AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bad Habits: ఈ 5 అలవాట్లు మానకుంటే ఆర్థికంగా చితికిపోతారు.. అవేంటంటే..?

Bad Habits: కొంతమంది ఎంత సంపాదించినా నెలాఖరుకి పైసా మిగలదు. దీనికి అనేక కారణాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవలసినవి ఒక వ్యక్తికి ఉండే అలవాట్లు.

Bad Habits: ఈ 5 అలవాట్లు మానకుంటే ఆర్థికంగా చితికిపోతారు.. అవేంటంటే..?
Bad Habits
uppula Raju
|

Updated on: Feb 20, 2022 | 6:50 PM

Share

Bad Habits: కొంతమంది ఎంత సంపాదించినా నెలాఖరుకి పైసా మిగలదు. దీనికి అనేక కారణాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవలసినవి ఒక వ్యక్తికి ఉండే అలవాట్లు. వీటివల్ల ఎంత పెద్ద ఉద్యోగం చేసినా అంతేసంగతులు. మంత్‌ ఎండ్‌ వచ్చేసరికి ఎవరో ఒకరి వద్ద అప్పు చేయకతప్పదు. ముఖ్యంగా నగరాల్లో ఉండే వారికి ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వారు ఈ ఐదు అలవాట్లని వదిలేస్తే జీవితం హాయిగా సాగుతోంది. వాటి గురించి తెలుసుకుందాం.

1. మందు, సిగరెట్‌

యూత్‌ ఈ రెండు అలవాట్లను ఒక ట్రెండ్‌గా భావిస్తున్నారు. వీటివల్ల ఎంత సంపాదించిన పైసా మిగలదు. ఎందుకంటే రెండింటి ధర ఎక్కువగానే ఉంటుంది. అంతేకాదు వీటివల్ల ఆరోగ్యం కూడా పాడవుతుంది. దీనివల్ల ఆస్పత్రుల చుట్టు తిరగాల్సి వస్తుంది.

2. ఆన్‌లైన్ షాపింగ్‌లు

నగరాల్లో నివసించే వారికి ఈ అలవాటు ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్నదాటికి ఈ కామర్స్‌ సైట్స్‌ ఓపెన్ చేసి షాపింగ్‌ చేయడం పరిపాటైంది. ఆన్ లైన్ షాపింగ్ చేసేవారి సంఖ్య పెరిగిపోతోంది. దీనివల్ల బ్యాంకు ఖాతా త్వరగానే ఖాళీ అవుతుంది. అందుకే అవసరం ఉన్నప్పుడే మాత్రమే షాపింగ్ చేయాలి. ఈ అలవాటుని నియంత్రించుకుంటే మంచిది.

3. రెస్టారెంట్లలో తినడం

రెస్టారెంట్‌కి వెళితే చాలా ఖర్చవుతుంది. ఏదైనా ప్రత్యేక రోజు అయితే పర్వాలేదు కానీ వారానికి రెండు, మూడుసార్లు తింటే బిల్లు వాచిపోతుంది. బ్యాంకు అకౌంట్‌ ఖాళీ అవుతుంది. నగరాలలో ఉండేవారికి ఈ అలవాటు ఎక్కువగా ఉంటుంది. దీనిని మానుకుంటే డబ్బులు పొదుపు చేయవచ్చు.

4. అవసరమైన వస్తువులు

అవసరమైన వస్తువులు మాత్రమే కొనుగోలు చేయాలి. అనవసర వస్తువులు తీసుకోకూడదు. చాలామంది వీటి విషయంలో లైట్‌ తీసుకుంటారు. కానీ ఇందులో జాగ్రత్తగా ఉండాలి. సూపర్ బజార్‌, డీమార్ట్‌లలో షాపింగ్‌ చేసినప్పుడు ఏవి అవసరమో అవే తీసుకోవాలి. అనవసరమైనవాటికి డబ్బు వృథా చేయకూడదు. ఈ అలవాటుని మానుకుంటే మంచిది.

5. ప్రయాణ ఖర్చులు

దగ్గరి ప్రదేశాలకు కొంతమంది ఆటోలు, క్యాబ్‌లు బుక్‌ చేసుకొని వెళుతారు. ఇది వద్దు దీనివల్ల ప్రయాణ ఖర్చులు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి బదులు వాకింగ్‌ చేస్తే ఆరోగ్యంతో పాటు డబ్బులు కూడా సేవ్‌ అవుతాయి. దూర ప్రయాణమైతే ఎలాగో బుకింగ్‌లు తప్పవు.

Cricket News: సచిన్, రోహిత్ సరసన మరొక ప్లేయర్.. అరంగేట్రంతోనే అద్భుతాలు..

Biryani offer: విశాఖలో 5 పైసలకే బిర్యానీ.. త్వరలో ఒకటి కొంటే ఒకటి ఫ్రీ..

Viral Photos: కుక్కలంటే కొంతమందికి ఇష్టం.. మరికొంతమందికి పిచ్చి.. ఈ ఫొటోలు చూస్తే ఒప్పుకోక తప్పదు..?