Sudha: నన్ను ఒంటరిగా వదిలేశారు.. రేపు నా పరిస్థితే వాళ్లకు వస్తుంది.. నటి సుధ ఎమోషనల్ కామెంట్స్..

సినీ పరిశ్రమలో తల్లిగా.. అక్కగా.. భార్యగా.. అత్తగా ఇలా ఒక్కటేమిటీ అన్ని రకాల పాత్రలలో నటించి మెప్పించింది సీనియర్ నటి సుధ.

Sudha: నన్ను ఒంటరిగా వదిలేశారు.. రేపు నా పరిస్థితే వాళ్లకు వస్తుంది.. నటి సుధ ఎమోషనల్ కామెంట్స్..
Sudha
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 23, 2022 | 10:54 AM

సినీ పరిశ్రమలో తల్లిగా.. అక్కగా.. భార్యగా.. అత్తగా ఇలా ఒక్కటేమిటీ అన్ని రకాల పాత్రలలో నటించి మెప్పించింది సీనియర్ నటి సుధ. ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 900లకు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది ఆమె. దాదాపు అందరూ స్టార్ హీరోస్ సినిమాల్లో కీలకపాత్రలు పోషించి సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు. తెరపై ప్రేక్షకులను అలరించిన సుధ.. వ్యక్తిగత జీవితంలో మాత్రం అనేక ఒడిదుడుకులు ఉన్నాయి. ఎన్నో కష్టాలను అధిగమించి ఇండస్ట్రీలో నిలదొక్కుకుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సుధ తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యంది.

సుధ మాట్లాడుతూ.. నా భర్త అమెరికాలో ఉంటారు. వాళ్ల లైఫ్ వాళ్లు సంతోషంగా బతుకుతున్నారు. నా కొడుకు కూడా అంతే. ఉండనీయండి. నాకేం పర్లేదు. లైఫ్ ఏంటో వాళ్లకు తెలియదు. నేనూ నా జీవితం సంతోషంగానే బతుకుతున్నా. ఈరోజు నేను మా నాన్న లేక ఒంటరయ్యాను.. అందుకు ఏడుస్తున్నాను.. కానీ నా పిల్లల కోసం.. నా భర్త కోసం మాత్రం కాదు.. నా తల్లిదండ్రుల కోసమే ఏడుస్తున్నాను. రేపటి రోజున నా పరిస్థితే వాళ్లకు వస్తుంది. అప్పుడు తెలిసొస్తుంది. అది చూడటానికి నేను ఉండకపోవచ్చు. ఇదే కదా జీవితమంటే. నేను అన్ని పోగొట్టుకున్నా.. నవ్వుతూ ఉండటానికి కారణం అదే. నా కూతురు పెళ్లి కూడా చేశాను. ప్రస్తుతం నా మనవరాలితో ఆడుకుంటున్నాను. సుధా అని మా అమ్మ పిలిచినట్టే నా మనవరాలు నన్ను పిలుస్తుంది. అంతకంటే జీవితానికి ఏం కావాలి. సైలెంట్ స్లో పాయిజన్ లాంటిది. మెల్లగా చంపేస్తుంది. నేను అదే ఫార్ములా ఫాలో అవుతా అంటూ ఎమోషనల్ అయ్యారు సుధ.

Also Read: Priyamani: సెకండ్ ఇన్నింగ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ‘ప్రియమణి’ ఆకట్టుకుంటున్న ఫొటోస్…

Harish Shankar : ‘అబ్బా చింపేశావ్ అన్నయ్యా.. నిజానికి  పిండేశావ్’.. హరీష్ శంకర్ ఆసక్తికర ట్వీట్

Aa Ammayi Gurinchi Meeku Cheppali : ప్రిన్సెస్ లాంటి అమ్మాయి చుట్టూ తిరిగే కథ.. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి టీజర్ వచ్చేసింది..