Aadavallu Meeku Joharlu: శర్వానంద్ సినిమా నుంచి మరో అందమైన మెలోడీ..
యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ `ఆడవాళ్లు మీకు జోహార్లు`.
Aadavallu Meeku Joharlu: యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ `ఆడవాళ్లు మీకు జోహార్లు`. రష్మిక మందన్న హీరోయిన్. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మంచి అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్న సుధాకర్ చెరుకూరి ఈ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్‌ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మార్చి 4న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే సెన్సారు కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి క్లీన్ యు సర్టిఫికేట్ లభించింది. ఇప్పటి వరకు ఈ మూవీ నుండి రిలీజ్ చేసిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌కు విశేష స్పందన లభించింది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం కూడా సినిమా బజ్‌ను మరింత పెంచడానికి సహాయపడుతోంది. ఇప్పటి వరకు విడుదల చేసిన మూడు పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది.
తాజాగా ఈ సినిమానుంచి మరో పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ‘ఎన్ని ఎన్ని ఎన్ని మాట్లాడుకున్నా.. ఇంకా కొన్ని మిగిలిపోవడం.. ఆ సమ్.. అంటూ సాగె పాటను విడుదల చేశారు చిత్రయూనిట్. లిరిసిస్ట్ శ్రీమణి మంచి సాహిత్యం రాయగా.. దేవి సోదరుడు సాగర్ ఈ పాటను వినసొంపుగా ఆలపించారు.ఈ అందమైన మెలోడీ సాంగ్ మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకుంటుంది. ఇక కుష్బూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశీ వంటి సీనియర్ యాక్టర్స్ కలిసి నటిస్తుండడం ఈ సినిమాలో మరో విశేషం. సుజిత్ సారంగ్ ఈ చిత్రానికి కెమెరామెన్‌గా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :