- Telugu News Photo Gallery Viral photos Pet dogs have a expensive designer clothing collection they drink only bottled water and eat steak
Viral Photos: కుక్కలంటే కొంతమందికి ఇష్టం.. మరికొంతమందికి పిచ్చి.. ఈ ఫొటోలు చూస్తే ఒప్పుకోక తప్పదు..?
Viral Photos: పెంపుడు జంతువులలో చాలామంది కుక్కలని ఇష్టపడుతారు. దీనికి కారణం విశ్వాసం. కుక్కలకి ఎక్కువగా విశ్వాసం ఉంటుంది.
Updated on: Feb 19, 2022 | 10:21 PM

పెంపుడు జంతువులలో చాలామంది కుక్కలని ఇష్టపడుతారు. దీనికి కారణం విశ్వాసం. కుక్కలకి ఎక్కువగా విశ్వాసం ఉంటుంది. సమయం వచ్చినప్పుడు యజమానిపై తమ విధేయతని నిరూపించుకుంటాయి.

బ్రిటన్‌లో రెండు కుక్కల గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. వీటి వైభవం మామూలుగా ఉండదు. విలాసవంతమైన జీవితం గడుపుతున్నాయి.

ఈ రెండు కుక్కలు కేవలం బాటిల్ వాటర్ మాత్రమే తాగుతాయి. ఖరీదైన కబాబ్స్ తింటాయి. వీటి మెయింటెన్స్‌కి నెలకి ఎంత ఖర్చవుతుందో తెలిస్తే నోరెళ్లబెడుతారు.

ఈ కుక్కల యజమాని లియోన్ గెల్లర్. అతను కుక్కలకి ఖరీదైన దుస్తులని తీసుకొస్తాడు. ఎంత ఖరీదంటే 5 లక్షల కంటే ఎక్కువ విలువైన బంగారు జాకెట్లు ధరింపజేసి ఆనందిస్తాడు.

ఓ టీవీ షో చూస్తున్నప్పుడు తన పెంపుడు కుక్కలకు ఖరీదైన దుస్తులు ధరింపజేయాలనే ఆలోచన వచ్చిందని లియోన్ చెప్పింది. అప్పటి నుండి లియోన్ ఆమె భర్త స్టీవ్ కలిసి కుక్కల కోసం షాపింగ్ చేయడం ప్రారంభించారు.



