AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబోయ్.. కోనసీమలో భారీ గ్యాస్ లీక్.. భయంతో వణికిపోతున్న గ్రామస్థులు!

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేగింది. మామిడికుదురు మండలం నగరం గ్రామంలోని ONGC Well-7 నుంచి భారీగా సహజ వాయువు లీక్ కావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బావి వద్ద రీ-డ్రిల్లింగ్ పనులు నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. రీ-డ్రిల్లింగ్ సమయంలో ఒక్కసారిగా గ్యాస్ బయటకు ఎగసిపడటంతో అక్కడ పనిచేస్తున్న సిబ్బంది అప్రమత్తమయ్యారు.

బాబోయ్.. కోనసీమలో భారీ గ్యాస్ లీక్.. భయంతో వణికిపోతున్న గ్రామస్థులు!
Gas Leak At Ongc Well
Balaraju Goud
|

Updated on: Nov 17, 2026 | 8:18 AM

Share

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేగింది. మామిడికుదురు మండలం నగరం గ్రామంలోని ONGC Well-7 నుంచి భారీగా సహజ వాయువు లీక్ కావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బావి వద్ద రీ-డ్రిల్లింగ్ పనులు నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. రీ-డ్రిల్లింగ్ సమయంలో ఒక్కసారిగా గ్యాస్ బయటకు ఎగసిపడటంతో అక్కడ పనిచేస్తున్న సిబ్బంది అప్రమత్తమయ్యారు. గ్యాస్ లీక్ ప్రభావం సమీప ప్రాంతాలకు వ్యాపించే ప్రమాదం ఉందన్న ఆందోళనతో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు.

నగరం మీదుగా వెళ్లే హైవే సమీపంలో ఈ ఘటన జరగడంతో అటుగా ప్రయాణించే వాహనదారులను సిబ్బంది అప్రమత్తం చేస్తున్నారు. ప్రమాద ప్రాంతానికి దగ్గరగా వెళ్లవద్దని, జాగ్రత్తగా ప్రయాణించాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గ్యాస్ లీకేజీని నియంత్రించేందుకు సంబంధిత అధికారులతో చర్చించారు. మరోవైపు నరసాపురం నుంచి ప్రత్యేక రెస్క్యూ బృందం కూడా ఘటనా స్థలానికి బయలుదేరింది.

ప్రస్తుతం గ్యాస్ లీకేజీని నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నారు. పరిస్థితిని అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. గ్యాస్ లీక్ కారణాలు, దాని తీవ్రత, నియంత్రణ చర్యలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనతో నగరం గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us