్తున్న సినిమా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”.  సినిమాకు నిర్మాణ‌ భాగస్వామిగా మైత్రీ మూవీమేకర్స్ వ్యవహరిస్తోంది. `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది.ఇక మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఈ ప్రాజెక్ట్‌లొకి రావడంతో ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది. వివేక్ సాగర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, కళ్యాణి నటరాజన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral Photo: బూరెబుగ్గల బుజ్జాయి.. చిరునవ్వులతో కట్టిపడేస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.?

Nagashaurya: కృష్ణ వ్రింద విహారి అంటోన్న నాగశౌర్య.. బర్త్ డే వేళ స్పెషల్ సర్‏ప్రైజ్..

Manchu Lakshmi: తెలంగాణ ప్రభుత్వానికి మంచు లక్ష్మీ రిక్వెస్ట్.. ఎందుకంటే..