Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు

Today Horoscope (January 4, 2025): మేష రాశి వారికి కొన్ని ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. వృషభ రాశి వారు ఆర్థిక విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. మిథున రాశి వారికి ఆదాయపరంగా రోజంతా సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు
Horoscope Today 04th January 2025
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jan 04, 2025 | 5:01 AM

దిన ఫలాలు (జనవరి 4, 2025): మేష రాశి వారికి కొన్ని ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. వృషభ రాశి వారు ఆర్థిక విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది.  మిథున రాశి వారికి ఆదాయపరంగా రోజంతా సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోయే అవకాశముంది. అదే సమయంలో వారి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. వృత్తి జీవితం బిజీగా సాగిపోతుంది. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరుగుతాయి. కొన్ని ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి సంస్థల నుంచి ఆఫర్లు, అవకాశాలు అందు తాయి. ఆదాయ వ్యయాలు దాదాపు సమానంగా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగిపో తాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆర్థిక విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగపరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో సంపాదన పెరిగే అవకాశం ఉంది. కుటుంబపరంగా కొద్దిగా చికాకు లుంటాయి. ఆదాయం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. నిరుద్యోగులకు తీపి కబురు అందుతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఆదాయపరంగా రోజంతా సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. కుటుంబ జీవితం సాఫీగా గడిచిపోతుంది. బంధువులతో సామరస్యం పెరుగుతుంది. ఆదాయానికి లోటుండదు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. మిత్రుల వల్ల డబ్బు నష్టపోయే సూచనలున్నాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశం ఉంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో కొద్దిపాటి ఒత్తిడి, వేధింపులు ఉండవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆదాయ సంబంధమైన ప్రయత్నాలన్నీ సానుకూలమ వుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. బకాయిలు, బాకీలు చేతికి అందుతాయి. ఇత రులకు సహాయ సహకారాలు అందిస్తారు. బంధువుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. ఇంటా బయటా మాట చెల్లుబాటు అవుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగ జీవితం సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరుగుతాయి. కొద్దిపాటి ఖర్చుతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. ఆస్తి వివాదానికి సంబంధించి శుభవార్త వింటారు. కుటుం బంలో శుభ పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంది. పిల్లల్లో పురోగతి కనిపిస్తుంది. ఆదా యం చాలావరకు నిలకడగా ఉంటుంది. ఒకరిద్దరికి ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో సహోద్యోగుల నుంచి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అధికారుల నుంచి అండదండలు లభిస్తాయి. వృత్తి జీవితంలో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు వృద్ధి చెందుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉద్యోగం మారే అవకాశాలున్నాయి. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. హోదా పెరిగే అవకాశం కూడా ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండకపోవచ్చు. ఆదాయం అనేక విధాలుగా వృద్ధి చెందు తుంది. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యలను పరిష్కారమవుతాయి. ఒకరిద్దరు బంధు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక విషయాల మీద ఆసక్తి పెరుగుతుంది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది.

వృశ్చికం (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ)

ఆర్థిక వ్యవహారాలను చక్కబరిచే ప్రయత్నం చేస్తారు. కొద్ది ప్రయత్నంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. అదనపు ఆదాయ మార్గాలపై శ్రద్ధ పెంచడం మంచిది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ పెద్దల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. వృత్తి జీవితం మీద బాగా ఒత్తిడి ఉంటుంది. వ్యాపారాలు యథావిధిగా కొనసాగుతాయి. ఒక శుభవార్త వినే అవకాశం ఉంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో శుభ పరిణా మాలు చోటు చేసుకుంటాయి. వార్తలు వినే అవకాశం ఉంది. ఉద్యోగానికి సంబంధించిన ఏ ప్రయ త్నమైనా సఫలం అవుతుంది. పెళ్లి ప్రయత్నాలలో తప్పకుండా శుభవార్తలు వింటారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. కొందరు స్నేహితులకు అండగా నిలబడతారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం పరవాలేదు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)

కొద్దిపాటి శ్రమ, తిప్పట, ఖర్చులతో కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. వృత్తి జీవితంలో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్త అందుతుంది.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. వాటితో పాటే కొన్ని లక్ష్యాలు కూడా మీద పడతాయి. వృత్తి జీవితంలో ఆశించిన పురోగతి ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి. ఆరోగ్యం చాలావరకు నిలకడగా ఉంటుంది. ఇష్టమైన బంధుమిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరగడానికి, ఆదాయం వృద్ధి చెందడానికి అవకాశం ఉంది. అనుకోకుండా ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఆదాయ వృద్ధికి సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. ఎదురు చూస్తున్న శుభ వార్తలు వినడం జరుగుతుంది. కొందరు బంధుమిత్రులు మీ సలహాలు, సూచనల వల్ల ప్రయో జనం పొందుతారు. ఆరోగ్యం నిలకడగా కొనసాగుతుంది. సొంత పనులు మీద శ్రద్ద పెడతారు.

ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!