Rajasthan Crime: ఘోర ప్రమాదం.. అదుపు తప్పి నదిలో పడ్డ కారు.. వరుడు సహా తొమ్మిది మంది మృతి

రాజస్థాన్‌ (Rajasthan) లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోట(Kota) సమీపంలో జరిగిన ఈ దుర్ఘటనలో వరుడుతో సహా తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. వివాహ వేడుక కోసం ఉజ్జయినికి...

Rajasthan Crime: ఘోర ప్రమాదం.. అదుపు తప్పి నదిలో పడ్డ కారు.. వరుడు సహా తొమ్మిది మంది మృతి
Rj Accident
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 20, 2022 | 11:35 AM

రాజస్థాన్‌ (Rajasthan) లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోట(Kota) సమీపంలో జరిగిన ఈ దుర్ఘటనలో వరుడుతో సహా తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. వివాహ వేడుక కోసం ఉజ్జయినికి కారులో వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కోట సమీపంలోని కల్వర్టు వద్ద కారు అదుపుతప్పి చంబల్‌(Chambal) నదిలో పడిపోయింది. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న జిల్లా యంత్రాంగం, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్‌ సాయంతో నదిలో పడిపోయిన కారును బయటకు తీశారు. మద్యం తాగి వాహనం నడపడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. కారులో తొమ్మిది మృతదేహాలు ఉన్నట్లు సహాయ సిబ్బంది తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఆదివారం ఉదయం 5.30 గంటలకు వరుడి బంధువులు.. సవాయి మాధోపూర్ నుంచి ఉజ్జయినికి వెళ్తున్నారు. ఈ క్రమంలో వీరు ప్రయాణిస్తున్న వాహనం కోటక సమీపంలోని నయాపురా కల్వర్టు వద్ద అదుపు తప్పి చంబల్ నదిలో పడిపోయింది. కారులో ఉన్న వారు వాహనం డోర్, విండోస్ తెరిచేందుకు ప్రయత్నించినప్పటికీ అది సాధ్యం కాలేదు. కారులో ఏడు మృతదేహాలు లభ్యం కాగా.. ఘటన జరిగిన ప్రదేశానికి కొంత దూరంలో మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. కారులో ఇంకెవరైనా ఉన్నారా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కారు ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు.

Also  Read

Crime News: ఆమ్లెట్ వేయలేదని భార్య గొంతు కోసిన భర్త.. ఆ తర్వాత దారుణంగా..

మద్యం తాగి వేధిస్తున్నాడని.. భర్త జననాంగాలు కోసి చంపిన భార్య

Tollywood: ఈరోజు టాలీవుడ్ కీలక సమావేశం.. సమస్యల పరిష్కారం కోసం సినీ పెద్దలు..