Nara Lokesh: వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టిన టీడీపీ నేత లోకేష్.. నూతన వధూవరులకు గిఫ్ట్స్..
TDP leader Nara Lokesh wedding gifts: మాఘ మాసంలో వివాహ వేడుకలు, శుభకార్యాలు పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. హిందువుల సాంప్రదాయంలో మాఘ మాసం (magha masam 2022) లో వివాహాలు
TDP leader Nara Lokesh wedding gifts: మాఘ మాసంలో వివాహ వేడుకలు, శుభకార్యాలు పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. హిందువుల సాంప్రదాయంలో మాఘ మాసం (magha masam 2022) లో వివాహాలు చేయడం ఆనవాయితీ. ఈ వివాహాలకు రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు హాజరవుతుంటారు. ఎమ్మెల్యే, ఎంపీలు, మంత్రులు కూడా వారి వారి నియోజకవర్గాల్లో జరిగే శుభకార్యాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. అయితే రాష్ట్రస్థాయి నాయకులకు తమ పార్టీ కార్యకర్తలందరీ పెళ్లిళ్లకు వెళ్ళడం సాధ్యపడదు. కానీ కార్యకర్తలు మాత్రం.. తమ నేతలు రావాలని తెగ ఆశపడుతుంటారు. ఈ క్రమంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. లోకేష్ మంగళగిరి (mangalagiri) నుంచి పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే.. అప్పటి నుండి కార్యకర్తలకు అందుబాటులో ఉండేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ క్రమంలో చాలామంది కార్యకర్తలు ఈ సీజన్లో జరిగే శుభకార్యాలకు హాజరు కావాలని తమ నాయకుడు లోకేష్‌ను ఆహ్వానిస్తున్నారు. అందరి పెళ్లిళ్లకు వెళ్లడం సాధ్యపడకపోవటంతో లోకేష్ వారికి ప్రత్యేకంగా ఒక పెళ్లి కానుకను (wedding gifts).. ఆ పార్టీ స్థానిక నేతల ద్వారా పంపిస్తున్నారు.
ఈ పెండ్లి కానుకలో వధూవరులకు నూతన వస్త్రాలను అందిస్తున్నారు. వరుడికి తెల్ల ప్యాంట్ షర్ట్, వధువుకు తలంబ్రాల చీరను బహూకరిస్తున్నారు. నియోజకవర్గంలో వివాహాలు చేసుకుంటున్న కార్యకర్తలందిరికీ ఈ కానుకను స్థానిక నేతలు వెళ్లి పెళ్లి మండపంలోనే అందిస్తున్నారు.
తమకిష్టమైన నేత తమ ఇంట జరిగే శుభకార్యానికి రాలేకపోయిన తమను గుర్తుపెట్టుకొని కానుక పంపించడంపై కార్యకర్తలు వారి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
టి నాగరాజు, టీవీ9 తెలుగు రిపోర్టర్, గుంటూరు
Also Read: