Aadhaar Card: ఆధార్ కార్డ్‌లో ఫొటో తప్పు పడిందా.. ఆన్‌లైన్‌లో మార్చలేరు.. ఇలా చేయాల్సిందే..?

Aadhaar Card: ప్రతి భారతీయ పౌరుడి వద్ద ఉండాల్సిన ముఖ్యమైన పత్రాలలో ఆధార్ కార్డ్ ఒకటి. దీనిని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) జారీ చేస్తుంది. ఇది 12 అంకెల

Aadhaar Card: ఆధార్ కార్డ్‌లో ఫొటో తప్పు పడిందా.. ఆన్‌లైన్‌లో మార్చలేరు.. ఇలా చేయాల్సిందే..?
Pvc Card Plastic Aadhaar Card
Follow us
uppula Raju

|

Updated on: Feb 19, 2022 | 6:22 PM

Aadhaar Card: ప్రతి భారతీయ పౌరుడి వద్ద ఉండాల్సిన ముఖ్యమైన పత్రాలలో ఆధార్ కార్డ్ ఒకటి. దీనిని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) జారీ చేస్తుంది. ఇది 12 అంకెల గుర్తింపు సంఖ్య. ఇందులో బయోమెట్రిక్స్, ఫోటో, చిరునామా మొదలైన సమాచారం ఉంటుంది. అయితే ఇందులో ఏవైనా తప్పులుంటే మార్చుకోవడానికి UIDAI వెసులుబాటు కల్పిస్తోంది. ఈ వివరాలను ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చు. రెటీనా స్కాన్‌, వేలిముద్రలు, ఫొటో వంటివి మార్చుకోవాలంటే కచ్చతంగా సమీపంలోని ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ హోల్డర్ ఇందుకోసం రూ.100 (అదనంగా GST) చెల్లించాలి. అంతేకాకుండా UIDAI వెబ్‌సైట్‌లో ప్రక్రియను సులభంగా తనిఖీ చేయవచ్చు. మార్చబడిన వివరాలు ఆధార్ పోర్టల్‌లో కనిపించడానికి 90 రోజులు పడుతుంది. ఈ సాధారణ పద్దతులను అనుసరించడం ద్వారా ఎవరైనా తమ ఫోటోను Aahdaar కార్డ్‌లో మార్చుకోవచ్చు.

ఫోటోను అప్‌డేట్ చేయాలంటే ఇలా చేయండి..

1. అధికారిక వెబ్‌సైట్ కి వెళ్లండి.

2. తర్వాత ఆధార్ కార్డ్ హోల్డర్ ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి అందులో అడిగిన వివరాలను నింపండి.

3. తర్వాత దగ్గరలో ఉన్న ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌లో ఫారమ్‌ను సమర్పించాలి.

4. ఎగ్జిక్యూటివ్ వివరాలను క్రాస్-చెక్ చేసిన తర్వాత ఆధార్ కార్డ్ హోల్డర్ కొత్త ఫొటో తీస్తారు.

5. ఇప్పుడు ఆధార్ కార్డ్ హోల్డర్ రూ.100 ప్లస్ GST చెల్లించాల్సి ఉంటుంది.

6. చెల్లింపు పూర్తయిన తర్వాత వ్యక్తి అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ (URN)తో రసీదు స్లిప్‌ అందిస్తారు.

7. వివరాలు 90 రోజుల్లో అప్‌డేట్ అవుతాయి.

8. URN నంబర్‌తో డాక్యుమెంట్ హోల్డర్ UIDAI వెబ్‌సైట్‌లో ఆధార్ కార్డ్ అప్‌డేట్ స్థితిని తనిఖీ చేసుకునే అవకాశం ఉంటుంది.

9. ఆన్‌లైన్‌లో సెల్ఫ్ సర్వీస్ ద్వారా ఫొటోని అప్‌డేట్‌ చేయలేరని గుర్తుంచుకోండి.

SBI Customers: ఎస్బీఐ ఖాతాదారులకు స్పెషల్ ఆఫర్.. వడ్డీ కోల్పోకుండా బెనిఫిట్స్‌ పొందే అవకాశం..

Cashew: కాల్చిన జీడిపప్పులతో ఆ వ్యాధి కంట్రోల్‌ చేయొచ్చు.. రోగనిరోధక శక్తి పెంచవచ్చు..?

Earthquake: నార్త్‌ ఇండియాలో భూకంపాలు ఎక్కువ.. రెండు నెలల్లో100 సార్లు ప్రకంపనలు.. కారణం ఏంటంటే..?

నిద్ర ఎవరికి ఎంత అవసరం.? ఎవరు ఎంతసేపు నిద్రపోతే హార్మోన్స్ ప్రాబ్
నిద్ర ఎవరికి ఎంత అవసరం.? ఎవరు ఎంతసేపు నిద్రపోతే హార్మోన్స్ ప్రాబ్
నేనేం భయపడట్లే.. ఇప్పుడు నాకు కుదరదు.! RGV వీడియో.
నేనేం భయపడట్లే.. ఇప్పుడు నాకు కుదరదు.! RGV వీడియో.
కిస్సిక్ సాంగ్‌లో శ్రీలీల డ్యాన్స్‌పై సమంత రియాక్షన్.! వీడియో..
కిస్సిక్ సాంగ్‌లో శ్రీలీల డ్యాన్స్‌పై సమంత రియాక్షన్.! వీడియో..
పెళ్లిలో పాత సంప్రదాయాన్ని పాటించేందుకు నాగ చైతన్య నిర్ణయం.!
పెళ్లిలో పాత సంప్రదాయాన్ని పాటించేందుకు నాగ చైతన్య నిర్ణయం.!
హనుమాన్ హీరో తేజ సజ్జ కు పెద్దాయన పాదాభివందనం.! వీడియో వైరల్..
హనుమాన్ హీరో తేజ సజ్జ కు పెద్దాయన పాదాభివందనం.! వీడియో వైరల్..
పుష్ప2 నటుడు శ్రీ తేజ్‌పై కేసునమోదు! పెళ్లి చేసుకుంటానని నమ్మించి
పుష్ప2 నటుడు శ్రీ తేజ్‌పై కేసునమోదు! పెళ్లి చేసుకుంటానని నమ్మించి
రెహ్మాన్‌తో రిలేషన్ పై ఎట్టకేలకు నోరు విప్పిన మోహిని.! వీడియో..
రెహ్మాన్‌తో రిలేషన్ పై ఎట్టకేలకు నోరు విప్పిన మోహిని.! వీడియో..
అఖిల్‌కు ఎంగేజ్‌మెంట్ అయిపోయింది.. ఆ అమ్మాయి ఈమే.!
అఖిల్‌కు ఎంగేజ్‌మెంట్ అయిపోయింది.. ఆ అమ్మాయి ఈమే.!
అయ్యో.! పొలం పనులు చేస్తుండగా ఊహించని సీన్..
అయ్యో.! పొలం పనులు చేస్తుండగా ఊహించని సీన్..
50 ఏళ్లుగా అన్నమే తినని వ్యక్తి.. కేవలం అవి మాత్రమే తన ఆహరం
50 ఏళ్లుగా అన్నమే తినని వ్యక్తి.. కేవలం అవి మాత్రమే తన ఆహరం