Dadasaheb Phalke Awards: వైభవంగా ‘దాదాసాహెబ్’ అవార్డు ఫంక్షన్.. సత్తా చాటిన ‘పుష్ప’.. విజేతల పూర్తి లిస్ట్

Dadasaheb Phalke Awards: దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2022 వేడుక ఆదివారం (February 20th) ముంబై(Mumbai)లో ఘనంగా నిర్వహించారు. ప్రతిష్టాత్మకమైన ఈ వేడుకలో..

Dadasaheb Phalke Awards: వైభవంగా 'దాదాసాహెబ్' అవార్డు ఫంక్షన్.. సత్తా చాటిన 'పుష్ప'.. విజేతల పూర్తి లిస్ట్
Dadasaheb Phalke Awards
Follow us
Surya Kala

|

Updated on: Feb 21, 2022 | 7:27 AM

Dadasaheb Phalke Awards: దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2022 వేడుక ఆదివారం(ఫిబ్రవరి 20న) ముంబై(Mumbai)లో ఘనంగా నిర్వహించారు. ప్రతిష్టాత్మకమైన ఈ వేడుకలో భారతీయ చలనచిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.  పలువురు తారలు స్టైలిష్‌ దుస్తుల్లో మెరిసి, ఆకట్టుకున్నారు. ప్రముఖ నటి ఆశా పరేఖ్, రవీనా టాండన్, లారా దత్తా, కియారా అద్వానీ తదితరులు  ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈ  వేడుకకు హాజరైన వారిలో అహన్ శెట్టి , సతీష్ కౌశిక్, రోహిత్ రాయ్, రణవీర్ సింగ్ తల్లి అంజు భవ్నానీ, ఆయుష్ శర్మ, రణ్‌విజయ్ సింఘా, షహీర్ షేక్ కూడా ఉన్నారు. 2021లో విడుదలై, విశేష ఆదరణ పొందిన సినిమాలు, నటులు అవార్డులు అందుకున్నారు.  గత ఏడాది చివరిలో రిలీజైన అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమా పుష్ప : ది రైజ్.. ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచింది. షేర్షా  ఉత్తమ చిత్రంగా  రణవీర్ సింగ్ , కృతి సనన్ ఉత్తమ నటీనటులుగా నిలిచారు.

విజేతల లిస్ట్: 

ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ – పుష్ప: ది రైజ్

ఉత్తమ చిత్రం – షేర్షా

ఉత్తమ నటుడు – రణవీర్ సింగ్(83)

ఉత్తమ నటి – కృతి సనన్(మిమీ)

ఉత్తమ దర్శకుడు – కెన్ ఘోష్(స్టేట్ ఆఫ్ సీజ్)

అత్యుత్తమ సహకారం – ఆశా పరేఖ్

ఉత్తమ సహాయ నటుడు: సతీష్ కౌశిక్‌ (కాగజ్‌)

ఉత్తమ సహాయ నటి: లారా దత్తా (బెల్‌ బాటమ్‌)

ఉత్తమ విలన్ – ఆయుష్ శర్మ (అంతిమ్‌: ది ఫైనల్‌ ట్రూత్‌)

క్రిటిక్స్ ఉత్తమ చిత్రం – సర్దార్ ఉదం

క్రిటిక్స్ ఉత్తమ నటుడు – సిద్ధార్థ్ మల్హోత్రా(షేర్షా)

క్రిటిక్స్ ఉత్తమ నటి – కియారా అద్వానీ(షేర్షా)

పీపుల్స్ ఛాయిస్ బెస్ట్ యాక్టర్ – అభిమన్యు దస్సాని

పీపుల్స్ ఛాయిస్ ఉత్తమ నటి – రాధిక మదన్

బెస్ట్ డెబ్యూ – అహాన్‌ శెట్టి (థడప్‌)

ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రం – మరో రౌండ్

ఉత్తమ వెబ్ సిరీస్ – కాండీ

వెబ్ సిరీస్‌ ఉత్తమ నటుడు – మనోజ్ బాజ్‌పేయి(ది ఫ్యామిలీమ్యాన్‌)

వెబ్ సిరీస్‌ ఉత్తమ నటి – రవీనా టాండన్

టెలివిజన్ సిరీస్ ఆఫ్ ది ఇయర్ – అనుపమ

టెలివిజన్ సిరీస్‌ ఉత్తమ నటుడు – షహీర్ షేక్

టెలివిజన్ సిరీస్‌ ఉత్తమ నటి – శ్రద్ధా ఆర్య

టెలివిజన్ సిరీస్‌ మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ – ధీరజ్ ధూపర్

టెలివిజన్ సిరీస్‌ అత్యంత ప్రామిసింగ్ నటి – రూపాలీ గంగూలీ

ఉత్తమ షార్ట్ ఫిల్మ్ – పౌలి

ఉత్తమ నేపథ్య గాయకుడు – విశాల్ మిశ్రా

ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ ఫిమేల్ – కనికా కపూర్

ఉత్తమ సినిమాటోగ్రాఫర్ – జయకృష్ణ గుమ్మడి

Also Read:

Samantha: నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోలేను.. ఆసక్తికర పోస్ట్‌ చేసిన సమంతా.!

నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట