AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akhanda 2 : ఇది బాలయ్య ఉగ్రరూపం.. బాక్సాఫీస్ వద్ద అఖండ 2 తాండవం..

బాలకృష్ణ హీరోగా నటించిన లేటేస్ట్ సినిమా అఖండ 2 తాండవం. డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎట్టకేలకు డిసెంబర్ 12న అడియన్స్ ముందుకు వచ్చింది. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ అఖండ సినిమాకు సీక్వెల్ ఇది.

Akhanda 2 : ఇది బాలయ్య ఉగ్రరూపం.. బాక్సాఫీస్ వద్ద అఖండ 2 తాండవం..
Akhanda 2
Rajitha Chanti
|

Updated on: Dec 13, 2025 | 1:50 PM

Share

మోస్ట్ అవైటెడ్ మూవీ అఖండ 2 తాండవం ఎట్టకేలకు అడియన్స్ ముందుకు వచ్చింది. నందమూరి హీరో బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. 2021లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన అఖండ చిత్రానికి సీక్వెల్ ఇది. విడుదలకు ముందే టీజర్, ట్రైలర్ తో భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ మూవీ డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. నిన్న ఉదయం నుంచే ఈ చిత్రానికి హిట్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో బాలయ్య నట విశ్వరూపం, బోయపాటి డైరెక్షన్ జనాలను కట్టిపడేశాయి. ఎప్పటిలాగ తమన్ అందించిన బీజీఎమ్ అదిరిపోయింది.

ఇవి కూడా చదవండి : Actress Vahini : అప్పుడు సీరియల్స్‏తో క్రేజ్.. క్యాన్సర్‏తో పోరాటం.. సాయం కోరుతూ పోస్ట్..

దీంతో ఇప్పుడు ఈ సినిమా తొలిరోజు కలెక్షన్స్ పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా కలెక్షన్లను 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ప్రీమియర్స్ తో కలిపి ఈ మూవీ రూ.59.5 కోట్లు వసూలు చేసినట్లు తెలిపింది. బాలకృష్ణ కెరీర్ లోనే మొదటిరోజు ఈ స్థాయిలో వసూలు చేసిన ఫస్ట్ మూవీ ఇదేనని తెలిపింది.

ఇవి కూడా చదవండి : Tollywood : అలాంటి సీన్స్ చేయడానికి ఓకే.. కానీ లిప్ లాక్ అతడికి మాత్రమే.. టాలీవుడ్ హీరోయిన్..

ఈ సినిమాలో బాలకృష్ణతోపాటు సంయుక్త మీనన్, హర్షాలీ మల్హోత్రా, ఆది పినిశెట్టి కీలకపాత్రలలో నటించారు. ఈ సినిమాలో బాలయ్య అఘోరా పాత్రలో కనిపించారు. మాస్, యాక్షన్, ఆధ్యాత్మిక అంశాలు కలగలిసిన కథనం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో దూసుకుపోతుంది.

ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi : చిరంజీవితో మూడు సినిమాల్లో ఛాన్స్.. ఆ కారణంతోనే చేయలేకపోయాను.. హీరోయిన్..

ఇవి కూడా చదవండి : Tollywood : అలాంటి సీన్స్ చేయడానికి ఓకే.. కానీ లిప్ లాక్ అతడికి మాత్రమే.. టాలీవుడ్ హీరోయిన్..