Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

టాయిలెట్ వెళ్ళాక వెంటనే వాటర్ తీసుకుంటే మూత్రాషయం పై ఎక్కువ ఒత్తిడి పడుతుందని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా మూత్రపిండాల సాధారణ పనితీరుపై ప్రతికూల ప్రభావం కనిపిస్తుంది తెలిపారు. అలాగే లంగ్స్ కు సంబంధించిన వ్యాధులు అంటూ వ్యాధులు లాంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
ఉదయం ఖాళీ కడుపుతో నీరు త్రాగడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడటమే కాకుండా మలబద్ధకం నుండి బయటపడటానికి కూడా సహాయపడుతుంది. ఆరోగ్యంగా ఉండాలంటే రోజు నాలుగు లీటర్ల నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు. నిద్ర మేల్కొన్న వెంటనే నీటిని తాగితే పేగు కదలికలు ఆరోగ్యంగా మారుతాయి. శరీరం డీ హైడ్రేషన్‌ కాకుండా ఉంటుంది. ఉదయాన్నే నీటిని తాగడం వల్ల వ్యాధి నిరోధకశక్తి కూడా పెరుగుతుంది.
Follow us
Yellender Reddy Ramasagram

| Edited By: Jyothi Gadda

Updated on: Jan 03, 2025 | 9:53 PM

ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు సరైన మోతాదులో వాటర్ తీసుకోవాలి అని వైద్య నిపుణులు చెబుతూనే ఉంటారు. వాటర్ శరీరంలోని మలినాల్ని బయటకు పంపించడంలో ఎంతో మేలు చేస్తాయి. అలాగే బాడీని హైడ్రేట్ గా ఉంచుతాయి. అయితే వాటర్ తాగే విషయంలో కొన్ని నియమాలు పాటించాలి. నిలబడి తాగకూడదని తిన్న వెంటనే నీళ్లు తాగకూడదని ఆయాస పడుతున్నప్పుడు వాటర్ తాగకూడదని రన్నింగ్ చేసిన వెంటనే తాగకూడదని చెబుతుంటారు. అసలు వాటర్ తాగడంపైన నిపుణులు ఇచ్చే క్లారిటీ ఏంటి చూద్దాం.

మామూలుగా టాయిలెట్ వెళ్లాక దాహం వేస్తుంది. కొంతమంది అలా బాత్రూం కి వెళ్లి రాగానే వాటర్ తాగుతారు. ముఖ్యంగా ఆఫీసుల్లో వర్క్ చేసే ఉద్యోగులు బ్రేక్ టైం లో వాష్ రూమ్ వెళ్లి వచ్చి వెంటనే వాటర్ తీసుకుంటున్నారు. ఇది చాలామందికి అలవాటు మరి ఇలా వాటర్ తాగడం మంచిదేనా అని వచ్చిన సందేహాలకు… నిపుణులు చెప్పిన సమాధానం వింటే షాక్ అవ్వాల్సిందే.. మూత్రం వెళ్ళాక వెంటనే వాటర్ తాగడం అస్సలు ఆరోగ్యానికి మంచిది కాదని ఇప్పుడున్న మాట.

ఆయుర్వేదం ప్రకారం మూత్రం వెళ్లాక నీరు తాగడం అనేది మంచిది కాదని వెల్లడించారు. అయితే మూత్రం వెళ్లడం అనేది మూత్రపిండాలు మృత్వశ్యానికి సంబంధించిన ప్రక్రియ. టాయిలెట్ వెళ్ళాక వెంటనే వాటర్ తీసుకుంటే మూత్రాషయం పై ఎక్కువ ఒత్తిడి పడుతుందని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా మూత్రపిండాల సాధారణ పనితీరుపై ప్రతికూల ప్రభావం కనిపిస్తుంది తెలిపారు. అలాగే లంగ్స్ కు సంబంధించిన వ్యాధులు అంటూ వ్యాధులు లాంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మూత్ర విసర్జన చేసిన తర్వాత శరీరంలో ద్రవాల స్థాయి కొంత తగ్గుముఖం పడుతుంది. కడుపు ఉబ్బడం, పొత్తికడుపులో నొప్పి అసౌకర్యంగా అనిపించడం గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్టర్ పై ఎఫెక్ట్ చూపించడం లాంటి సమస్యలు ఏర్పడతాయి. అలాగే ఇన్ఫ్లమేషన్, హైపోనా ట్రెమియా లాంటి సమస్యలు వస్తాయి. టాయిలెట్ చేశాక ఎంత విరామం తర్వాత వాటర్ తాగాలో కూడా నిపుణులు తెలిపారు. టాయిలెట్ తర్వాత ఎప్పుడైనా సరే దాదాపు 20 నిమిషాల క్యాప్ తర్వాత వాటర్ తాగాలని వెల్లడించారు. ఈ గ్యాప్ లో నీరు తాగితే శరీరానికి కూడా రిలీఫ్ ఉంటుంది అనేది నిపుణుల మాట.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను నేరుగా సంప్రదించండి.)