AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Too Much Sleep: ఎక్కువసేపు నిద్ర పోతున్నారా.. అయితే మీ గుండె జాగ్రత్త.. ఎందుకంటే..

నిద్ర అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది. కానీ అధికంగా నిద్రపోయినా.. తక్కువ నిద్రపోయినా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి...

Too Much Sleep: ఎక్కువసేపు నిద్ర పోతున్నారా.. అయితే మీ గుండె జాగ్రత్త.. ఎందుకంటే..
Sweating Deep Sleep
Srinivas Chekkilla
|

Updated on: Feb 20, 2022 | 7:45 AM

Share

నిద్ర అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది. కానీ అధికంగా నిద్రపోయినా.. తక్కువ నిద్రపోయినా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా ఎక్కువగా నిద్రపోతే  గుండె పోటు వచ్చే ప్రమాదం ఉందని మెడికల్ జర్నల్ న్యూరాలజీలో ఈ మేరకు అధ్యయనం వెలువడింది. రోజూ మధ్యాహ్నం పూట 30 నిమిషాల పాటు కునుకుపాటు పడేవారితో పోల్చి చూస్తే 90 నిమిషాలు మించి ఎక్కువగా నిద్రపోయే వారిలో 25 శాతం గుండెపోటుకు గురయ్యే అవకాశం ఉంటుందని అధ్యయనం వెల్లడించింది. అలాగే రోజూ 30 నిమిషాల వరకు కునుకుపాటు పడే వారిలో ఒకసారైనా గుండెపోటు రావచ్చు కానీ అసలు నిద్రపోని వారిలో గుండెపోటు రానేరాదని అధ్యయనం పేర్కొంది.

ఎక్కువ సమయం నిద్ర పోవడం లేదా గాఢనిద్ర పోవడం అలవాటున్న వారిలో కొలొస్టరల్ స్థాయిలు ఎక్కువ కావడం. ఛాతీ సైజు పెరగడం వంటి అనారోగ్య లక్షణాలు వస్తాయని అధ్యయనాలు నిరూపిస్తున్నాయని అధ్యయన పరిశోధకుడు జ్‌క్సియీవోమినంగ్ తెలిపారు. సరాసరి 62 ఏళ్ల వయస్సు ఉన్న చైనాకు చెందిన 31,750 మందిని ఈ అధ్యయనంలో తీసుకున్నారు.

వీరందరినీ ఆరేళ్ల పాటు అధ్యయనం చేయగా 1557 గుండె పోటు కేసులు నమోదయ్యాయి. రాత్రుళ్లు ఏడు గంటలు లేదా అంతకన్నా తక్కువ సమయం నిద్ర పోయే వారి కన్నా తొమ్మిది గంటలు అంతకన్నా ఎక్కువ సేపు నిద్ర పోయేవారికి 25 శాతం వరకు గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుందని పరిశోధకులు గుర్తించారు.

Read Also.. ఈ ఒక్క ఆకు మధుమేహం, క్యాన్సర్లకి దివ్య ఔషధం.. వీటితో పడుకునే ముందు ఇలా చేస్తే చాలు..?