AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

High BP: హై బీపీ తగ్గాలంటే ఈ ఆహారాలు తప్పనిసరి.. అవేంటంటే..?

High BP: హైపర్‌టెన్షన్ లేదా అధిక రక్తపోటు అనేది సైలెంట్ కిల్లర్. దీర్ఘకాలిక గుండె జబ్బుల ప్రమాదానికి దారి తీస్తుంది. ఇది లక్షణాలు కనిపించకుండానే అభివృద్ధి చెందుతుంది.

High BP: హై బీపీ తగ్గాలంటే ఈ ఆహారాలు తప్పనిసరి.. అవేంటంటే..?
High Bp
uppula Raju
|

Updated on: Feb 20, 2022 | 7:52 PM

Share

High BP: హైపర్‌టెన్షన్ లేదా అధిక రక్తపోటు అనేది సైలెంట్ కిల్లర్. దీర్ఘకాలిక గుండె జబ్బుల ప్రమాదానికి దారి తీస్తుంది. ఇది లక్షణాలు కనిపించకుండానే అభివృద్ధి చెందుతుంది. దీనికి శాశ్వత నివారణ లేదు. మందులు, కొన్ని ఆహారాల ద్వారా నియంత్రణలో ఉంచుకోవచ్చు. సాధారణ రక్తపోటు 120/80గా పరిగణిస్తారు. అంతకు మించి ఎక్కువగా ఉంటే హై బీపీ కిందకి వస్తుంది. సకాలంలో చికిత్స అందించకపోతే అది గుండెకు హాని కలిగిస్తుంది. అందువల్ల హై బీపీ రోగులు జాగ్రత్తగా ఉండాలి. డైట్‌లో ఈ ఆహారాలను చేర్చుకోవాలి.

1. యాపిల్‌

హై బీపీ పేషెంట్లకి యాపిల్‌ చాలా మంచిది. రోజుకొక యాపిల్‌ తింటే డాక్టర్ వద్దకు వెళ్లవలసిన అవసరం ఉండదు. యాపిల్స్‌లో ఫ్లేవొనోల్స్ ఉంటాయి. ఇవి సహజ పదార్ధాలతో సమృద్ధిగా ఉండి రక్తపోటు నియంత్రణకు సహాయపడతాయి. బెర్రీస్, యాపిల్స్, బేరి, రెడ్ వైన్ వంటి వాటిలో ఫ్లేవనాల్ అధికంగా ఉంటాయి. ఇవి తీసుకుంటే రక్తపోటు తగ్గించుకోవచ్చు.

2. కూరగాయలు

బీపీని కంట్రోల్‌ చేయాలంటే ఎక్కువగా తాజా పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లు, బీన్స్, గింజలు తీసుకోవాలి. చక్కెర చాలా పరిమితంగా ఉండాలి. ప్రతిరోజు భోజనంలో మిరియాలు, పుట్టగొడుగులు, బచ్చలికూర, ఆలివ్ నూనెతో వండిన ఆహారాలు తీసుకోవాలి.

3. ఆరెంజ్‌

100 గ్రాముల నారింజలో దాదాపు 19.6 మిల్లీగ్రాముల ఫ్లేవొనాల్ ఆగ్లైకోన్‌లు ఉంటాయి. ఒక రోజులో తాజాగా పిండిన ఆరెంజ్ జ్యూస్‌ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

4. ఉల్లిపాయ

ఉల్లిపాయలని వంటలలో విరివిగా వాడుతాం. ఎందుకంటే ఇది లేకపోతే వంటలు రుచిగా ఉండదు. తాజా ఉల్లిపాయలలో ఫ్లేవొనాల్ సమృద్ధిగా ఉంటాయి. పచ్చి ఉల్లిపాయలు లేదా కొద్దిగా ఫ్రై చేసిన ఉల్లిపాయల్ని తీసుకోవడం వల్ల శరీరానికి చాలా లాభాలు కలుగుతాయి. హై బీపీని తగ్గించే గుణాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. వేసవిలో తీసుకుంటే చాలా మంచిది.

5. బ్లాక్ టీ

బ్లాక్ టీ లో ఇంచు మించుగా 200 mg ఫ్లేవొనాల్ ఉంటాయి. గ్రీన్ టీ లో అయితే 71 నుంచే 126 ఎంజి ఫ్లవర్ వాట్స్ ఉంటాయి. కాబట్టి మీరు బ్లాక్ టీని తీసుకుంటే హై బీపీ నుంచి బయట పడవచ్చు. పైగా దీని లో ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి.

Health News: ఆ ట్యాబ్లెట్లు అధికంగా మింగుతున్నారా.. అధ్యయనంలో షాకింగ్‌ నిజాలు..?

Bad Habits: ఈ 5 అలవాట్లు మానకుంటే ఆర్థికంగా చితికిపోతారు.. అవేంటంటే..?

Biryani offer: విశాఖలో 5 పైసలకే బిర్యానీ.. త్వరలో ఒకటి కొంటే ఒకటి ఫ్రీ..