AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weekly Horoscope: వారఫలాలు… వీరికి ఈ వారంలో అద్భుతమైన ఫలితాలు.. ఏ రాశి వారికి ఎలా ఉందంటే..

Weekly Horoscope: చాలా మంది ఉదయం లేవగానే తమతమ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసుకుంటారు. రాశి ఫలాల (Rasi Phalalu)ను అనుసరించే చాలా మంది తమ రోజును..

Weekly Horoscope: వారఫలాలు... వీరికి ఈ వారంలో అద్భుతమైన ఫలితాలు.. ఏ రాశి వారికి ఎలా ఉందంటే..
Horoscope Today
Subhash Goud
|

Updated on: Feb 24, 2022 | 6:44 AM

Share

Weekly Horoscope: చాలా మంది ఉదయం లేవగానే తమతమ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసుకుంటారు. రాశి ఫలాల (Rasi Phalalu)ను అనుసరించే చాలా మంది తమ రోజును ప్రారంభిస్తారు. ఇక వారం మొత్తంలో తమతమ రాశి ఎలా ఉంటుందని తెలుసుకుంటారు. ప్రతి రోజు ఉదయం ఆ రోజు భవిష్యత్తు ఎలా ఉంటుందని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఏ పనులు చేపడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి.. ఎలా ముందుకు సాగాలి అనే విషయాలపై ప్రత్యేక దృష్టి సారించి ముందుకు సాగుతారు. ఫిబ్రవరి 20 నుంచి 26 వరకు ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉండనున్నాయో తెలుసుకుందాం.

మేష రాశి:

ఈ వారంలో ఈ రాశివారికి కాలం కలిసి వస్తోంది. ఉద్యోగంలో మంచి అవకాశాలు లభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. పెండింగ్‌లో ఉన్న పనులు పరిష్కారం అవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వృషభ రాశి:

ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక లావాదేవాలు జరుపుతారు. వృత్తి, వ్యాపారస్థులు పట్టుదలతో ముందుకెళితే మంచి ఫలితాలు ఉంటాయి. మీపై కొందరు లేనిపోని అపోహాలు సృష్టించే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండటం మంచిది.

మిథున రాశి:

వ్యాపారులు నష్టం వాటిల్లకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆర్థిక లావాదేవీలు జరుపుతారు. గిట్టని వారితో దూరంగా ఉండటం మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటక రాశి:

ధైర్యంతో ముందుకెళ్లడం మంచిది. సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారంలో సమస్యలు వచ్చే అవకాశాలు ఉండటంతో జాగ్రత్తగా ఉండటం మంచిది. పరిచయాలు పెంచుకుంటారు. ఆర్థిక లావాదేవీలు తొలగుతాయి.

సింహ రాశి:

ఈ వారంలో ఈ రాశివారికి అన్ని విధాలుగా మేలు జరుగుతుంది. బంధుమిత్రుల సలహాలు పాటించడం మంచిది. కొన్ని కొన్ని పనులలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. దూర ప్రయాణాలు చేస్తారు.

కన్య రాశి:

ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. తోటివారి నుంచి ప్రశంసలు పొందుతారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీరు పడ్డ శ్రమ ఫలిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది.

తుల రాశి:

ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. కొందరి వల్ల మీకు మంచి జరుగుతుంది. ఆర్థికంగా మెరుగుపడతారు. పెండింగ్‌లో ఉన్న బాకీలు వసూలు అవుతాయి. ధనలాభం పెరుగుతుంది. కొత్త ప్రయత్నాలు చేస్తారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

వృశ్చిక రాశి:

ఆత్మస్థైరంతో ముందుకు సాగితే అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులు పట్టుదలతో ముందుకెళితే మంచి అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది.

ధనుస్సు రాశి:

ఉద్యోగులకు స్థిరత్వం వస్తుంది. ఏ పనులు చేపట్టినా విజయం మీ సొంతం అవుతుంది. కుటుంబ సభ్యుల నుంచి సహకారం అందుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

మకర రాశి:

ముఖ్యమైన కార్యాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తెలియని వ్యక్తులతో ఎక్కువగా మాట్లాడకపోవడం మంచిది. లేకపోతే అపార్థాలు చేసుకుని ఇబ్బందులు పడే అవకాశం ఉంది.

కుంభ రాశి:

ఉద్యోగంలో మంచి అవకాశాలు లభిస్తాయి. కొన్ని విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులలో పురోగతి ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి ఉండటం మంచిది. ఆర్థిక లాభాలు ఉంటాయి.

మీన రాశి:

మంచి జీవితం ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాలు బాగుంటాయి. చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఓ పని మీకు అనుకూలంగా మారుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.

ఇవి కూడా చదవండి:

Horoscope Today: ఈరోజు ఈ వ్యక్తులకు అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.. రాశి ఫలాలు మీకోసం.

Muchintal: వైభవంగా 108 భగవాన్ మూర్తుల కల్యాణ వైభోత్సవం..శ్రీహరి నామ స్మరణతో పులకించిన ప్రాంగణం