Samantha: నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోలేను.. ఆసక్తికర పోస్ట్‌ చేసిన సమంతా.!

Samantha: ప్రస్తుతం సమంత పేరు బాగా మారుమోగుతోంది. పుష్పలో స్పెషల్‌ సాంగ్‌తో ఒక్కసారి ఇండస్ట్రీ దృష్టిని మరోసారి తనవైపు తిప్పుకున్న సామ్‌. వరుస సినిమాలకు సైన్‌ చేస్తూ టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా పేరు తెచ్చుకుంది. ఇక కేవలం సినిమాలకే మరిమితం కాకుండా సోషల్‌ మీడియాలోనూ...

Samantha: నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోలేను.. ఆసక్తికర పోస్ట్‌ చేసిన సమంతా.!
Samantha
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 21, 2022 | 7:16 AM

Samantha: ప్రస్తుతం సమంత పేరు బాగా మారుమోగుతోంది. పుష్పలో స్పెషల్‌ సాంగ్‌తో ఒక్కసారి ఇండస్ట్రీ దృష్టిని మరోసారి తనవైపు తిప్పుకున్న సామ్‌. వరుస సినిమాలకు సైన్‌ చేస్తూ టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా పేరు తెచ్చుకుంది. ఇక కేవలం సినిమాలకే మరిమితం కాకుండా సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే ఆసక్తికర పోస్ట్‌లు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన కొన్ని ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. ప్రస్తుతం లైఫ్‌ను బిజీగా గడిపేలా ప్లాన్‌ చేసుకున్న సామ్‌, ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెకేషన్స్‌ కోసం విహార యాత్రలకు వెళుతోంది.

ఈ క్రమంలోనే తాజాగా కేరళలో హాలీడే ఎంజాయ్‌ చేస్తోంది సమంత. అక్కడ వేకేషన్‌లో భాగంగా దిగిన కొన్ని ఫోటోలను పోస్ట్‌ చేస్తూ ఆసక్తికరమైన క్యాప్షన్స్‌ జోడిస్తోందీ బ్యూటీ. ఈ క్రమంలోనే తన స్నేహితురాలితో బీచ్‌ ఒడ్డున దిగిన ఓ ఫోటోను షేర్‌ చేసిన సామ్‌.. ‘నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోలేను’ అనే క్యాప్షన్‌ను రాసుకొచ్చింది. దీంతో పాటు ‘బెస్ట్‌ ఫ్రెండ్స్‌’ అనే హాష్‌ ట్యాగ్ జోడించింది. సామ్‌ ఇలా ఫోటోను పోస్ట్ చేసిందో లేదో అలా వైరల్‌గా మారింది. కేవలం కొన్ని గంటల్లోనే లక్షల్లో లైక్‌ల వర్షం కురుస్తోంది.

ఇదిలా ఉంటే సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’ సినిమాను పూర్తి చేసిన విషయం తెలిసిందే. పిరియాడిక్‌ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ లేడీ ఓరియెంటెడ్‌ చిత్రంపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో పాటు తెలుగులో ‘యశోద’, తమిళంలో ‘కాతు వాకుల్‌ రెండు కాదల్‌’ అనే సినిమాలో నటిస్తోంది సామ్‌. ఓ హాలీవుడ్ మూవీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సమంత.. బాలీవుడ్‌లోనూ పలు ప్రాజెక్టులకు పచ్చ జెండా ఊపినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

Also Read: Eyes: కళ్లని చూసి మీ ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవచ్చు.. ఈ లక్షణాలను తేలికగా తీసుకోకండి..?

Deepika Padukone: నాకు సినిమాలు సెలక్ట్ చేసుకోవడం రాదనుకుంటున్నారు : దీపికా

High BP: హై బీపీ తగ్గాలంటే ఈ ఆహారాలు తప్పనిసరి.. అవేంటంటే..?

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!