AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏనుగు బీభత్సం.. పంటపొలాల్లో తిరుగుతూ.. పశువుల పాకపై దాడి

పట్టణీకరణ పెరుగుదలతో అడవుల విస్తీర్ణం తగ్గుతోంది. చెట్లను నరికేస్తుండటంతో అడవుల్లో ఉండే జీవరాశుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. తిండి, నీరు కోసం అవి తీవ్ర అవస్థ పడుతున్నాయి...

ఏనుగు బీభత్సం.. పంటపొలాల్లో తిరుగుతూ.. పశువుల పాకపై దాడి
Elephant 1
Ganesh Mudavath
|

Updated on: Feb 20, 2022 | 8:14 AM

Share

పట్టణీకరణ పెరుగుదలతో అడవుల విస్తీర్ణం తగ్గుతోంది. చెట్లను నరికేస్తుండటంతో అడవుల్లో ఉండే జీవరాశుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. తిండి, నీరు కోసం అవి తీవ్ర అవస్థ పడుతున్నాయి. అడవుల్లో ఉండే అవకాశం లేకపోవడంతో జనావాసాల్లోకి వస్తున్నాయి. గ్రామాల్లో తిరుగుతూ ప్రజలను భయ భ్రాంతులకు గురిచేస్తున్నాయి. పంట పొలాల్లోనూ సంచరిస్తూ.. రైతులు వేసుకున్న పంటలను నాశనం చేస్తున్నాయి. ఒక్కోసారి జనాలపై దాడి చేసి, గాయపరుస్తున్నాయి. తాజాగా విజయనగరం జిల్లాలోని కొమరాడ(Komarada) మండలంలో ఏనుగు(Elephant) సంచారం బీభత్సం కలిగించింది. పశువుల పాకపై దాడి చేసి, రెండు ఆవులను చంపేసింది.

ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా ఏజెన్సీలో ఏనుగు బీభత్సం సృష్టించింది. కొమరాడ మండలం లో ఓ ఏనుగు సంచారం కలకలం రేపింది. ఇటీవల ఏనుగుల గుంపులో నుంచి తప్పిపోయిన ఓ ఏనుగు.. పంటపొలాల్లో తిరుగుతున్నట్లు స్థానిక రైతులు గుర్తించారు. ఏనుగుల గుంపు కోసం వెదుకుతూ ఆ గజరాజు పంటపొలాలను నాశనం చేస్తోంది. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి గంగిరేగి వలసలో గట్టిగా ఘీంకారాలు చేస్తూ.. భయాందోళన కలిగించింది. పాకలో నిద్రిస్తున్న ఆవుల పై దాడి చేసింది. ఈ ఘటనలో రెండు ఆవులు మృతి చెందాయి. ఏనుగు సంచారంతో సమీప గ్రామాల ప్రజలు కంటి మీద కునుకు లేకుండా క్షణ క్షణం భయంతో బిక్కుబిక్కుమంటున్నారు.

ఇవీ చదవండి.

Gold Rate: బంగారంలో పెట్టుబడికి సరైన సమయం ఇదేనా.. వచ్చే 3 నెలల్లో ఎంత పెరగొచ్చంటే?

Weekly Horoscope: వారఫలాలు… వీరికి ఈ వారంలో అద్భుతమైన ఫలితాలు.. ఏ రాశి వారికి ఎలా ఉందంటే..

Skin Care: మీ చర్మం తరచూ పొడిబారుతుందా ? అయితే మీకు ఈ వ్యాధులు ఉన్నట్లే.. ఏంటంటే..