AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈరోజు టాలీవుడ్ కీలక సమావేశం.. సమస్యల పరిష్కారం కోసం సినీ పెద్దలు..

గత కొద్ది రోజులుగా సినీ పరిశ్రమలోని సమస్యలు.. టికెట్స్ రేట్స్ అంశాలపా అనిశ్చితి నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే సినీ రంగంలోని సమస్యలను పరిష్కరించేందుకు సినీ పెద్దలు

Tollywood: ఈరోజు టాలీవుడ్ కీలక సమావేశం.. సమస్యల పరిష్కారం కోసం సినీ పెద్దలు..
Tollywod
Rajitha Chanti
|

Updated on: Feb 20, 2022 | 11:55 AM

Share

గత కొద్ది రోజులుగా సినీ పరిశ్రమలోని సమస్యలు.. టికెట్స్ రేట్స్ అంశాలపా అనిశ్చితి నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే సినీ రంగంలోని సమస్యలను పరిష్కరించేందుకు సినీ పెద్దలు సమావేశం కానున్నారు. ఈ భేటీ గత కొద్దిరోజులుగా వాయిదా పడుతూ వస్తుంది. తాజాగా టాలీవుడ్‌ కీలక సమావేశానికి ముహూర్తం ఖరారైంది. ఇవాళ తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు భేటీ కానున్నారు. ఈ సమావేశానికి హీరోలు.. నిర్మాతలు.. దర్శకులు.. డిస్ట్రిబ్యూటర్లు..సహా ఇండస్ట్రీలోని 24 శాఖలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారు. ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్‏లో ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో ఏం చర్చించనున్నారన్నది హాట్‌టాపిక్‌ మారింది.

సినిమా టికెట్లతో పాటు.. సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారానికి ముందడుగు పడింది. ఇవాళ టాలీవుడ్‌ ప్రముఖులు భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు ఫిల్మ్‌ నగర్‌ కల్చరల్‌ క్లబ్‌లో సమావేశం కాబోతున్నారు. సమావేశంలో తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన 24 క్లాఫ్ట్స్‌ సభ్యులంతా హాజరు కాబోతున్నారు. ఈ కీలక మీటింగ్‌కు మొత్తం 240 మంది సభ్యులకు ఆహ్వానం అందింది. సమావేశంలో ప్రధానంగా సినీపరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, కార్మికుల సంక్షేమంపై చర్చించనున్నట్లు సమాచారం. ఏపీలో సినిమా టికెట్ల ధరలపెంపు అంశంపై ప్రభుత్వం నుంచి ముందడుగు పడిన తర్వాత తొలిసారిగా టాలీవుడ్‌ పెద్దలు భేటీ అవుతుండడం ఆసక్తికరంగా మారింది.

సినీ పరిశ్రమ సమస్యలపై.. ఈ మధ్యనే టాలీవుడ్ ప్రముఖులు చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి ఏపీ సీఎం జగన్‌తో సమావేశమై పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి వచ్చారు. టిక్కెట్ల ధరల తగ్గింపుపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది. త్వరలోనే టిక్కెట్ల ధరలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌ ప్రముఖులతోపాటు సినీ ఇండస్ట్రీకి చెందిన అన్ని విభాగాల ప్రతినిధులు భేటీ అవుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏపీలో సినిమా టికెట్ల ధరల పెంపు అంశంతోపాటు సినీ రంగంలో 24 క్రాఫ్ట్స్‌లో కార్మికులు పడుతున్న ఇబ్బందులపై ప్రధానంగా చర్చించనున్నారు. సీఎం జగన్‌తో టాలీవుడ్‌ ప్రముఖుల భేటీ తర్వాత జరిగే తొలి సమావేశం కావడంతో సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. 15 రోజుల క్రితమే సమావేశం జరగాల్సి ఉన్నా.. మెగాస్టార్‌ చిరంజీవి సీఎం జగన్‌తో భేటీ అవుతున్న కారణంగా వాయిదా వేశారు.

Also Read: Keerthy Suresh: కీర్తి సురేష్ కొత్త అవతారం.. ఆ హీరోతో కలిసి లాయర్‍గా మారిన మహానటి..

Ester Noronha: విడాకులు తీసుకున్న తర్వాతే సంతోషంగా ఉన్నానంటున్న హీరోయిన్.. ఆ సింగర్ మాజీ భార్య షాకింగ్ కామెంట్స్..

Skin Care: మీ చర్మం తరచూ పొడిబారుతుందా ? అయితే మీకు ఈ వ్యాధులు ఉన్నట్లే.. ఏంటంటే..

AP Crime News: అయ్యో ఇంత ప్రేమనా..? కుక్క చనిపోయిందని యజమాని కూడా..