AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Snake Gourd-Egg: పొట్లకాయ, గుడ్డు కలిపి వండితే పాయిజన్ అవుతుందా? ఇదిగో క్లారిటీ

ఫుడ్ విషయంలో పెద్దవారు కొన్ని సూచనలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఒకేసారి కలిపి తినకూడని ఆహార పదార్థాల గురించి ఎక్కువ చెబుతుంటారు.

Snake Gourd-Egg: పొట్లకాయ, గుడ్డు కలిపి వండితే పాయిజన్ అవుతుందా? ఇదిగో క్లారిటీ
Egg Snake Gourd Curry
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 20, 2022 | 6:40 PM

Health Tips :  ఫుడ్ విషయంలో పెద్దవారు కొన్ని సూచనలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఒకేసారి కలిపి తినకూడని ఆహార పదార్థాల గురించి ఎక్కువ చెబుతుంటారు. దీంతో ఏదైనా హోటల్‌ లేదా రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు అక్కడున్న కాంబినేషన్స్ టేస్ట్ చేద్దామంటే తికమక ఏర్పడుతుంది. ఇందులో పొట్లకాయ, గుడ్డు కలిపి వండకూడదు, తినకూడదు అన్నది ప్రధానమైనది. ఆ రెండూ కలిపి వండి.. తింటే పాయిజన్ అవుతుందనే భయం చాలామందికి ఉంది. అసలు ఈ విషయం నిజమో కాదో తెలీదు. కానీ ఎందుకైనా మంచిది అని చాలా మంది ఆ రెండింటి కాంబినేషన్ జోలికి అస్సలు వెళ్లరు. అంతేకాదు గుడ్డు తిన్న రోజు, పొట్లకాయ తినరు కొంతమంది. ఈ విషయంపై క్లారిటీ తెలుసుకుందాం పదండి.

పొట్లకాయ, గుడ్డు కలిపి వండితే పాయిజన్ అవుతుంది అంటారు కానీ.. అది పూర్తి వాస్తవం కాదు. ఇలా కలిపి తినడం వల్ల కొందరికి మాత్రం ప్రాబ్లమ్ ఉంటుంది. వారు ఎవరంటే గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు.. యస్.. గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఈ కాంబినేషన్‌కు సాధ్యమైనంత దూరం ఉండటం మంచింది. ఏదైనా మిక్స్ చేసి కూర వండుతున్నప్పడు.. అవి రెండు ఒకే సమయంలో జీర్ణమయ్యేవి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అయితే పొట్లకాయలో నీటి శాతం అధికం. దీంతో ఇది కొద్ది సమయంలోనే అరిగిపోతుంది. కానీ కోడిగుడ్డులో చాలారకాల ప్రొటీన్స్, పోషకాలు, కొవ్వు పదార్థాలు ఉంటాయి. దీంతో గుడ్డు జీర్ణం అవ్వడానికి కాస్త సమయం పడుతుంది. దీనివల్ల గుడ్డు, పొట్లకాయ కలిపి వండి, తింటే జీర్ణమయ్యే సమయాల్లో తేడా ఉంటుంది. అలాంటప్పుడు కొందరికి గ్యాస్, కడుపులో మంట, ఏసీడిటీ వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్య అందరికీ ఎదురవుతుందని చెప్పలేం. జీర్ణశక్తి ఎక్కువగా ఉన్నవారికి ఎలా తిన్నా కూడా సమస్య ఉండదు.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న సమాచారం కేవలం సూచనలుగా మాత్రమే తీసుకోండి. ఇటువంటి ఆహారం అనుసరించే ముందు నిపుణులను సంప్రదించండి. 

Also Read:  నరాలు తెగే ఉత్కంఠ.. శవం పాతి పెట్టారన్న సమాచారంతో పోలీసుల తవ్వకాలు.. చివరికి ట్విస్ట్

సిమ్ కార్డు కొంటున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త.. మీ వెన్నులో వణుకుపుట్టే విషయం