AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Babu Gogineni: ఏ పార్టీకి మద్దతు లేదు.. సోషల్ మీడియాలో ప్రచారంపై బాబు గోగినేని క్లారిటీ..

Babu Gogineni on AP Politics: సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై బాబు గోగినేని క్లారిటీ ఇచ్చారు. తాను ఏ పార్టీకి మద్దతు తెలపడం లేదంటూ స్పష్టంచేశారు. ఇటీవల సోషల్ మీడియాలో

Babu Gogineni: ఏ పార్టీకి మద్దతు లేదు.. సోషల్ మీడియాలో ప్రచారంపై బాబు గోగినేని క్లారిటీ..
Babu Gogineni
Shaik Madar Saheb
|

Updated on: Feb 20, 2022 | 10:00 AM

Share

Babu Gogineni on AP Politics: సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై బాబు గోగినేని క్లారిటీ ఇచ్చారు. తాను ఏ పార్టీకి మద్దతు తెలపడం లేదంటూ స్పష్టంచేశారు. ఇటీవల సోషల్ మీడియాలో బాబు గోగినేని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) కు మద్దతు తెలుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై ఫేస్‌బుక్, వాట్సప్ లాంటి ప్రసార మాధ్యమాల్లో బాబు గోగినేని (Babu Gogineni) పవన్ కల్యాణ్‌కు సపోర్ట్ ఇచ్చినట్లు మీమ్స్, పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో బాబు గోగినేని ఆదివారం సోషల్ మీడియా (Social Media) వేదికగా స్పందించారు. తాను ఏ పార్టీకు మద్దతు తెలపడం లేదంటూ స్పష్టంచేశారు. పవన్ కళ్యాణ్‌ను కీర్తిస్తూ ఎఫ్‌బీ, వాట్సాప్‌లో చాలా కాపీలు సర్క్యులేట్ అవుతున్నాయని.. ఇది సరికాదన్నారు. ఓటర్లు తమ నిర్ణయానికి రావాలి.. కానీ.. పవన్ కళ్యాణ్‌ను.. ఆయన రాజకీయాలను ప్రచారం చేయడానికి తన పేరు వాడుకోవడం మంచిది కాదంటూ గోగినేని పేర్కొన్నారు.

తనకు రాజకీయాలు గురించి తెలిసినా.. తన అభిరుచులు వేరన్నారు. హేతువాదంపై, వ్యవస్థీకృత రాజకీయాల కోసం నిలబడతాననని తెలిపారు. మానవ హక్కులు, లౌకికవాదం, సామాజిక సంస్కరణ, శాస్త్రీయ దృక్పథాన్ని ప్రోత్సహించడం తన నినాదమంటూ పేర్కొన్నారు. ఉద్యోగాల కల్పనకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. వివక్ష, లింగ అసమానతలకు మూలమైన కుల వ్యవస్థ, రాజకీయాలను ఓడించాలన్నారు. కేవలం బహిరంగ ప్రసంగాలు కాదు వాస్తవ విధానాలు కావాలన్నారు. ఉద్యోగాలు, ఆధునిక శాస్త్రీయ విద్య, ఆరోగ్యం అత్యధిక బడ్జెట్ కేటాయింపులు, అవినీతి నిర్మూలన లాంటి వాటికి తాను కట్టుబడి ఉంటానన్నారు. తాను పవన్ కళ్యాణ్‌కు మద్దతు ఇవ్వను.. కానీ, రాజకీయాలు సామాజిక జీవితంలో ఈ ముఖ్యమైన సూత్రాలను పవన్ కళ్యాణ్ సమర్థిస్తారా? అన్నది ప్రశ్నగా ఉందన్నారు. పవన్ కళ్యాణ్ మద్దతుదారులు, లేదా ఆయన రాజకీయ పార్టీ జనసేన ఫేస్‌బుక్‌లో చేసే ప్రచారాన్ని ఆపాలంటూ సూచించారు.

Also Read:

CM KCR: మోడీ సర్కార్‌పై సమరానికి సై.. మరికాసేపట్లో ముంబైకి సీఎం కేసీఆర్..

Hyderabad: కన్నేశాడు.. కాజేశాడు.. మాయమాటలతో ఏటీఎం వాహన డ్రైవర్ ఏం చేశాడంటే..