AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP-Punjab Election 2022 Voting: ముగిసిన పోలింగ్.. సాయంత్రం 5గంటల వరకు పంజాబ్‌లో 63.44, యూపీలో 57.58% ఓటింగ్

Uttar Pradesh Phase 3, Punjab Assembly Polls 2022 Voting Live Updates: ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉత్తర​ప్రదేశ్‌లో మూడో దశ,​పంజాబ్​అసెంబ్లీకి ఒకే విడతలో ఎన్నికలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.

UP-Punjab Election 2022 Voting: ముగిసిన పోలింగ్.. సాయంత్రం 5గంటల వరకు పంజాబ్‌లో 63.44, యూపీలో 57.58% ఓటింగ్
Punjab Assembly Elections
Balaraju Goud
|

Updated on: Feb 20, 2022 | 8:59 PM

Share

Uttar Pradesh-Punjab Assembly Election 2022 Voting Live updates: ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉత్తర​ప్రదేశ్‌లో మూడో దశ,​పంజాబ్​అసెంబ్లీకి ఒకే విడతలో ఎన్నికలకు పోలింగ్ మొదలైంది. అయితే పంజాబ్‌లో ఓటింగ్ మందకోడిగా జరుగుతోంది. అదే ఉత్తర ప్రదేశ్‌లో మాత్రం పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఇక ఉత్తర ప్రదేశ్‌ జరుగుతున్న మూడో దశ పోలింగ్ పార్టీల భవితవ్యంను తేలనుంది. దీంతో బరిలో నిలిచిన రాజకీయ పార్టీలు తమ గెలుపుపై ధీమాగా ఉన్నాయి. వీటిలో ఉత్తరప్రదేశ్‌‌లో మూడవ దశలో 59 స్థానాలు పోలింగ్ జరుగుతోంది.

పంజాబ్‌లో 117 స్థానాలకు ఎన్నికలు ఒకే విడతలో జరుగుతున్నాయి. ఈసారి ఎన్నికల పోరులో మొత్తం 1304 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈసారి పంజాబ్‌లో నాలుగు పెద్ద రాజకీయ పార్టీలు లేదా కూటముల మధ్య పోరు జరుగుతుందని భావిస్తున్నారు. బుందేల్‌ఖండ్‌లో మూడో దశలో పోలింగ్‌ జరుగుతున్న 5 జిల్లాల్లోని 13 అసెంబ్లీ స్థానాలను 2017లో బీజేపీ క్లీన్‌స్వీప్‌ చేసింది.

ఈసారి ఆ ఫలితాన్ని పునరావృతం చేస్తామని ఆ పార్టీ ధీమాతో ఉంది. అందుకే ఈ ప్రాంతంలో బీజేపీ దూకుడుగా ప్రచారం చేసింది. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సహా ప్రముఖులు 31 బహిరంగ సభలు, రోడ్‌ షోలు నిర్వహించారు. పంజాబ్‌లో ఓటింగ్‌కు సంబంధించిన ప్రతి వార్తల కోసం, ఇక్కడ క్లిక్ చేస్తూ ఉండండి..

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 20 Feb 2022 07:51 PM (IST)

    ఓటింగ్‌లో బీజేపీ వైపు ఓటర్లుః యోగి

    లఖింపూర్ ఖేరీలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భద్రత, శ్రేయస్సు కోసం రాష్ట్ర ఓటర్లు ఎస్‌పి, బిఎస్‌పి, కాంగ్రెస్‌లను శాశ్వతంగా తుడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారని అన్నారు. ఇప్పటివరకు జరిగిన రెండు దశల ఎన్నికలు రుజువు చేశాయన్నారు. అదే సమయంలో ఈరోజు జరుగుతున్న మూడో దశ ఓటింగ్‌లో బీజేపీ వైపు ఓటర్లు భారీ ట్రెండ్‌ నెలకొందని యోగి స్పష్టం చేశారు.

  • 20 Feb 2022 06:16 PM (IST)

    యూపీలో సాయంత్రం 5 గంటల వరకు 57.58% పోలింగ్

    ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి మూడో దశ ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రంలోని 16 జిల్లాల్లోని 59 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ఉత్తరప్రదేశ్‌లో సాయంత్రం 5 గంటల వరకు 57.58% ఓటింగ్ నమోదైంది. ఇప్పటివరకు యూపీలోని లలిత్‌పూర్‌లో అత్యధికంగా 67.37 శాతం మంది ఓటు వేయగా, కాన్పూర్ నగర్‌లో అత్యల్పంగా 50.88 శాతం ఓటింగ్ నమోదైంది. చాలా చోట్ల ఉదయం ఓటింగ్ వేగం మందగించగా, మధ్యాహ్నం తర్వాత మరింతగా పెరిగి ఓట్లు వేసేందుకు తరలివచ్చారు. మరో గంటలో ఈ సంఖ్య చాలా చేరుకుంది. అన్ని చోట్ల సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది.

  • 20 Feb 2022 06:10 PM (IST)

    పంజాబ్‌లో సాయంత్రం 5 గంటల వరకు 63.44 శాతం ఓటింగ్

    పంజాబ్ శాసనసభలోని 117 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు 63.44 శాతం పోలింగ్‌ నమోదైంది. ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చి ప్రజాస్వామ్యానికి ఓట్లు వేశారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూలైన్లు దర్శనమివ్వడంతో ఓటర్లు తమ వంతు వచ్చే వరకు వేచి ఉన్నారు.

  • 20 Feb 2022 05:32 PM (IST)

    దేరాబస్సిలో మొరాయించిన ఈవీఎంలు

    పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా దేరాబస్సీలోని బూత్ నంబర్ 292లో ఈవీఎంలు పనిచేయడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ్ చద్దా ఆరోపించారు. ఇప్పటికే అధికారులకు సమాచారం అందించినా సమస్య పరిష్కారం దొరకలేదన్నారు.

  • 20 Feb 2022 05:26 PM (IST)

    కేంద్ర మంత్రి మీనాశ్రీ లేఖి ఆమ్ ఆద్మీ పార్టీపై దాడి

    భగవంత్ మాన్ అతిపెద్ద అబద్ధాలకోరని మండిపడ్డారు కేంద్ర మంత్రి మీనాశ్రీ లేఖి. ఆప్‌ని తయారు చేయడానికి కాంగ్రెస్ ఎంత డబ్బు ఖర్చు చేసిందో ఆయనకు తెలుసా? అని ప్రశ్నించారు. సోనియా గాంధీ బి టీమ్ ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తోందన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీని మోసం చేస్తోంది.ఇప్పుడు పంజాబ్‌ను మోసం చేయడానికి ప్రయత్నిస్తోంది. ఢిల్లీలో రూ.524 కోట్ల ప్రకటనలు ఇవ్వడంతో పాటు ప్రజలను ఆప్ చేయడం తప్ప ఏం చేయలేదన్నారు మీనాక్షి లేఖి..

  • 20 Feb 2022 04:08 PM (IST)

    యూపీలో మధ్యాహ్నం 3 గంటల వరకు 48.81 శాతం ఓటింగ్

    ఉత్తరప్రదేశ్ మూడో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 59 స్థానాల్లో మధ్యాహ్నం 3 గంటల వరకు 48.81 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది.

  • 20 Feb 2022 04:05 PM (IST)

    బీజేపీ, ఆప్ కార్యకర్తల మధ్య ఘర్షణ

    పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఫిరోజ్‌పూర్ (అర్బన్) అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఓ గ్రామంలో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్త సూర్జిత్ సింగ్ గాయపడ్డారు. దీంతో పెద్ద సంఖ్యలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.

  • 20 Feb 2022 04:00 PM (IST)

    మధ్యాహ్నాం మూడు గంటల వరకు 49.81 శాతం

    పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 117 స్థానాల్లో ఓటింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికల ఫలితాలు మార్చి 10న ప్రకటించనున్నారు. మధ్యాహ్నాం మూడు గంటల వరకు 49.81 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. సాయంత్రానికి పోలింగ్ మరింత పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

  • 20 Feb 2022 03:56 PM (IST)

    ఫరూఖాబాద్‌లో మొరాయించిన ఈవీఎం

    ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌లోని పరమాపూర్ పోలింగ్ బూత్‌లో ఈవీఎం మొరాయించడంతో ఓటర్లు బారులు తీరి ఎదురుచూస్తున్నారు. దీంతో ఎన్నికల అధికారులు యంత్రాన్ని సరిచేసే పనిలో ఉన్నారు.

  • 20 Feb 2022 03:52 PM (IST)

    3 గంటల వరకు పంజాబ్‌లో 49.81, యూపీలో 48.81శాతం పోలింగ్

    ఉత్తరప్రదేశ్, పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నిలకు పోలింగ్‌ కాస్త పుంజుకుంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు పంజాబ్‌లో 49.81 శాతం , ఉత్తరప్రదేశ్‌లో 48.81శాతం పోలింగ్‌ నమోదు అయ్యింది. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓట్లరు బారులు తీరడంతో పోలింగ్‌ జోరందుకుంటుందని ఈసీ అధికారులు అనుకుంటున్నారు.

  • 20 Feb 2022 03:40 PM (IST)

    రైతులు, యువత, విద్యార్థులు మార్పు కోరుకుంటున్నారుః భగవంత్ మాన్

    భగవంతుని దయ వల్ల అందరూ భగవంత్ మాన్‌ను కోరుకుంటున్నారని ఆయన తల్లి హర్పాల్ కౌర్ అన్నారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసిన ఆమె.. మనకు ఆయన ఇప్పటికే సీఎం అయ్యారన్నారు. ప్రజలు అతన్ని ప్రేమిస్తారు ఇంతకంటే ఏంకావాలన్నారు భగవంత్ మాన్ తల్లి హర్పాల్ కౌర్. పంజాబ్ ఎన్నికలలో AAP CM అభ్యర్థిగా భగవంత్ మాన్ బరిలో నిలిచారు. కాగా, అమ్మ ఇలా చెబితే ఇంకేం కావాలి.. యువత, విద్యార్థులు అందరూ మార్పు కోరుకుంటున్నారని భగవంత్ మాన్ తెలిపారు.

  • 20 Feb 2022 03:35 PM (IST)

    పేదలు, రైతులు, యువత కోసమే బీజేపీ సర్కార్ః మోడీ

    ఉత్తరప్రదేశ్‌లో కొత్త కూటమి కులం పేరుతో విషం చిమ్ముతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని ఎస్పీ, బీఎస్పీలపై విరుచుకుపడ్డారు. అలాంటి వారు కుర్చీ కోసం సొంత కుటుంబంతో గొడవ పడతారు. మీరు ఓటు వేసిన డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏ కుటుంబానికి చెందినది కాదు. కేంద్రంలోని ప్రభుత్వం ఏ కుటుంబానికి చెందినది కాదు. మా ప్రభుత్వం పేదలు, రైతులు, యువత కోసమని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.

  • 20 Feb 2022 03:20 PM (IST)

    పంజాబ్‌లో ఓటేసిన నవ వధువు

    పంజాబ్‌లోని పాటియాలాలోని నాభా గ్రామంలో నవ వధువు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అర్ష్‌ప్రీత్ కౌర్ అనే యువతి పెళ్లికి ముందు పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.

    Bride

    Bride

  • 20 Feb 2022 02:54 PM (IST)

    మళ్లీ కాంగ్రెస్‌దే హవాః చరణ్‌జిత్ సింగ్ చన్నీ

    పంజాబ్‌లో 2/3వ వంతు మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ తెలిపారు.

