Muchintal: ముచ్చింతల్ లోని సమతా మూర్తి(Samatha Murthy) ప్రాంగణం భక్తజనుల శ్రీహరి నామ స్మరణతో పులకించిపోయింది. చరిత్రలో నిలిచిపోయే విధంగా 108 దివ్య దివ్యదేశాల శాంతి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. నభూతో న భవిష్యత్ అన్నట్లుగా భక్త జన సమక్షంలో శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామిజీ ప్రత్యక్ష పర్యవేక్షణలో సమతా మూర్తి సాక్షిగా కళ్యాణ మహోత్సవం అత్యంత ఘనంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.