ivy gourd: దొండకాయ తింటున్నారా.. అయితే విషయాలు తెలుసుకోండి..
చాలా మంది దొండకాయ తినరు. కానీ అది చేసే మేలు తెలిస్తే తప్పుకుండా తింటారు...
చాలా మంది దొండకాయ తినరు. కానీ అది చేసే మేలు తెలిస్తే తప్పుకుండా తింటారు. అయితే దొండకాయ ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా పండిస్తారు. ఇండోనేసియా, థాయ్‌లాండ్ వంటి దేశాల్లో ఎర్రగా పండిన దొండకాయలతో పాటు, దొండ ఆకులను కూడా తింటారు. కారణం ఇందులో ఉంటే విటమిన్లు, ఖనిజ లవణాలే..
దొండకాయల్లో పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. బీటా కెరోటిన్, విటమిన్–బి1, బి2, బి3, బి6, బి9, విటమిన్–సి వంటివి కూడా ఉంటాయి. స్వల్పంగా పిండి పదార్థాలు, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్ వంటి ఖనిజ లవణాలు దొండకాయలో ఉంటాయి. దీంతో దొండకాయలు తినడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. రోగ నిరోధక శక్తిని పెరుగుతుంది. దొండకాయలోని పీచు పదార్థాలు ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా తోడ్పడతాయి. అంతేగాక రక్తంలో చక్కెర స్థాయిని అదుపు చేస్తాయి. ఆస్తమాను నివారించడంలో కూడా దొండకాయలు కీలక పాత్ర పోషిస్తాయని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
కాన్సర్ ముప్పును కూడా తగ్గిస్తాయి. ఇక ఇందులోని బేటా కెరోటిన్ విటమిన్- ఏగా రూపాంతరం చెంది కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.
గమనిక :– అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.
Read Also.. Tippa Teega: తిప్పతీగతో దిమ్మతిరిగే బెనిఫిట్స్.. రోజు 2 ఆకులు నమిలితే ఎన్నో ఉపయోగాలు