Mohan Babu: ట్రోలర్స్​కు మోహన్​బాబు లీగల్ నోటీసులు.. రూ.10 కోట్ల దావా!

Tollywood: టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబుకు సహనం నశించింది. తనపై, తన కుటుంబంపై వస్తున్న అసభ్య మీమ్స్, ట్రోలింగ్‌పై ఆయన సీరియస్ అయ్యారు. ఈ విషయంలో న్యాయపరంగా ముందుకు వెళ్లాలని డిసైడయ్యారు.

Mohan Babu: ట్రోలర్స్​కు మోహన్​బాబు లీగల్ నోటీసులు.. రూ.10 కోట్ల దావా!
Mohan babu
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 19, 2022 | 5:33 PM

Manchu Family: తెలుగు సినిమా లెజెండ్స్‌లో మోహన్ బాబు ఒకరు. సినిమా నటుడిగా, నిర్మాతగా,  విద్యాసంస్థల అధినేత అయిన ఆయన గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  మోహన్​బాబు ‘సన్ ఆఫ్ ఇండియా'( Son of India) మూవీతో ప్రేక్షకులను ముందుకొచ్చారు. అయితే ఊహించని విధంగా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. మూవీపై మంచి నమ్మకం పెట్టుకున్న మోహన్ బాబుకు.. ఈ రకమైన రెస్పాన్స్ రావడం బాధ కలిగింది. సోషల్ మీడియాలో తనతో పాటు ఆయన కుటుంబంపై తెగ ట్రోల్స్, మీమ్స్(memes) రావడం ఇందుకు ఒక కారణమని ఆయన భావించారు. ఈ క్రమంలోనే ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. సదర్ మీమ్ పేజీల అడ్మిన్​లకు లీగల్​ నోటీసులు పంపించారు. రూ.10 కోట్ల దావా కూడా వేసినట్లు సమాచారం అందుతోంది.  ట్రోల్స్‌ అంటే నవ్వించేలా ఉండాలి కానీ, అసభ్యకరంగా ఉండకూడదని ఇటీవల వ్యాఖ్యానించారు మోహన్ బాబు. ఓ ఇద్దరు హీరోలు యాబై నుంచి వంద మందిని ప్రత్యేకంగా ట్రోల్ చేయడం కోసం నియ‌మించుకుని మరీ తనను ట్రోల్ చేయిస్తున్నారని సంచలన కామెంట్స్ చేశారు. ఆ హీరోలు ఎవరో తెలుసని పేర్కొన్నారు. అయితే ఇలా ట్రోల్స్‌ చేయించేవాళ్లు తాత్కాలికంగా ఆనందం పొందవచ్చు, కానీ ఏదో ఒక సమయంలో వాళ్లు కూడా ఇబ్బందులు ఎదుర్కొక తప్పదని హెచ్చరించారు. ఈ క్రమంలో ఆయన ట్రోలర్స్‌కు లీగల్ నోటీసులు పంపడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

Son Of India

Also Read: పేరుకే బ్యూటీషియన్.. ఆమె ఇంట్లోని ఫ్రిజ్‌లో కనిపించింది చూసి పోలీసులు షాక్

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి