AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravi Teja : మాస్ రాజా అంటే మాములుగా ఉండదు మరి.. రవితేజ ‘రావణాసుర’ కోసం అలా చేయనున్నారట..

మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసి యమా స్పీడ్ మీదున్నాడు. క్రాక్ సినిమా ఇచ్చిన జోష్ తో వరుస సినిమాలను పట్టాలెక్కించాడు రవితేజ

Ravi Teja : మాస్ రాజా అంటే మాములుగా ఉండదు మరి.. రవితేజ 'రావణాసుర' కోసం అలా చేయనున్నారట..
Raviteja Khiladi Movie
Rajeev Rayala
|

Updated on: Jan 23, 2022 | 5:33 PM

Share

Ravi Teja : మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసి యమా స్పీడ్ మీదున్నాడు. క్రాక్ సినిమా ఇచ్చిన జోష్ తో వరుస సినిమాలను పట్టాలెక్కించాడు రవితేజ. గత ఏడాది వచ్చిన క్రాక్ సినిమా రవి తేజకు సాలిడ్ ,హిట్ అందించింది. ఈ సినిమా తర్వాత ఇప్పుడు ఖిలాడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాకు రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్ గా అలరించనున్నారు. అలాగే ఈ సినిమా తర్వాత రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమా చేస్తున్నాడు మాస్ రాజా. శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా దివ్యాన్ష కౌశిక్ అలరించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో రవితేజ ప్రభుత్వ అధికకారిగా కనిపించనున్నాడు. ఈ సినిమాతోపాటు త్రినాద్ రావు దర్శకత్వంలో ధమాకా అనే సినిమా చేస్తున్నాడు. అలాగే టైగర్ నాగేశ్వర్ రావు అనే సినిమాను కూడా పట్టాలెక్కించనున్నాడు.

వీటితోపాటు డైరెక్టర్ సుధీర్ వర్మ  డైరెక్షన్ లో రావణాసుర అనే సినిమా చేస్తున్నాడు రవితేజ. ఇటీవలే ఈ సినిమాను లాంచ్ చేశారు. ఈ సినిమాలో అక్కినేని హీరో సుశాంత్ కీలక పాత్రలో నటించనున్నాడు. ప్రస్తుతం సుశాంత్ పాల్గొనే సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు. తదుపరి షెడ్యూల్ లో రవితేజ జాయిన్ అవుతారని తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాకోసం ఎలాంటి సెట్స్ ను ఏర్పాటు చేయడం లేదట. అన్నీ రియల్ లొకేషన్స్ లోనే చిత్రీకరణ జరపనున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ లన్నీ ఎక్కువగా సెట్స్ లో జరుగుతున్నాయి. కానీ రవితేజ సినిమా మాత్రం ఇలా రియల్ లొకేషన్స్ లో చిత్రీకరించనుండటం ఆసక్తి కలిగిస్తుంది. ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ – ఫరియా అబ్దుల్లా – మెగా ఆకాష్ – దక్షనాగార్కర్ – పూజిత పొన్నాడ ఇలా అయిదుగురు హీరోయిన్లు నటిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Director Maruthi: ప్రభాస్‏తో మారుతి రాజా డీలాక్స్ సినిమా.. కాలానికి తెలుసంటున్న డైరెక్టర్..

Sudha: నన్ను ఒంటరిగా వదిలేశారు.. రేపు నా పరిస్థితే వాళ్లకు వస్తుంది.. నటి సుధ ఎమోషనల్ కామెంట్స్..

Lata Mangeshkar: ఆరోగ్యం మెరుగుపడినా.. ఐసీయూలోనే లతా మంగేష్కర్.. డాక్టర్స్ ఏమంటున్నారంటే..

Follow Us
మార్చి 4న కోల్‌కతాలో కివీస్ దేనితో ఆడుతుందో తెలుసా ?
మార్చి 4న కోల్‌కతాలో కివీస్ దేనితో ఆడుతుందో తెలుసా ?
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!
గౌరవం ఇచ్చేది వస్తువులు కాదు.. మనం చేసే పనులే: మనోజ్
గౌరవం ఇచ్చేది వస్తువులు కాదు.. మనం చేసే పనులే: మనోజ్
సైఫ్ బాధ్యతారాహిత్యంపై దర్శకుడు రాహుల్ రవాలి ఫైర్!
సైఫ్ బాధ్యతారాహిత్యంపై దర్శకుడు రాహుల్ రవాలి ఫైర్!
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి: డొనాల్డ్ ట్రంప్ సంచలన పోస్ట్
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి: డొనాల్డ్ ట్రంప్ సంచలన పోస్ట్