AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cashew: కాల్చిన జీడిపప్పులతో ఆ వ్యాధి కంట్రోల్‌ చేయొచ్చు.. రోగనిరోధక శక్తి పెంచవచ్చు..?

Cashew Benfits: డయాబెటీస్ పేషెంట్లు భారతదేశంలో అధికంగా ఉంటారు. రక్తంలో గ్లూకోజ్‌ స్థాయి పెరగడం వల్ల వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే నిపుణులు జీడిపప్పుని

Cashew: కాల్చిన జీడిపప్పులతో ఆ వ్యాధి కంట్రోల్‌ చేయొచ్చు.. రోగనిరోధక శక్తి పెంచవచ్చు..?
Cashew
uppula Raju
|

Updated on: Feb 19, 2022 | 5:20 PM

Share

Cashew Benfits: డయాబెటీస్ పేషెంట్లు భారతదేశంలో అధికంగా ఉంటారు. రక్తంలో గ్లూకోజ్‌ స్థాయి పెరగడం వల్ల వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే నిపుణులు జీడిపప్పుని మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరంగా భావిస్తున్నారు. దీనిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచవచ్చు. బరువు తగ్గించవచ్చు. ఒత్తిడిని దూరం చేయొచ్చు. రోగనిరోధక శక్తి పెంచుకోవచ్చు. ఇవే కాకుండా ఇంకా చాలా ప్రయోజనాలున్నాయి. జీడిపప్పులో పెద్ద మొత్తంలో ఫాస్పరస్, మెగ్నీషియం, ప్రొటీన్, ఫోలేట్, ఐరన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్, సెలీనియం ఉంటాయి. అంతేకాదు కాల్చిన జీడిపప్పులను మధుమేహ వ్యాధిగ్రస్తులు తప్పనిసరిగా డైట్‌లో చేర్చుకోవాలి.

రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. బ్రెయిన్ స్ట్రోక్, బహుళ అవయవ వైఫల్యం(Multiple organ failure), మూత్రపిండాల వైఫల్యం, గుండెపోటు వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. జీడిపప్పులో పొటాషియం, ఫైబర్, విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఈ పోషకాలు మధుమేహంలో ఒత్తిడి స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి. మధుమేహం ఉన్న రోగులకు బరువు తగ్గడంలో ఇబ్బంది ఉంటుంది. ఇలాంటి వారు జీడిపప్పు తీసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇందులో మెగ్నీషియం, ఫైబర్, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి బరువు తగ్గించడంలో సహాయపడుతాయి. కార్బోహైడ్రేట్లు, ఫైబర్ శరీర జీవక్రియను పెంచుతాయి, బరువు తగ్గిస్తాయి.

జీడిపప్పు తీసుకోవడం ద్వారా శరీరానికి శక్తి అందుతుంది. వీటిని ఎక్కువగా తినవలసిన అవసరం లేదు. రోజుకి 2 నుంచి 4 జీడిపప్పులు తింటే శరీరానికి తగినంత శక్తి లభిస్తుంది. జీడిపప్పులో ప్రోటీన్లు చాలా ఉంటాయి. వీటిని తీసుకోవడం ద్వారా రక్తపోటు సమస్య కూడా తగ్గుతుంది. జీడిపప్పు తీసుకోవడం వల్ల కిడ్నీ ఆరోగ్యంగా కూడా బాగుంటుంది. డయాబెటిక్ రోగుల రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటుంది. అందుకే డైట్‌లో కచ్చితంగా జీడిపప్పు ఉండాల్సిందే. అయితే ఏదైనా చేసేముందు వైద్యుడి సలహా తీసుకోవడం మాత్రం మరిచిపోవద్దు..

Pregnancy: ప్రెగ్నెన్సీ సమయంలో జాగ్రత్త.. తల్లికి ఈ వ్యాధి ఉంటే బిడ్డకి కూడా ఇన్ఫెక్షన్‌..?

Headache: మీరు కావాలని చేసే ఈ తప్పులే తలనొప్పికి కారణం.. అవేంటో తెలుసా..?

Earthquake: నార్త్‌ ఇండియాలో భూకంపాలు ఎక్కువ.. రెండు నెలల్లో100 సార్లు ప్రకంపనలు.. కారణం ఏంటంటే..?