Andhra Pradesh: సిమ్ కార్డు కొంటున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త.. మీ వెన్నులో వణుకుపుట్టే విషయం

AP News: మీరు వాడుతున్న మొబైల్ సిమ్ మీ పేరు మీద తీసుకుని ఉండొచ్చు.. అయితే మీ పేరు మీద ఇతరులు కూడా సిమ్ కార్డులను కలిగి ఉన్నారేమో అన్న అనుమానం మీకు ఎప్పుడైనా వచ్చిందా...?

Andhra Pradesh: సిమ్ కార్డు కొంటున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త.. మీ వెన్నులో వణుకుపుట్టే విషయం
Sim Card
Follow us

|

Updated on: Feb 20, 2022 | 1:46 PM

Nellore district: మీరు వాడుతున్న మొబైల్ సిమ్ మీ పేరు మీద తీసుకుని ఉండొచ్చు.. అయితే మీ పేరు మీద ఇతరులు కూడా సిమ్ కార్డులను కలిగి ఉన్నారేమో అన్న అనుమానం మీకు ఎప్పుడైనా వచ్చిందా… నెల్లూరు జిల్లాలోని ఆ గ్రామంలో ఇప్పుడు అందరి అనుమానం ఇదే… అందుకు కారణం ఏంటో తెలుసుకుందాం పదండి.  నెల్లూరు జిల్లా ముత్తుకూరు(Muttukuru) గ్రామానికి ఇటీవల కర్ణాటక పోలీసులు వచ్చారు. విచారణ కోసం వచ్చిన పోలీసులు చెప్పిన విషయం విని స్థానికులు ఆందోళనకు గురయ్యారు. గ్రామస్థుల పేర్లతో తీసుకున్న సిమ్ కార్డులను క్రిమినల్ హిస్టరీ ఉన్నవారు వాడుతున్నారన్న విషయం తెలిసి షాక్ తిన్నారు. బెంగళూరులో ఇటీవల జరిగిన ఓ భారీ రాబరీ కేసులో నిందితుడు వాడుతున్న మొబైల్ నంబర్  గురించి ఆరా తీయగా ఈ విషయం బయటపడింది.. అంతే కాదు ఇదే ప్రాంతానికి చెందినవారి పేర్ల మీద ఉన్న మరికొన్ని సిమ్ కార్డులను వేర్వేరు కేసుల్లో అనుమానితులు వాడుతున్నట్లు గుర్తించారు.

నెల్లూరు జిల్లా ముత్తుకూరు కేంద్రంగా నకిలీ సిమ్ కార్డుల పంపిణీ జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో కర్ణాటక పోలీసులు. ముత్తుకూరుకు వచ్చారు. ముత్తుకూరు గ్రామంలోని పలువురి పేర్లతో నకిలీ సిమ్ కార్డులు తీసుకున్న అక్రమార్కులు.. వాటిని నాలుగు రాష్ట్రాలకు విక్రయించినట్లు సమాచారం. ఎవరు ఈ నేరాలకు పాల్పడుతున్నారన్న కోణంలో కర్ణాటక పోలీసులు ఇక్కడికి వచ్చి విచారణ చేపట్టారు. ఇలా సిమ్స్ సృష్టిస్తున్న ఒక అనుమానితుడి అదుపులోకి తీసుకున్నారు. దీంతో ముత్తుకూరు పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే సిమ్ కార్డులను తీసుకొనే సమయంలో ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకునే కొందరు అదనపు కాపీలు తీసి.. వాటిని మరికొన్ని సిమ్ కార్డులు పొందేందుకు వినియోగిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు.  ఇలా నకిలీ సిమ్స్ నేరస్థులకు విక్రయించే ముఠాలు ఉన్నాయని.. ప్రజలు అలెర్ట్‌గా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Ap Crime

కర్ణాటక పోలీసుల అదుపులో నిందితుడు

Also Read: నరాలు తెగే ఉత్కంఠ.. శవం పాతి పెట్టారన్న సమాచారంతో పోలీసుల తవ్వకాలు.. చివరికి ట్విస్ట్

తిప్పతీగతో దిమ్మతిరిగే బెనిఫిట్స్.. రోజు 2 ఆకులు నమిలితే ఎన్నో ఉపయోగాలు

Latest Articles
ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు.. వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి..
ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు.. వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో..
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక