Bank Fraud Case: ఆదిలాబాద్ బ్యాంకు మోసం కేసులో కొత్త ట్విస్ట్.. రైతు ఖాతాలో రూ.60 కోట్లు..!
Adilabad Bank fraud case: ఓ వైపు బ్యాంకులో కోట్ల రూపాయల నగదు మాయం.. మరో వైపు రైతుల ఖాతాల్లో కోట్లలో డబ్బు. ఇది బ్యాంకు లోపమా? లేక ఇంకేదైనా కారణముందా? ఇంతకీ ఏం జరిగింది?
Adilabad Bank fraud case: ఓ వైపు బ్యాంకులో కోట్ల రూపాయల నగదు మాయం.. మరో వైపు రైతుల ఖాతాల్లో కోట్లలో డబ్బు. ఇది బ్యాంకు లోపమా? లేక ఇంకేదైనా కారణముందా? ఇంతకీ ఏం జరిగింది? దేశంలో బ్యాంకు కుంభకోణాలకు అడ్డు అదుపులేకుండా పోయింది. నిత్యం ఎక్కడోచోట బ్యాంకు మోసాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఆదిలాబాద్ (Adilabad) తెలంగాణ గ్రామీణ బ్యాంకు (Telangana Grameena Bank) లో నగదు మాయం కలకలం రేపుతోంది. ఈ కేసులో కొత్త కొత్త ట్విస్టులు బయటపడుతున్నాయి. కోటి 28 లక్షల సొమ్ము మాయం కేసులో.. కొత్త ట్విస్టు వెలుగుచూసింది. రైతుల ఖాతాల్లో కోట్లలో డబ్బు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ఆ డబ్బంతా తమదే అంటున్నారు ఖాతాదారులు. తమ ఖాతాల్లో ఉన్నందునే డబ్బును ఖర్చు చేశామని చెబుతున్నారు. అధికారులు తిరిగి కట్టాలని ఒత్తిడి చేయడం కరెక్టు కాదంటూ ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. ఓ రైతు తనకున్న కిసాన్ కార్డును స్వైప్ చేయగా.. ఖాతాలో 60 కోట్ల రూపాయలను గుర్తించాడు. అందులో ఐదు లక్షల 20 వేల రూపాయలను ఇంటి నిర్మాణం కోసం డ్రా చేసుకుని వాడుకున్నాడు. ఆ డబ్బును తిరిగి కట్టాలని.. లేదంటే జైలుకు పంపిస్తామని బ్యాంకు అధికారులు బెదిరిస్తున్నట్టు రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇదిలాఉంటే.. గురువారం ఆదిలాబాద్ తెలంగాణ బ్యాంక్ ఖాతా నుంచి కోటి 28లక్షలు మాయమయ్యాయి. ముగ్గురు ఆదివాసీ రైతుల కిసాన్ కార్డుల ద్వారా..కస్టమర్ పాయింట్ నిర్వాహకుడు రమేశ్ ఈ డబ్బును డ్రా చేశాడు. ముగ్గురు రైతులకు 16 లక్షలు ముట్టచెప్పి.. మిగిలిన సొమ్మును కామ్‌గా కాజేశాడు రమేష్. నేరుగా బ్యాంక్ సర్వర్ నుంచే ఈ డబ్బు మాయం కావడం గమనార్హం. ఈ మోసంలో బ్యాంకు సిబ్బంది హస్తం ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: