Burqa: బురఖా వెనుక కన్నీటి గాథ.. మొదట భర్త.. తర్వాత మామ.. సహించలేని దారుణాలు
Burqa Tragic Story: హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా రగులుతోంది. పలువురు మహిళలు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. సమాజంలోనూ మతాల మధ్య చిచ్చు రేగుతోంది. ఇంతలో ఓ
Burqa Tragic Story: హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా రగులుతోంది. పలువురు మహిళలు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. సమాజంలోనూ మతాల మధ్య చిచ్చు రేగుతోంది. ఇంతలో ఓ వింత తలాక్ కేసు తెరపైకి వచ్చింది. ట్రిపుల్ తలాక్ పై కేంద్ర ప్రభుత్వం చట్టం చేసినప్పుడు కొంతమంది వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. ఇంత జరుగుతున్నా స్త్రీల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలు ఎంతమాత్రం ఆగడం లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ముస్లిం మహిళ ఆవేదన వైరల్‌గా మారింది. ఈ వీడియోలో బాధిత మహిళ చెప్పిన ప్రకారం ఆమెని ఒక ఆటబొమ్మలా చూశారు. మొదట భర్త, తర్వాత మామ, ఆ తర్వాత మరిది ఇలా ఒకరి తర్వాత ఒకరు బలవంతంగా పెళ్లి చేసుకొని తలక్ అన్నారు.
వేధింపుల ద్వారా చిత్రహింసలు
బాధిత మహిళ ఒక న్యూస్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో తన కన్నీటి గాథని తెలియజేసింది. తనకు 2009లో పెళ్లయిందని రెండేళ్లుగా పిల్లలు లేరనే సాకుతో భర్త విడాకులు ఇచ్చాడని చెప్పింది. ఆ తర్వాత బలవంతంగా తన మామ వివాహం చేసుకున్నాడని తెలిపింది. 2017 తర్వాత సదరు మహిళని మరో వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయడానికి ప్రయత్నించారు. అత్తింటివారు చేసిన ఈ పనుల వల్ల ఆ మహిళ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. శారీరకంగా, మానసికంగా వేదనని అనుభవించింది. ఇప్పుడు ఆ మహిళ బహిరంగంగా తనకు జరిగిన అన్యాయం గురించి చెబుతోంది. తలాక్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. స్త్రీ ఇష్టానికి వ్యతిరేకంగా విడాకులు తీసుకోకూడదని కోరుతోంది. టి.ఎస్.హెచ్ వందన అనే మహిళ ఈ వీడియోని ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తుంది. మహిళకి జరిగిన అన్యాయంపై మండిపడుతున్నారు. ఆ వీడియో చూస్తే విషయం ఏంటో పూర్తిగా అర్థమవుతోంది.
Married to her husband > Divorced! > married her to his father> father divorced her > he remarried his wife> divorced! > married her to his brother to be his sis-in-law>Divorced! >he remarried her yet again, and she was his wife a third time. Tragic story behind her burqa. pic.twitter.com/IHI4YYsvDs
— Vandana T.SH ???? (@VanShar1) February 17, 2022