Pregnancy: ప్రెగ్నెన్సీ సమయంలో జాగ్రత్త.. తల్లికి ఈ వ్యాధి ఉంటే బిడ్డకి ఇన్ఫెక్షన్..?
Pregnancy: హెపటైటిస్ బి వ్యాధికి కచ్చితమైన నివారణ లేదు. దీనివల్ల చాలా ఆరోగ్య సమస్యలని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా దీని విషయంలో గర్భిణులు చాలా జాగ్రత్తగా ఉండాలి.
Pregnancy: హెపటైటిస్ బి వ్యాధికి కచ్చితమైన నివారణ లేదు. దీనివల్ల చాలా ఆరోగ్య సమస్యలని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా దీని విషయంలో గర్భిణులు చాలా జాగ్రత్తగా ఉండాలి. హెపటైటిస్ బి వల్ల కాలేయం దెబ్బతింటుంది. చివరకు కాలేయ క్యాన్సర్‌కు దారితీస్తుంది. హెపటైటిస్ బి సమస్య గర్భధారణ సమయంలో సంభవిస్తే అది చాలా ప్రమాదకరం. ఎందుకంటే తల్లికి ఈ వ్యాధి ఉంటే బిడ్డకు కూడా ఈ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. కానీ వైద్య సంరక్షణ, ఆరోగ్యకరమైన జీవనశైలి ద్వారా మీరు ఈ వ్యాధి దుష్ప్రభావాలను చాలా వరకు తగ్గించవచ్చు.
గర్భధారణలో హెపటైటిస్ బి ప్రమాదాలు
గర్భధారణ సమయంలో హెపటైటిస్ బి సోకితే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై చెడు ప్రభావం ఉంటుంది. నెలలు నిండకుండానే బేబీ ఏర్పడవచ్చు. బిడ్డ బరువు కూడా తక్కువగా ఉంటుంది. మధుమేహం బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయి. రక్తస్రావం సమస్యలు అధికంగా ఉంటాయి. తల్లికి హెపటైటిస్ సోకితే పుట్టబోయే బిడ్డకు కూడా హెపటైటిస్ బి వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
చికిత్స ఎప్పుడు ప్రారంభించాలి?
నవజాత శిశువును హెపటైటిస్ బి నుంచి రక్షించడానికి గర్భిణులకు రక్త పరీక్షలు చేస్తారు. పిల్లల శరీరంలో ఈ వైరస్ ఉన్నట్లు తేలితే వెంటనే టీకాలు ప్రారంభిస్తారు. శిశువు పుట్టిన తర్వాత 4 నుంచి 12 వారాల వరకు చికిత్స కొనసాగిస్తారు. ఈ సమయంలో మందులు సకాలంలో తీసుకోవాలి. సిజేరియన్ ద్వారా ప్రసవించే తల్లులకు హెపటైటిస్ బి వచ్చే ప్రమాదం లేదని ప్రజలలో ఒక నమ్మకం ఉంది. అయితే ఇందులో నిజం లేదు. చాలా మంది పిల్లలు హెపటైటిస్ బి వంటి తీవ్రమైన వ్యాధిని ఎదుర్కోలేరు. కాబట్టి గర్భధారణ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. తద్వారా ఇటువంటి వ్యాధులు సోకినా తట్టుకునే శక్తి ఏర్పడుతుంది. హెపటైటిస్ బి సమస్యను నివారించడానికి బీట్‌రూట్‌ను ఎక్కువగా తీసుకోవాలి. ఇందులో ఐరన్, పొటాషియం, ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం, కాల్షియం మొదలైన పోషకాలు ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.