చలికాలంలో చిలగడదుంప ఎందుకు తినాలో తెలుసా?

03 January 2025

TV9 Telugu

TV9 Telugu

రుచికి తియ్యగా, ప్రతి ఒక్కరికీ అందుబాటు ధరలో లభించే చిలగడదుంపల్లో పోషకాలు ఎక్కువే. వీటిని క్రమం తప్పక తింటే పోషకాహార లేమిని అధిగమించొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు

TV9 Telugu

చిలగడదుంపలను పండ్లు, కూరగాయలు రెండింటి లెక్కలోనూ వేసుకోవచ్చు. ఎందుకంటే వీటిని పచ్చిగా, ఉడకబెట్టి తినొచ్చు. రకరకాల కూరలూ వండొచ్చు

TV9 Telugu

చిలగడ దుంపల్లో బీటా-కెరొటిన్‌, విటమిన్‌-ఈ, సి, బి-6, పొటాషియం, ఐరన్‌ పుష్కలంగా ఉంటాయి. వీటిల్లో గ్లైసమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉండటం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్థులూ తీసుకోవచ్చు

TV9 Telugu

ఇవి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. అంతర్గత అవయవాల వాపుని తగ్గిస్తాయి. ఫైబ్రినోజెన్‌ రక్తం గడ్డకట్టకుండా సాయపడుతుంది. ఇవి ఎక్కువగా శీతాకాలంలో లభిస్తాయి

TV9 Telugu

ఇవి కార్బోహైడ్రేట్లు, ఫైబర్.. పవర్‌హౌస్. విటమిన్ ఎ అధిక పరిమాణంలో లభిస్తుంది. వీటిల్లో ఉండే ఉండే ఫైబర్ జీవక్రియను వేగవంతం చేయడంలో కూడా సహాయపడుతుంది. వీటిల్లో కార్బోహైడ్రేట్లు, జింక్, మెగ్నీషియం వంటి పోషకాలు కూడా ఉన్నాయి

TV9 Telugu

అయితే చిలగడదుంప తినడానికి సరైన సమయం ఏమిటో చాలా మందికి తెలియదు. ఆయుర్వేద నిపుణుల ప్రకారం.. చిలగడదుంప తినడానికి నిర్ణీత సమయం అంటూఏదీ ప్రత్యేకంగా లేదని, వీటిని ఎప్పుడైనా హాయిగా తినొచ్చని అంటున్నారు

TV9 Telugu

ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చిలగడదుంప తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది

TV9 Telugu

ఫైబర్ అధికంగా ఉండే ఈ చిలగడదుంప తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇందులో ఉండే కెరొటినాయిడ్స్‌, విటమిన్‌ ఏ వంటివి కంటిచూపుని మెరుగుపరుస్తాయి. వీటిల్లో ఐరన్‌ కూడా ఎక్కువే