East Godavari: బైక్‌ను ఢీకొట్టిన వ్యాన్.. కొడుకుతో సహా దంపతుల దుర్మరణం..

East Godavari Accident: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా ఎదురులంక - యానాం బాలయోగి వంతెనపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో

East Godavari: బైక్‌ను ఢీకొట్టిన వ్యాన్.. కొడుకుతో సహా దంపతుల దుర్మరణం..
Road Accident
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 20, 2022 | 12:58 PM

East Godavari Accident: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా ఎదురులంక – యానాం బాలయోగి వంతెనపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఆదివారం బైక్‌ను వ్యాన్‌ ఢీకొట్టింది. ( Road Accident) ద్విచక్రవాహనంపై వెళ్తున్న దంపతులతో సహా కుమారుడు మృతి చెందాడు. ఘటనలో కుమార్తెకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆమెను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కుటుంబంతో సహా.. వ్యక్తి కాకినాడ (Kakinada) వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో వంతెనపై  ట్రాఫిక్ జాం అయింది.

మృతులు ఐ.పోలవరం మండలానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వ్యాన్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పేర్కొంటున్నారు. మృతులకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Also Read:

Rajasthan Crime: ఘోర ప్రమాదం.. అదుపు తప్పి నదిలో పడ్డ కారు.. వరుడు సహా తొమ్మిది మంది మృతి

Babu Gogineni: ఏ పార్టీకి మద్దతు లేదు.. సోషల్ మీడియాలో ప్రచారంపై బాబు గోగినేని క్లారిటీ..

భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్