Cheating: కిలాడీ లేడీలు.. చిట్టీలు, పొదుపు పేరుతో రూ.4 కోట్లకు కుచ్చుటోపీ.. స్టేషన్‌కు వందలాది మంది క్యూ..

Vizianagaram Crime News: ఆమె ఒక వాలంటీర్.. చిట్టీలు, పొదుపు, వడ్డీల పేరుతో తల్లితో కలిసి చాలామంది దగ్గర డబ్బులు తీసుకుంది. ఆ తర్వాత అందరినీ నమ్మించి కోట్లాది రూపాయల వ్యాపారంగా మలుచుకుంది.

Cheating: కిలాడీ లేడీలు.. చిట్టీలు, పొదుపు పేరుతో రూ.4 కోట్లకు కుచ్చుటోపీ.. స్టేషన్‌కు వందలాది మంది క్యూ..
Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 20, 2022 | 8:26 AM

Vizianagaram Crime News: ఆమె ఒక వాలంటీర్.. చిట్టీలు, పొదుపు, వడ్డీల పేరుతో తల్లితో కలిసి చాలామంది దగ్గర డబ్బులు తీసుకుంది. ఆ తర్వాత అందరినీ నమ్మించి కోట్లాది రూపాయల వ్యాపారంగా మలుచుకుంది. అప్పుడే ఆమెకు డబ్బుపై కన్నుపడింది. మొత్తం రూ.4 కోట్ల మేర నగదుతో తల్లితో కలిసి రాత్రికి రాత్రే ఉడాయించింది. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. బాధితులంతా పోలీసుల దగ్గరకు పరుగుతు తీస్తున్నారు. ఈ ఘ‌రానా మోసం విజయనగరం జిల్లాలో వెలుగులోకి వ‌చ్చింది. సాలూరు (salur) లో వార్డు వాలంటీర్‌ (ward volunteer) గా పనిచేస్తున్న ర‌మ్య ఆమె త‌ల్లి అరుణతో క‌లిసి వందలాది మంది దగ్గర నుంచి చట్టీలు, పొదుపు పేరుతో న‌మ్మించి డ‌బ్బులు వసూలు చేసింది. బాధితుల నుంచి సుమారు రూ.4 కొట్లపైగా వ‌సూలు చేసి పరారవడంతో బాధితులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అయితే.. ప‌ది రోజుల‌కు పైగా ఆమె క‌నిపించ‌క‌పోవ‌డంతో బాధితులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేష‌న్‌కు క్యూ కడుతున్నారు.

అయితే.. రమ్య ఘరానా మోసంలో బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చిట్టీలు, పొదుపులు పేరుతో తల్లి అరుణతో కలిసి నిలువునా ముంచిన కిలాడి లేడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టణంతో పాటు చుట్టుపక్కల పలు గ్రామాల్లో సైతం రమ్య బాధితులు ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. ఫిర్యాదులు చేసేందుకు స్టేషన్‌కు క్యూ కడుతున్నారు. పెరుగుతున్న భాధితులను చూసి పోలీసులు సైతం కంగుతిన్నారు. వాలంటీర్ రమ్య నయా మోసాలను చూసి బాధితులు ఆవాక్కవుతున్నారు. అయితే.. పదికోట్లకు పైగా సొమ్ముతో ఉడాయించినట్లు పోలీసుల అనుమానం వ్యక్తంచేస్తున్నారు.

సాలూరులోని చిట్లు వీధికి చెందిన రమ్య, ఆమె త‌ల్లి అరుణతో క‌లిసి 15 ఏళ్లుగా పొదుపు వ్యాపారం చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. అయితే.. ప‌లు వీధుల్లో వ‌డ్డీ ఆశ చూపి దాదాపుగా ఐదు వందల మంది వ‌ద్ద నుంచి డ‌బ్బులు వ‌సూలు చేశారు. చిట్టీలు, వడ్డీ, పొదుపు రూపంలో వ‌సూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. కిలాడీ లేడీల కోసం వెతుకుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read:

Bank Fraud Case: ఆదిలాబాద్‌ బ్యాంకు మోసం కేసులో కొత్త ట్విస్ట్‌.. రైతు ఖాతాలో రూ.60 కోట్లు..!

Hyderabad: కన్నేశాడు.. కాజేశాడు.. మాయమాటలతో ఏటీఎం వాహన డ్రైవర్ ఏం చేశాడంటే..