  • 20 Feb 2022 02:53 PM (IST)

    అకాలీదళ్-బీఎస్పీ 80కి పైగా సీట్లుః సుఖ్‌బీర్ సింగ్ బాదల్

    పంజాబ్‌లో అకాలీదళ్-బీఎస్పీ 80కి పైగా సీట్లు గెలుచుకుంటాయని సుఖ్‌బీర్ సింగ్ బాదల్ చెప్పారు. ముక్త్‌సర్‌లో ఓటు వేసిన అనంతరం మాట్లాడుతూ.. పంజాబ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయబోయేది అకాలీదళ్-బీఎస్పీ కూటమియే అన్నారు.

  • 20 Feb 2022 02:48 PM (IST)

    ముక్త్‌సర్ ఓటు వేసిన బాదల్ కుటుంబం

    శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్, ప్రకాష్ సింగ్ బాదల్, హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ ముక్త్‌సర్‌లో ఓటు వేశారు. కుటుంబసమేతంగా తరలివచ్చిన ముక్త్‌సర్‌లోని పోలింగ్ స్టేషన్‌లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

  • 20 Feb 2022 02:38 PM (IST)

    మూడో విడతలో మధ్యాహ్నం 1 గంట వరకు 16 జిల్లాల్లో 35.88 శాతం పోలింగ్

    ఉత్తరప్రదేశ్‌లో మూడో విడతలో మధ్యాహ్నం 1 గంట వరకు 16 జిల్లాల్లో 35.88 శాతం పోలింగ్ జరిగింది. అత్యధికంగా ఏటాలో 42.31 శాతం, లలిత్‌పూర్‌లో 42.10 శాతం పోలింగ్‌ నమోదైంది. అత్యల్పంగా కాన్పూర్ పట్టణంలో 28.56 శాతం పోలింగ్ నమోదైంది.

  • 20 Feb 2022 02:27 PM (IST)

    మధ్యాహ్నం ఒంటి గంట వరకు పంజాబ్‌లో 35.8 శాతం పోలింగ్‌..

    పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నిలకు పోలింగ్‌ నెమ్మదిగా జరుగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పంజాబ్‌లో 34.1 శాతం పోలింగ్‌ నమోదు జరిగింది. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓట్లరు బారులు తీరడంతో పోలింగ్‌ జోరందుకుంటుందని ఈసీ అధికారులు అనుకుంటున్నారు.

  • 20 Feb 2022 01:58 PM (IST)

    మూలయం సింగ్‌ యాదవ్‌ ఓటు హక్కు..

    ఉత్తర ప్రదేశ్‌లో మూడో దశ ఎన్నికల్లో భాగంగా సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు మూలయం సింగ్‌ యాదవ్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జస్వంత్‌పూర్‌ పోలింగ్‌ బూత్‌లో ఆయన ఓటు వేశారు. అదే పోలింగ్‌ బూత్‌లో అఖిలేష్‌ యాదవ్‌ భార్య డింపుల్‌ యాదవ్ కూడా ఓటు వేశారు.

  • 20 Feb 2022 01:56 PM (IST)

    ఒంటి గంట వరకు రాష్ట్రంలో 35.8 శాతం పోలింగ్‌..

    ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నిలకు మూడో దశలో పోలింగ్‌ కొనసాగుతోంది. కాగా, మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాష్ట్రంలో 35.8 శాతం పోలింగ్‌ నమోదు అయింది.

  • 20 Feb 2022 01:54 PM (IST)

    సోనూ సూద్‌ను పోలింగ్ బూత్‌కు వెళ్లకుండా ఈసీ బ్రేక్..

    మొగా జిల్లాలో నటుడు సోనూ సూద్‌ పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లకుండా ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఆయన సోదరి మాళవికా సూద్ కాంగ్రెస్ టికెట్‌పై మోగా నుంచి పోటీ చేస్తున్నారు. సోనూసూద్ ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దీనిపై శిరోమణి అకాలీదళ్‌ ఫిర్యాదు చేసింది.

  • 20 Feb 2022 01:52 PM (IST)

    సోనూసూద్ కారును సీజ్.. చర్యలు తీసుకున్న ఈసీ అధికారులు

    పంజాబ్‌లోని మోగాలో నటుడు సోనూ సూద్ కారును సీజ్ చేశారు. జిల్లా PRO ప్రభదీప్ సింగ్ మాట్లాడుతూ.. “సోనూ సూద్ పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈలోగా అతడి కారును సీజ్ చేసి.. సోనూ సూద్‌ను ఇంటికి పంపించారు. ఇంటి నుంచి బయటకు వస్తే కేసులు పెడతామన్నారు అధికారులు.

  • 20 Feb 2022 01:06 PM (IST)

    పంజాబ్ నుంచి కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుంది -కెప్టెన్ అమరీందర్ సింగ్

    పంజాబ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్ లోక్ కాంగ్రెస్ వ్యవస్థాపకుడు, కెప్టెన్ అమరీందర్ సింగ్ 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేశారు. పంజాబ్ నుంచి కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుంది.

  • 20 Feb 2022 12:28 PM (IST)

    పంజాబ్‌లో ఉదయం 11 గంటల వరకు 18% ఓటింగ్ శాతం

    పంజాబ్‌లో ఉదయం 11 గంటల వరకు 17.77 శాతం ఓటింగ్ నమోదు.

  • 20 Feb 2022 12:11 PM (IST)

    యూపీలో ఉదయం 11 గంటల వరకు సగటున 21.18 శాతం పోలింగ్‌

    ఉత్తరప్రదేశ్‌లో మూడో విడతలో 16 జిల్లాల్లో ఉదయం 11 గంటల వరకు సగటున 21.18 శాతం పోలింగ్‌ జరిగింది. అంతకుముందు రాత్రి 9 గంటల వరకు సగటున 8.15% ఓటింగ్ జరిగింది. అత్యధికంగా లలిత్‌పూర్‌లో 26 శాతం, అత్యల్పంగా కాన్పూర్ పట్టణంలో 16.79 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాల వారీగా జరిగిన ఎన్నికలను ఒకసారి పరిశీలించండి.

  • 20 Feb 2022 12:04 PM (IST)

    యూపీ రైతులు బీజేపీని క్షమించరు.. – అఖిలేష్ యాదవ్

    జస్వంత్‌నగర్‌లో ఓటు వేసిన అనంతరం ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని అన్నారు. యూపీ రైతులు వారిని క్షమించరని.. తొలి రెండు దశల్లో సెంచరీలు బాదిన మేం.. ఈ దశలో కూడా ఎస్పీ, కూటమి అందరికంటే ముందుంటుంది.  

  • 20 Feb 2022 11:45 AM (IST)

    ముందుగా ఓటు వేయండి..- సీఎం అరవింద్ కేజ్రీవాల్

    ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. పంజాబ్ భవిష్యత్తుకు ఈరోజు చాలా ముఖ్యమని వీడియో మెసెజ్ ద్వారా తెలిపారు. పంజాబ్‌లోని మూడు కోట్ల మంది ప్రజలు సురక్షితంగా భావించే భవిష్యత్తుకు ఇది సరైన సమయం అని అన్నారు. ఓటు వేయడానికి వెళ్లినప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. మిగిలినవి తర్వాత చేయండి.. ముందుగా ఓటు వేయండి. యువత తమ వెంట తమ ఇంటి పెద్దలను కూడా తీసుకెళ్లాలి.

  • 20 Feb 2022 11:37 AM (IST)

    కాన్పూర్ మేయర్‌పై కేసు నమోదు..

    కాన్పూర్ మేయర్ ప్రమీలా పాండే ఈరోజు పోలింగ్ బూత్ లోపల ఫోటోలు, వీడియోలు క్లిక్ చేయడం వివాదంగా మారింది. యుపి అసెంబ్లీ ఎన్నికల మూడో విడత పోలింగ్ సందర్భంగా పాండే ఓటు వేసేటప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఈవీఎం) ఫోటోను షేర్ చేశారు. పాండే కాన్పూర్‌లోని హడ్సన్ స్కూల్ పోలింగ్ బూత్‌లో తన ఓటు వేశారు. ఆమె ఓటు వేస్తున్నప్పుడు వీడియోను చిత్రీకరించుకున్నారు.. ఆ తర్వాత ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్తా ఇప్పుడు అన్ని వాట్సాప్ గ్రూపులలో షేర్ అవుతోంది. దీంతో అధికారులు చర్యలు తీసుకునేందుక ఉపక్రమించారు.

  • 20 Feb 2022 11:15 AM (IST)

    వృద్ధులు, వికలాంగ ఓటర్లకు సహాయం..

    ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ సిబ్బంది పోలింగ్ సమయలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఫతేఘర్, హత్రాస్, హమీర్‌పూర్‌లోని పోలింగ్ స్టేషన్‌లలో వృద్ధులు, వికలాంగ ఓటర్లకు సహాయం చేస్తున్నారు.

  • 20 Feb 2022 11:12 AM (IST)

    ఓటు వేసిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ, అతని భార్య నవజోత్ కౌర్ సిద్ధూ

    పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆయన సతీమణి నవజ్యోత్ కౌర్ సిద్ధూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

  • 20 Feb 2022 11:02 AM (IST)

    ఆకాలీదళ్‌ను టార్గెట్ చేసిన ఆప్..

    ఆకాలీదళ్ కార్యకర్తలను టార్గెట్ చేస్తూ ఆప్ ట్వీట్ చేసింది. గురు హర్ సహాయ్ అసెంబ్లీ స్థానంలోని బూత్ నంబర్ 23 బూత్‌ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారని ఆప్ నాయకుడు రాఘవ్ చద్దా ఆరోపించారు. వారు పోలింగ్ బూత్‌లోకి ప్రవేశించి తమ ఎన్నారై కుటుంబ సభ్యులను (తమ తరపున ఎవరైనా) ఓటు వేసేందుకు అనుమతించాలని, లేకుంటే ఎవరినీ ఓటు వేయనివ్వబోమని పోలింగ్ అధికారులను బెదిరిస్తున్నరని పేర్కొంది.

  • 20 Feb 2022 10:58 AM (IST)

    మాజీ ముఖ్యమంత్రులపై సిద్దూ విమర్శలు..

    మాజీ ముఖ్యమంత్రులపై విమర్శిలు గుప్పించాడు పంజాబ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నవజ్యోత్‌ సిద్ధూ. పంజాబ్‌‌ను తమ వ్యక్తిగత వ్యాపారా ప్రయోజనాలతో వాడుకున్నారని మండిపడ్డారు. చెదపురుగులను కెప్టెన్‌ అమరీందర్‌, ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ కుటుంబాలు పెంచి పోషించారని మండిపడ్డారు. ఆ వ్యవస్థను మార్చాలనుకునే తమ పార్టీకి ఓటు వేయాలని కోరారు.

  • 20 Feb 2022 10:12 AM (IST)

    పంజాబ్‌లో మందకోడిగా పోలింగ్..

    పంజాబ్‌లో మందకోడిగా పోలింగ్ సాగుతోంది.  ఉదయం 9 గంటల వరకు 4.80% పోలింగ్ నమోదైంది. ఎందుకు ఇంత నెమ్మదిగా ఓటింగ్ జరుగుతోందని అధికార, ప్రతిపక్ష పార్టీ చర్చించుకుంటున్నాయి.

  • 20 Feb 2022 10:09 AM (IST)

    ఓటు వేసిన భగవంత్ మాన్..

    ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

  • 20 Feb 2022 09:42 AM (IST)

    తొలిసారి తమ ఓటు వేసిన కంజాయిన్డ్ ట్విన్స్

    పంజాబ్‌ అమృత్‌సర్‌ ఓటింగ్‌లో అవిభక్త కవలలు స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. సోహ్నాసింగ్‌, మోహ్నాసింగ్‌..తొలిసారిగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒకే శరీరాన్ని పంచుకున్న ఈ ఇద్దరు సోదరులు మనావాలాలో ఓటు వేశారు. వీరు ఓటు వేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ఈసీ. ఒకరు వేసిన ఓటు మరొకరు చూడకుండా ఉండేందుకు వారికి గాగుల్స్‌ కూడా ఇచ్చారు ఎన్నికల అధికారులు. పంజాబ్ అమృత్‌సర్‌లో ఓటు వేసిన ట్విన్స్ సోధరులు తమ ఓటు వేశారు. వీరి కోసం ఎన్నికల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

    Poll

    Poll

  • 20 Feb 2022 09:27 AM (IST)

    గురుద్వారాలో చన్నీ ప్రార్థనలు

    పంజాబ్ లో పోలింగ్‌కు ముందు సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ తన అనుచరులతో కలిసి ఖరార్‌లోని గురుద్వారా శ్రీ కటల్‌గర్ సాహిబ్‌లో ప్రార్థనలు నిర్వహించారు. సీఎం చన్నీ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో చమ్‌కౌర్ సాహిబ్, బదౌర్ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు.

  • 20 Feb 2022 09:22 AM (IST)

    300కు పైగా సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం..

    యూపీలో అఖిలేశ్ యాదవ్ గెలుపు తథ్యమని ములాయం సోదరుడు శివపాల్ యాదవ్ జోస్యం చెప్పారు. ఎన్నికల్లో ఓటేసిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. 300కు పైగా సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఓటేసే ముందు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ములాయం మరో సోదరుడు అభయ్ రామ్ యాదవ్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సైఫాయ్ నియోజకవర్గంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఎస్పీ భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.

  • 20 Feb 2022 09:17 AM (IST)

    సోనూసూద్‌ సోదరికి మద్దతుగా హర్భజన్‌ సింగ్‌ వీడియో పోస్ట్‌

    పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ సోనూసూద్‌ సోదరికి మద్దతుగా వీడియో పోస్ట్‌ చేశారు. ‘నా సోదరుడు సోనూ సూద్ సోదరి మాళవికకు శుభాకాంక్షలు. ఈ కుటుంబం నాకు చాలా సంవత్సరాలుగా తెలుసు. ప్రజలకు సహాయం చేయడానికి దేవుడు వీరికి అపారమైన శక్తిని ఇచ్చాడు. మీరు ప్రజలకు సహాయం చేస్తూనే ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ హర్భజన్ సింగ్ వీడియో పోస్ట్‌ లో పేర్కొన్నారు.

  • 20 Feb 2022 09:02 AM (IST)

    ఓటర్లకు ప్రధాని మోదీ విజ్ఞప్తి

    పంజాబ్, యూపీ ఓటర్లను ఉద్దేశించి ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంగా తొలిసారి ఓటు హక్కు వచ్చిన యువత తమ ఓటు సరైన పద్దతిలో వినియోగించుకోవాలని సూచించారు.

  • 20 Feb 2022 08:55 AM (IST)

    మీకు ఇష్టమైనవారికి ఓటు వేయండి..: భగవంత్ మాన్

    పంజాబ్‌కు ఇది గొప్ప రోజు ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్ అన్నారు. ఎలాంటి ఒత్తిళ్లకు, అత్యాశకు గురికాకుండా మీ స్వంత ఇష్టానుసారం ఓటు వేయండి. ఓటర్లందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను.

  • 20 Feb 2022 08:19 AM (IST)

    పంజాబ్‌లో బీజేపీ డేరా వ్యూహం..

    ఈ ఎన్నికల్లో హంగ్‌ అసెంబ్లీ కోణంలోనూ బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఒకవేళ ఆప్‌కు సీట్లు తగ్గి.. కాంగ్రెస్‌ సైతం మెజారిటీ స్థానాలను దక్కించుకోలేకపోతే ఆ తరవాత బీజేపీ పావులు కదపాలని వ్యూహరచన చేస్తోంది. పంజాబ్‌లో డేరాల(ఆశ్రమలు) ప్రభావం ఎక్కువ ఉంటుంది. అక్కడి ఆరు డేరాలు 68 అసెంబ్లీ స్థానాల్లో ప్రభావం చూపగలవని రాజకీయ విశ్లేషకుల అంచనా.. అయితే ఈ స్థానాల్లో అధిక స్థానాలను దక్కించుకుంటే.. బీజేపీ ప్లాన్ సాఫీగా సాగుతుంది. అయితే.. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ- రాధా స్వామి సత్సంగ్‌ అధిపతి బాబా గురీందర్‌ సింగ్‌తో సమావేశం అయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సైతం ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అమృత్‌సర్‌లో అకాల్‌ తఖ్త్‌ బాధ్యులు జ్ఞాని హర్‌ప్రీత్‌ సింగ్‌నూ కలిశారు. నూర్‌ మహల్‌ డేరా, డేరా సచ్‌ఖండ్‌ బల్లాన్‌, సంత్‌ నిరంకారి మిషన్‌ తదితర అధిపతులతో ఇప్పటికే బీజేపీ నేతలు చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. వారు కూడా సానుకూలంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

  • 20 Feb 2022 08:09 AM (IST)

    పంజాబ్‌లో ఓటింగ్ ప్రారంభమైంది..

    పంజాబ్ అసెంబ్లీకి ఓటింగ్ ప్రారంభమైంది.

  • 20 Feb 2022 07:38 AM (IST)

    మూడో దశ పోలింగ్..

    ఉత్తర ​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మూడో దశ పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గం. నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ మొదలైంది. 16 జిల్లాల పరిధిలోని 59 స్థానాలకు ఈ దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. మూడో దశ పోలింగ్ స్వరూపం..

    1. మొత్తం స్థానాలు- 59
    2. అభ్యర్థులు- 627 మంది
    3. ఓటర్లు- 2.15 కోట్లు
  • 20 Feb 2022 07:35 AM (IST)

    ప్రజాస్వామ్య పటిష్టతకు మీ ఓటు అమూల్యమైనది.. – సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్

    ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మూడో దశ పోలింగ్ ప్రారంభమైంది. పంజాబ్‌లోని అన్ని స్థానాలకు.. యుపిలోని మూడవ దశకు ఓటు వేయడానికి ముందు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ట్వీట్ చేస్తూ, ప్రజాస్వామ్య ఎన్నికల్లో ఓటు వేయడం ద్వారా మీ భాగస్వామ్యాన్ని నిర్ధారించుకోవాలని అన్నారు. ప్రజాస్వామ్య పటిష్టతకు ప్రతి ఓటు అమూల్యమైనదని తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

  • 20 Feb 2022 07:33 AM (IST)

    బుందేల్‌ఖండ్‌లో మూడో దశలో పోలింగ్‌..

    బుందేల్‌ఖండ్‌లో మూడో దశలో పోలింగ్‌ జరుగుతున్న 5 జిల్లాల్లోని 13 అసెంబ్లీ స్థానాలను 2017లో బీజేపీ క్లీన్‌స్వీప్‌ చేసింది. ఈసారి ఆ ఫలితాన్ని పునరావృతం చేస్తామని ఆ పార్టీ ధీమాతో ఉంది. అందుకే ఈ ప్రాంతంలో బీజేపీ దూకుడుగా ప్రచారం చేసింది. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సహా ప్రముఖులు 31 బహిరంగ సభలు, రోడ్‌ షోలు నిర్వహించారు. సీఎం యోగి ఐదు జిల్లాల్లో కేవలం 28 గంటల్లో 8 బహిరంగ సభల్లో పాల్గొన్నారు.

  • 20 Feb 2022 07:05 AM (IST)

    బరిలో 1304 మంది అభ్యర్థులు

    పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల 2022 కోసం మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు ఈరోజు పోలింగ్ జరగనుంది. ఈసారి మొత్తం 1304 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.  ఇది పంజాబ్‌లో 16వ ఎన్నికలు.

Published On - Feb 20,2022 7:03 AM