CM KCR: మోడీ సర్కార్‌పై సమరానికి సై.. ముంబైకి పయనమైన సీఎం కేసీఆర్..

CM KCR Maharashtra Tour: కేంద్రంలోని బీజేపీపై యుద్ధం (Anti-BJP front) లో సీఎం కేసీఆర్ ఇవాళ ఫస్ట్‌ స్టెప్ తీసుకోబోతున్నారు. కాసేపట్లో ఆయన మహారాష్ట్రకు టేకాఫ్ అవుతారు. బీజేపీయేతర పార్టీలను

CM KCR: మోడీ సర్కార్‌పై సమరానికి సై.. ముంబైకి పయనమైన సీఎం కేసీఆర్..
Cm Kcr
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 20, 2022 | 12:41 PM

CM KCR Maharashtra Tour: కేంద్రంలోని బీజేపీపై యుద్ధం (Anti-BJP front) లో సీఎం కేసీఆర్ ఇవాళ ఫస్ట్‌ స్టెప్ తీసుకోబోతున్నారు. కాసేపట్లో ఆయన మహారాష్ట్రకు టేకాఫ్ అవుతారు. బీజేపీయేతర పార్టీలను ఏకం చేసే క్రమంలో అనేక ప్రాంతీయపార్టీల సీఎంలతో కేసీఆర్ చర్చలు జరపబోతున్నారు. అందులో భాగంగానే.. ముంబైలో కీలక చర్చలు జరగబోతున్నాయి. శివసేన అధినేత, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో సీఎం కేసీఆర్ (CM KCR) భేటీ కానున్నారు. సీఎం కేసీఆర్ వెంట ఎమ్మెల్సీ కవిత కూడా వెళ్లనున్నారు. ఈ కీలక భేటీలో కేంద్రంలోని బీజేపీ (BJP) పై పోరాటం కొనసాగించేందుకు చర్చలు జరపనున్నారు. 11గంటలకు ప్రత్యేక విమానంలో ముంబైకు వెళ్తారు ముఖ్యమంత్రి కేసీఆర్. మధ్యాహ్నం ఒంటిగంటకు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాక్రే (Uddhav Thackeray) తో సమావేశమవుతారు. ఇక సాయంత్రం 4గంటలకు ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ (Sharad Pawar) తో భేటీ అవుతారు. ఈ భేటీలో జాతీయ రాజకీయాలపై చర్చిస్తారు. అంతేకాకుండా గవర్నర్ల దూకుడు వ్యవహారంపై కూడా భేటీలో చర్చించనున్నారు. అనంతరం తిరిగి సాయంత్రం హైదరాబాద్‌కు వస్తారు. సీఎం కేసీఆర్‌ పర్యటన సందర్భంగా ముంబైలో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దేశ్‌ కీ నేత అంటూ నినాదాలతో ..కేసీఆర్‌కు మద్దతిచ్చే ప్రాంతీయ పార్టీల అధినేతలు, సీఎంల ఫోటోలతో భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. ముంబైలో సీఎం కేసీఆర్ పర్యటన ఇంట్రస్టింటిగ్‌గా మారింది.

కాగా.. గత కొన్ని రోజుల నుంచి సీఎం కేసీఆర్ కేంద్రంలోని బీజేపీని లక్ష్యంగా చేసుకోని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు సీఎంలతో, మాజీ ప్రధానితో ప్రత్యేకంగా మాట్లాడారు. అయితే.. ముంబయి టూర్‌ ముగిసిన తర్వాత కేసీఆర్‌ కర్నాటక వెళ్లనున్నారని సమాచారం. అక్కడ మాజీ ప్రధాని దేవగౌడతో భేటీ కానున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా ఢిల్లీలో మమతా బెనర్జీ నిర్వహించనున్న సమావేశానికి కూడా కేసీఆర్‌ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Also Read: ఒకే వేదికపైకి చిరంజీవి, మోహన్ బాబు.. ఉత్కంఠ రేపుతున్న సమావేశం

UP-Punjab Election 2022 Voting Live: ఉత్తర ప్రదేశ్, పంజాబ్‌లో మొదలైన పోలింగ్.. కీలక నేతల మధ్య హోరాహరీ పోరు