Bay Leaf Benfits: ఈ ఒక్క ఆకు ఎన్నో సమస్యలకు దివ్య ఔషధం.. వీటితో ఇలా చేస్తే చాలు..?

Bay Leaf Benfits: మనం ప్రతిరోజు తెలియకుండానే ఆహారంలో కొన్ని ఆయుర్వేదానికి సంబంధించిన వాటిని తీసుకుంటాం. కానీ వాటిలో ఔషధ గుణాలు ఉంటాయని ఎవ్వరికీ తెలియదు.

Bay Leaf Benfits: ఈ ఒక్క ఆకు ఎన్నో సమస్యలకు దివ్య ఔషధం.. వీటితో ఇలా చేస్తే చాలు..?
Bay Leaf
uppula Raju

|

Feb 20, 2022 | 9:32 AM

Bay Leaf Benfits: మనం రోజు తినే ఆహారంలో కొన్ని ఆయుర్వేద గుణాలున్న పదార్థాలు ఉంటాయి. కానీ వీటి గురించి ఎవ్వరూ పెద్దగా పట్టించుకోరు. సుగంధ ద్రవ్యాలతో పాటు బే ఆకులను వంటలలో విరివిగా ఉపయోగిస్తారు. బే ఆకులో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. వీటిని ఎక్కువగా కూరలు, బిర్యాని చేయడంలో వినియోగిస్తారు. ఇవి ఆహార రుచిని పెంచడమే కాకుండా ఎన్నో ఆరోగ్య సమస్యలని పరిష్కరిస్తాయి. ఇందులో ఉండే పోషకాలు అనేక వ్యాధులని తగ్గిస్తాయి. బే ఆకులు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని సహజ వైద్యంలో ఉపయోగిస్తారు. ఇవి లారెల్ అనే సతత హరిత మొక్క నుంచి వస్తాయి. వీటిని ఔషధాలలో విరివిగా వాడుతారు. ఆయుర్వేదం ప్రకారం బే ఆకు దగ్గు, అపానవాయువు, మధుమేహం, క్యాన్సర్, కడుపు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

1. నిద్రలేమి సమస్య

చాలా మందికి నిద్ర సరిగ్గా పట్టదు. ఇందుకోసం మందులు కూడా వాడుతారు. ప్రస్తుత కాలంలో ఇది చాలా మందిని వేధిస్తున్న సమస్య. బే ఆకు నిద్రలేమికి విరుగుడుగా పనిచేస్తుంది. పడుకునే ముందు గదిలో నాలుగు బే ఆకులను కాల్చండి. వీలుకాకుంటే పడుకునే ముందు నీటిలో బే ఆకులను వేసి తాగండి. ఇది మీ మెదడుకు ప్రశాంతతను కలిగిస్తుంది. మీకు ప్రశాంతమైన నిద్ర వచ్చేలా చేస్తుంది.

2) మధుమేహం తగ్గిస్తుంది

బే ఆకులను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బే ఆకులు యాంటీ-ఆక్సిడెంట్లకు మంచి మూలం. ఇన్సులిన్ ఉత్పత్తికి సహాయపడతాయి. కాబట్టి టైప్ 2 డయాబెటిస్‌ను ఎదుర్కోవడంలో ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది.

3) ఒత్తిడిని తగ్గిస్తుంది

బే ఆకులో లినోలియం అనే మూలకం ఉంటుంది. ఇది మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. కేవలం 10 నిమిషాల బే లీఫ్ సువాసన మంచి అనుభూతిని కలిగిస్తుంది. మనస్సును శాంతపరుస్తుంది.

4) గుండె ఆరోగ్యానికి మంచిది

బే ఆకులలో రాటిన్, కెఫిక్ యాసిడ్ వంటి పదార్థాలు ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. బే ఆకులు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. తద్వారా గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది.

5) రోగనిరోధక శక్తిని పెంచుతుంది

శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో విటమిన్ సి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది బే ఆకులలో పుష్కలంగా ఉంటుంది. అదనంగా బే ఆకులో జింక్, విటమిన్ ఎ ఉంటాయి. ఇవి కళ్ళు, ముక్కు, గొంతు, జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. దీని వల్ల ఉదర సంబంధ వ్యాధులు నయమవుతాయి.

6) చుండ్రు సమస్యని తగ్గిస్తుంది

బే ఆకులు జుట్టు సమస్యలను నయం చేస్తాయి. ప్రస్తుతం చాలా మంది చుండ్రు సమస్యతో బాధపడుతున్నారు. బే ఆకు ఈ సమస్యపై ప్రభావవంతంగా పనిచేస్తుంది. మీకు చుండ్రు సమస్య ఉంటే బే ఆకు నూనెను రాసుకుంటే సరిపోతుంది.

Burqa Tragic: బురఖా వెనుక కన్నీటి గాథ.. మొదట భర్త.. తర్వాత మామ.. సహించలేని దారుణాలు

Aadhaar Card: ఆధార్ కార్డ్‌లో ఫొటో తప్పు పడిందా.. ఆన్‌లైన్‌లో మార్చలేరు.. ఇలా చేయాల్సిందే..?

SBI Customers: ఎస్బీఐ ఖాతాదారులకు స్పెషల్ ఆఫర్.. వడ్డీ కోల్పోకుండా బెనిఫిట్స్‌ పొందే అవకాశం..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu