చలి చంపేస్తుందా? ఓ చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకుని చూడండి
03 January 2025
TV9 Telugu
TV9 Telugu
తీపి తినాలనుకుంటే చక్కెరకు బదులు బెల్లాన్ని ఉపయోగిస్తుంటారు చాలామంది. రుచితో పాటు ఆరోగ్యాన్నీ అందించే బెల్లం మన శరీరానికి ఎన్నో రకాలుగా మేలు
TV9 Telugu
ఇందులో క్యాల్షియం ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా ఉంచుతుంది. బెల్లంలో ఉండే ఇనుము, ఫాస్ఫరస్ రక్తహీనత ఎదురుకాకుండా చేస్తాయి. రక్తాన్ని శుద్ధి చేసే గుణం దీనికి ఉంది
TV9 Telugu
గర్భిణులు బెల్లాన్ని తరచూ ఆహారంలో తీసుకోవడం వల్ల వివిధ రకాల అనారోగ్యాలు, అలర్జీల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. చక్కెర బదులు బెల్లాన్ని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి
TV9 Telugu
అయితే చల్లని వాతావరణంలో బెల్లం తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బెల్లంకి వేడి స్వభావం ఉంటుంది. ఇది చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి సహాయపడుతుంది
TV9 Telugu
బెల్లంలో విటమిన్ బి కాంప్లెక్స్, కాల్షియం, ఐరన్, ఫోలేట్, ఫాస్పరస్, సెలీనియం, ప్రొటీన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చలికాలంలో మధ్యాహ్నం లేదా రాత్రి భోజనం తర్వాత బెల్లం తినవచ్చు
TV9 Telugu
ముఖ్యంగా చలికాలంలో బెల్లం తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల అన్ని రకాల పొట్టకు సంబంధించిన సమస్యలు నయమవుతాయి
TV9 Telugu
ఐరన్ లోపం ఉన్నవారు తప్పనిసరిగా బెల్లం తినాలి. ఇది రక్త హీనతను నివారిస్తుంది. బెల్లం తినడం వల్ల చర్మానికి కూడా చాలా మేలు కలుగుతుంది. దీన్ని తినడం వల్ల శరీరంలోని హానికరమైన టాక్సిన్స్ తొలగిపోతాయి
TV9 Telugu
బెల్లం తక్షణ శక్తిని పెంచడానికి కూడా పనిచేస్తుంది. అలసటగా అనిపించినప్పుడు ఓ చిన్న బెల్లం ముక్క తినవచ్చు. రోజుకో చిన్న బెల్లం ముక్క తినే మహిళల్లో నెలసరి సమస్యలు చాలావరకు తగ్గుతాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి