Viral Photo: చారడేసి కళ్లు.. బూరె బుగ్గల ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టండి.. బుల్లితెరపై ఈ చిన్నదానిదే హవా..

ప్రస్తుతం సోషల్ మీడియాలో నటీనటుల చిన్ననాటి ఫోటోస్ తెగ ట్రెండ్ అవుతున్నాయి. స్టార్ సెలబ్రెటీలు తమ అరుదైన ఫోటోస్..

Viral Photo: చారడేసి కళ్లు.. బూరె బుగ్గల ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టండి.. బుల్లితెరపై ఈ చిన్నదానిదే హవా..
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 20, 2022 | 11:54 AM

ప్రస్తుతం సోషల్ మీడియాలో నటీనటుల చిన్ననాటి ఫోటోస్ తెగ ట్రెండ్ అవుతున్నాయి. స్టార్ సెలబ్రెటీలు తమ అరుదైన ఫోటోస్.. జ్ఞాపకాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటున్నారు. అయితే తమ అభిమాన నటీనటుల చిన్ననాటి ఫోటోస్ చూసేందుకు..వారిని గుర్తుపట్టేందుకు కూడా నెటిజన్స్ కూడా తెగా ఆసక్తి చూపిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఈ ట్రెండ్ తెగ వైరల్ అవుతుంది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా భాషతో సంబంధం లేకుండా సీనియర్ నటీనటుల దగ్గర్నుంచి యంగ్ స్టార్స్ వరకు ప్రతి ఒక్కరూ తమ త్రోబ్యాక్ ఫోటోస్ షేర్ చేసుకుంటారు. అలాగే ఇప్పుడు మరో ఫోటో తాజాగా నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతుంది.

పైన ఫోటోలో చారడేసి కళ్లతో.. బూరెబుగ్గలతో సీరియస్ లుక్ ఇస్తున్న ఆ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా ? మీకోసం చిన్న క్లూ.. ప్రస్తుతం బుల్లితెరపై ఈ చిన్నదానిదే హావా.. ఓవైపు అవకాశాలు అందుకుంటూ వెండితెరపై అలరిస్తున్న ఈ బుజ్జాయి.. మరోవైపు ప్రతి రోజూ బుల్లితెర ద్వారా ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఎవరో గుర్తుపట్టారా ?

ఇటీవల ఈ ముద్దుగుమ్మ గురించి పలు రకాల రూమర్స్ సైతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే వాటిపై ఈ అమ్మడు స్పందించలేదు. నటిగానే కాకుండా… యాంకర్‏గానే తన సత్తా చాటుతుంది.

Rashmi

Rashmi

పైన ఫోటోలో ఉన్న ఆ బూరెబుగ్గల చిన్నారి మరెవరో కాదు.. బుల్లితెరపై తన చలాకీతనంత యాంకర్‏గా దూసుకుపోతున్న రష్మి గౌతమ్. ప్రముఖ కామెడీ షో జబర్ధస్త్ ద్వారా ప్రతి ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరిస్తోంది. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు యాంకర్‏గానూ రాణిస్తోంది. అలాగే ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ నెట్టింట్లో తెగ యాక్టివ్ గా ఉంటుంది.

Also Read: Keerthy Suresh: కీర్తి సురేష్ కొత్త అవతారం.. ఆ హీరోతో కలిసి లాయర్‍గా మారిన మహానటి..

Ester Noronha: విడాకులు తీసుకున్న తర్వాతే సంతోషంగా ఉన్నానంటున్న హీరోయిన్.. ఆ సింగర్ మాజీ భార్య షాకింగ్ కామెంట్స్..

Skin Care: మీ చర్మం తరచూ పొడిబారుతుందా ? అయితే మీకు ఈ వ్యాధులు ఉన్నట్లే.. ఏంటంటే..

AP Crime News: అయ్యో ఇంత ప్రేమనా..? కుక్క చనిపోయిందని యజమాని కూడా..