- Telugu News Photo Gallery Technology photos Paytm ex employee made digital wallet for kids junio app
Junio App: చిన్నారుల కోసం ప్రత్యేకంగా డిజిటల్ పేమెంట్ యాప్.. పేటీఎం మాజీ ఉద్యోగుల వినూత్న ఆలోచన..
Junio App: ప్రస్తుతం అన్ని లావాదేవీలు డిజిటలైజేషన్ అవుతున్నాయి. మరి చిన్నారులకు ఇచ్చే పాకెట్ మనీకూడా డిజిటలైజేషన్‌గా మారితే ఎలా ఉంటుంది.? ఇలాంటి ఆలోచన నుంచే జూనియో యాప్ పుట్టుకొచ్చింది. ఈ యాప్ ద్వారా చిన్నారులు..
Updated on: Feb 19, 2022 | 6:32 PM

ప్రస్తుతం డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగాయి. అయితే ఇది కేవలం పెద్దలకు మాత్రమే పరిమితం. మరి చిన్నపిల్లలకు డిజిటల్ యాప్స్ అందుబాటులో ఉంటే ఎలా ఉంటుంది. ఇలాంటి ఆలోచనతోనే పేటీఎం కంపెనీ మాజీ ఉద్యోగులుసరికొత్త యాప్‌ను తీసుకొచ్చారు.

'జూనియో' పేరుతో రూపొందించిన ఈ యాప్ సహాయంతో పిల్లలు రోబోలాక్స్, అమేజాన్ నుంచి వారికి నచ్చిన వస్తువులు కొనుగోలు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ యాప్ ఐఓస్, ఆండ్రాయిడ్‌లో అందుబాటులో ఉంది.

చిన్నారులు ఆన్‌లైన్ లావాదేవీలు చేసిన వెంటనే పేరెంట్స్‌కు మెసేజ్ వచ్చే వెసులుబాటును కల్పించారు. దీంతో పాటు ఒక వర్చువల్ కార్డును కూడా అందిస్తారు. అయితే దీనిని బ్యాంక్ అకౌంట్‌కు లింక్ చేయాల్సిన అవసరం ఉండదు.

చిన్నారులు కేవలం రూ. 10 వేల మాత్రమే ఉపయోగించుకునే వీలు ఉంటుంది. ఈ యాప్ రూపే అనుబంధంగా పని చేస్తుంది. తల్లిదండ్రులు తమ చిన్నారుల ఖాతాలో డబ్బులు జమ చేయొచ్చు.

ఇక ఇటీవల అందుబాటులోకి వచ్చిన ఈ యాప్‌ను ఇప్పటికే 10 లక్షలు మంది చిన్నారులు డౌన్‌లోడ్ చేసుకున్నారు. ప్రతిరోజూ నిత్యం 10 వేల ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. దీనిబట్టి చూస్తుంటే ఇక భవిష్యత్తులో చిన్నారుల పాకెట్ మనీ కూడా డిజిటలైజేషన్ అవుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు కదూ!





























