Tippa Teega: తిప్పతీగతో దిమ్మతిరిగే బెనిఫిట్స్.. రోజు 2 ఆకులు నమిలితే ఎన్నో ఉపయోగాలు
తిప్పతీగ.. సిటీలలో ఉండేవాళ్లకు దీని గురించి తెలియకపోయినా.. పల్లె జనాలకు మాత్రం నిత్యం కనిపించేదే. ఇది గ్రామాల్లో ఇంటి పరిసరాల్లోనే పెరుగుతుంది.రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఈ తీగ బాగా ఉపయోగపడుతుందని పెద్దలు చెబుతారు.
నేచర్‌లో లభించే అనేక మొక్కలు మనకు చాలా మంచి చేస్తాయి. మన చుట్టూ ఉండే మొక్కల్లో చాలా రకాల మొక్కల గురించి.. వాటి ఉపయోగాల గురించి చాలామందికి తెలియదు. అలాంటి మొక్కల్లో తిప్పతీగ కూడా ఒకటి. ఆయుర్వేద మందుల్లో ఈ తీగను విరివిగా వాడతారు. సిటీలలో ఉండేవాళ్లకు తిప్పతీగ గురించి తెలియకపోయినా.. పల్లె జనాలకు మాత్రం నిత్యం కనిపించేదే. ఇది గ్రామాల్లో ఇంటి పరిసరాల్లోనే పెరుగుతుంది.రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఈ తీగ బాగా ఉపయోగపడుతుందని పెద్దలు చెబుతారు. దీని వల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలా మందికి అవగాహన లేదు. దీన్ని ఇంగ్లిష్‌లో గిలోయ్ అని, సంస్కృతంలో అమృత అని పిలుస్తారు. ఇది అన్ని కాలాల్లోనూ పచ్చగా ఉండి చెట్లపైకి ఎగబాకుతుంది. ఆరోగ్య సమస్యలు లేకపోయినప్పటికీ.. రోజు రెండు ఆకులను నమిలితే మంచిదేనని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తిప్పతీగతో జ్యూస్, పౌడర్, కాప్సూల్స్ తయారు చేసి అమ్ముతారు. రోగ నిరోధక శక్తి మెండుగా ఉండటంతో కరోనా నుంచి ఇది రక్షణ కల్పిస్తుందని చెబుతున్నారు నిపుణులు.
తిప్పతీగలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు :
- తిప్పతీగ ఆకుల చూర్ణంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
- సీజన్‌లో వచ్చే జ్వరాలు, వ్యాధులు, ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది.
- తిప్పతీగలో ఉండే యాంటీ బయోటిక్, యాంటీ వైరల్, యాంటీ ఫంగస్ గుణాలు శరీరంలో చేరే సూక్ష్మ క్రిములను నాశనం చేస్తాయి.
- తిప్పతీగ ఆకుల పొడిని బెల్లంలో కలుపుకుని ప్రతిరోజూ తీసుకుంటే..అజీర్తి తగ్గుతుంది. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది.
- డయాబెటిస్ ఉన్నవారు తిప్పతీగ చూర్ణాన్ని నిత్యం ఉదయం, సాయంత్రం తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించుకోవచ్చు.
- ఒత్తిడి, మానసిక ఆందోళనలతో సతమతం అయ్యేవారు తిప్పతీగ చూర్ణాన్ని రోజూ తీసుకుంటే ఫలితం ఉంటుంది. జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.
- జలుబు, దగ్గు, టాన్సిల్స్ తదితర శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు తిప్పతీగ చూర్ణాన్ని వాడితే ఫలితం ఉంటుంది.
- గోరు వెచ్చని పాలలో కొద్దిగా తిప్పతీగ చూర్ణం, అల్లం రసం కలిపి రోజూ రెండు పూటలా తాగుతుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
- సీజనల్ వ్యాధులు విష జ్వరాలైన డెంగ్యూ, స్వైన్ ఫ్లూ మలేరియా వంటి వాటిని పూర్తిగా నివారించగల శక్తి తిప్పతీగకు ఉంటుంది.
- హెపటైటిస్, ఆస్తమా, జ్వరం, డయాబెటిస్, గుండె సంబంధిత రోగాలను నయం చేయడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది.
- తిప్పతీగ పొడిని వేడి పాలలో కలుపుకుని తాగితే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
- ముఖంపై మచ్చలు, మొటిమలు మాత్రమే కాదు వృద్దాప్య ఛాయలు రాకుండా చేయగల గుణాలు తిప్పతీగలో ఉన్నాయి.
గమనిక: ఈ కథనంలో పేర్కొన్న సమాచారం కేవలం సూచనలుగా మాత్రమే తీసుకోండి. ఇటువంటి చికిత్స/మందు/ఆహారం అనుసరించే ముందు డాక్టర్‌ని సంప్రదించండి.
Also Read: Mohan Babu: ట్రోలర్స్‌కు మోహన్‌బాబు లీగల్ నోటీసులు.. రూ.10 కోట్ల దావా!