Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krishna District: పేరుకే బ్యూటీషియన్.. ఆమె ఇంట్లోని ఫ్రిజ్‌లో కనిపించింది చూసి పోలీసులు షాక్

Andhra News: ఆమె బ్యూటీషియన్.. భర్తను వదిలేసి ప్రియుడితో డేటింగ్ చేస్తుంది. అయితే అనూహ్యంగా ఆమెను పోలీసులు అరెస్ట్ చేయడంతో.. స్థానికులంతా షాక్ అయ్యారు.

Krishna District: పేరుకే బ్యూటీషియన్.. ఆమె ఇంట్లోని ఫ్రిజ్‌లో కనిపించింది చూసి పోలీసులు షాక్
Ap Crime News
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 18, 2022 | 3:56 PM

ఆమె బ్యూటీషియన్.. భర్తను వదిలేసి ప్రియుడితో డేటింగ్ చేస్తుంది. అయితే అనూహ్యంగా ఆమెను పోలీసులు అరెస్ట్ చేయడంతో.. స్థానికులంతా షాక్ అయ్యారు. అరెస్ట్ చేసింది డేటింగ్‌లో ఉన్నందుకు కాదండోయ్… అసలు వివరాలు తెలుసుకుందాం పదండి. కృష్ణాజిల్లా  గుడ్లవల్లేరు( gudlavalleru) సంత రోడ్డులో నివాసం ఉంటున్న బ్యూటీషియన్ హాలీ మున్నీసా బేగం ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. బ్యూటీషియన్​ ముసుగులో ఆమె గంజాయి వ్యాపారం చేస్తున్నట్టు పోలీసులకు ఉప్పు అందింది. దీంతో ఇరుగుపొరుగు వారిని ఎంక్వైరీ చేయగా అలాంటిది ఏం లేదనే సమాధానం వచ్చింది. అయినా కానీ డ్యూటీలో భాగంగా పోలీసులు తనిఖీలు చేసేందుకు ఆమె ఇంటికి వెళ్లారు. ఇళ్లంతా జల్లెడ పట్టినా ఏం దొరకలేదు. పాపం అనవసరంగా ఆవిడను అనుమానించాం.. అని అనుకుంటుండగా అసలు నిజం బయటపడింది. వంటింట్లోని ఫ్రిడ్జ్​ డోరు తీస్తే గానీ.. అస్సలు బాగోతం వెలుగుచూసింది. ఈ సోదాల్లో ఫ్రిడ్జ్​లో దాచిన 550 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దీంతో బ్యూటీషియన్ ముసుగులో మహిళ చేస్తున్న గంజాయి దందా గురించి తెలిసి చుట్టుపక్కల ఇళ్ల వారు కంగుతిన్నారు. భర్తతో విడిపోయిన బ్యూటీషియన్.. సాధిక్ అనే వ్యక్తితో సహజీవనం(Dating) చేస్తోంది. ఇటీవలే ఆమె ప్రియుడు సాధిక్ గంజాయి కేసులో పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. సాధిక్​ను పోలీసులు విజయవాడ జైలుకు తరలించారు. ఎంక్వైరీలో అతడు కీలక విషయాలు వెల్లడించాడు. సాధిక్ తెలిపిన వివరాల ప్రకారం బ్యూటీషియన్ హాలిమున్నీసా బేగం ఇంట్లో తనిఖీలు చేయగా, ఫ్రిడ్జ్​లో దాచి ఉంచిన 550 గ్రాముల గంజాయి(Cannabis) దొరికింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.

ఈమె మహేష్ బాబు హీరోయినా..!!.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిందిగా..
ఈమె మహేష్ బాబు హీరోయినా..!!.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిందిగా..
గరుడపురాణం ప్రకారం ఇలాంటి వ్యక్తి జీవితంలో కష్టాలు ఎప్పటికీ అంతకా
గరుడపురాణం ప్రకారం ఇలాంటి వ్యక్తి జీవితంలో కష్టాలు ఎప్పటికీ అంతకా
పునరుత్పాదక ఇంధన రంగంలో భారీగా నియామకాలు.. వీరికి ఫుల్ డిమాండ్!
పునరుత్పాదక ఇంధన రంగంలో భారీగా నియామకాలు.. వీరికి ఫుల్ డిమాండ్!
ఈ బుజ్జితల్లి ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో భార్య..గుర్తు పట్టారా?
ఈ బుజ్జితల్లి ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో భార్య..గుర్తు పట్టారా?
IPLలో ఆ రూల్‌ అవసరం లేదు.. ధోని షాకింగ్‌ కామెంట్స్‌!
IPLలో ఆ రూల్‌ అవసరం లేదు.. ధోని షాకింగ్‌ కామెంట్స్‌!
రక్తహీనత సమస్యా బాబా రామ్‌దేవ్ సూచించిన ఈ రెమెడీని ప్రయత్నించండి
రక్తహీనత సమస్యా బాబా రామ్‌దేవ్ సూచించిన ఈ రెమెడీని ప్రయత్నించండి
ఇది కదా కావాల్సిందే.. పీఎఫ్‌ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త..
ఇది కదా కావాల్సిందే.. పీఎఫ్‌ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త..
అక్కడ డిజాస్టర్ కొట్టినా కూడా భారీ ఆఫర్ అందుకుంది..
అక్కడ డిజాస్టర్ కొట్టినా కూడా భారీ ఆఫర్ అందుకుంది..
జీటీపై పంజాబ్‌ గెలుపు.. ఏడుస్తున్న ఆర్సీబీ అభిమానులు!
జీటీపై పంజాబ్‌ గెలుపు.. ఏడుస్తున్న ఆర్సీబీ అభిమానులు!
విద్యార్ధులకు గ్రాండ్ సమ్మర్ ఇంటర్న్‌షిప్‌లు 2025.. దరఖాస్తు ఇలా.
విద్యార్ధులకు గ్రాండ్ సమ్మర్ ఇంటర్న్‌షిప్‌లు 2025.. దరఖాస్తు ఇలా.